పొడగంటిమయ్య మిమ్ము పురుషోత్తమా మమ్ము
పొడగంటిమయ్య మిమ్ము పురుషోత్తమా మమ్ము
నెడయకవయ్య కోనేటి రాయడా
కోరిమమ్ము నేలినట్టి కులదైవమా,
చాలనేరిచి పెద్దలిచ్చిన నిధానమా
గారవించి దప్పిదీర్చు కాలమేఘమా,
మాకుచేరువజిత్తములోని శ్రీనివాసుడా
భావింప గైవసమైన పారిజాతమా,
మమ్ముచేవదేర గాచినట్టి చింతామణీ
కావించి కోరికలిచ్చే కామధేనువా,
మమ్ముతావై రక్షించేటి ధరణీధరా
చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా,
రోగాలడచి రక్షించే దివ్యౌషధమా
బడిబాయక తిరిగే ప్రాణబంధుడా,
మమ్ముగడియించినట్టి శ్రీ వేంకటనాథుడా
Showing posts with label అన్నమాచార్య కీర్తనలు. Show all posts
Showing posts with label అన్నమాచార్య కీర్తనలు. Show all posts
Monday, December 24, 2007
కొండలలో నెలకొన్న....

కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
కొండలంత వరములు గుప్పెడు వాడు....
కుమ్మర దాసుడైన కురువరతినంబి
యిమ్మన్న వరములెల్ల నిచ్చిన వాడు
దొమ్ములు సేసిన యట్టి తొండ మాం చక్కుర వర్తి
రమ్మన్న చోటికి వచ్చి నమ్మిన వాడు..
అచ్చపు వేడుకతోడ ననంతాళు వారికి
ముచ్చిలి వెట్టికి మన్ను మోచిన వాడు
మచ్చిక దొలక దిరుమలనంబి తోడుత
నిచ్చనిచ్చ మాటలాడి నొచ్చిన వాడు..
కంచిలోనుండ తిరుకచ్చినంబి మీద
కరుణించి తనయెడకు రప్పించిన వాడు
ఎంచి యెక్కుడైన వేంకటేశుడు మనలకు
మంచివాడై కరుణ బాలించినవాడు
అన్నమాచార్య కీర్తనలు

చేరి యశోదకు .......
చేరి యశోదకు శిశువితడు ధారుణి బ్రహ్మకు తండ్రియు నితడు
సొలసి జూచినను సూర్యచంద్రులను లలివెదజల్లెడు లక్షణుడు
నిలిచిన నిలువున నిఖిల దేవతల కలిగించు సురల గనివో యితడు
మాటలాడినను మరియజాండములు కోటులు వొడమెటి గుణరాశి
నీటుగ నూర్పుల నిఖిల వేదములు చాటువ నూరెటి సముద్రుడితడు
ముంగిట పొలసిన మోహన మాత్మల పొంగించే ఘన పురుషుడు
సంగతి మావంటి శరణాగతులకు అంగము శ్రీ వేంకటాధిపుడితడు
Subscribe to:
Posts (Atom)