Tuesday, May 12, 2009

లవ్ బర్డ్స్

రెహమాన్ స్వరకల్పనలోని అందమంతా ఈ పాట లో కనిపిస్తుంది...
తోడుగా అంతే అందంగా సమకూరిన సిరివెన్నెల సాహిత్యం...
వెరసి భూలోకంలో కూడా అమృతం ఉందని నిరూపిస్తున్నాయి మన తెలుగు పాటలు .


మనసున మనసుగ, నిలిచిన కలవా....

లవ్ బర్డ్స్
సంగీతం : A.R.రెహమాన్
రచన: సిరివెన్నెల


పల్లవి : మనసున మనసుగ, నిలిచిన కలవా....
పిలిచిన పలకగ ఎదుటనే కలవా,
దొరికినదే నా స్వర్గం, పరిచినది విరి మార్గం
మిన్నుల్లో నీవే ,మన్నుల్లో నీవే ,
కన్నుల్లో నీవే ........రావా

మనసున మనసుగ, నిలిచిన కలవా....

చరణం : మేఘం నేల ఒళ్ళు మీటే రాగామల్లే...
ప్రేమా వరాల జల్లు కావా...
పిలుపే అందుకొని,బదులే తెలుపుకొని ,కౌగిట ఒదిగి ఉండనీవా....
నా గుండె కోవెల విడిచి వెళ్ళ తగునా ...తగునా,
మల్లె పూల మాలై నిన్నే వరించి పూజించే వేళా
నిరీక్షించి స్నేహం కోరి , జతనై రానా ...రానా...
ఉప్పొంగి పోయే ప్రాయం నిన్ను విడువదు ఏ వెళైనా
నా శ్వాస ప్రతి పూట వినిపించు నీ పాట..
ఏడేడు జన్మలు నేనుంటా నీ జంట ...


మనసున మనసుగ, నిలిచిన కలవా....


చరణం : పూవై నవ్వులని , తేనై మాధురిని పంచే పాట మన ప్రేమ ...
విరిసే చంద్రకళ , ఎగసే కడలి అల , పలికే కవిత మన ప్రేమ ....
కాలాన్ని పరిపాలిద్దాం, కన్న కలలే నిజమై ....
వేటాడు ఎడబాటు, ఏనాడు కలగదు ఇక ఇటుపై ..

నూరేళ్ళ కాలం కూడా, ఒక్క క్షణమై.. నువ్వూ నేను చేరి సగమవుదాం వయస్సు పండించే వరమై ..
ప్రియమైన అనురాగం పలికింది మధుగీతం, తుది లేని ఆనందం వేచేనే నీకోసం ..

మనసున మనసుగ, నిలిచిన కలవా....
పిలిచిన పలకగ ఎదుటనే కలవా,
దొరికినదే నా స్వర్గం, పరిచినది విరి మార్గం
మిన్నుల్లో నీవే ,మన్నుల్లో నీవే ,
కన్నుల్లో నీవే ........రావా

మనసున మనసుగ, నిలిచిన కలవా....