Wednesday, December 30, 2009

గాయం

గాయం
రచన : సిరివెన్నెల
గానం : S.P.బాలసుబ్రమణ్యం

నిగ్గ దీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని
మారదు లోకం మారదు కాలం
దేవుడు దిగి రాని యెవ్వరు యేమై పోని
మారదు లోకం మారదు కాలం

గాలి వాటు గమనానికి కాలి బాట దేనికి
గొర్రెదాటు మందకి మీ జ్ణానబోధ దేనికి
యే చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠం
యే క్షణాన మార్చుకుంది జిత్తుల మార్గం
రామబాణమార్పిందా రావణ కాష్ఠం
కృష్ణ గీత ఆపిందా నిత్య కురుక్షేత్రం

నిగ్గ దీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని
మారదు లోకం మారదు కాలం

పాత రాతి గుహలు పాల రాతి గృహాలయినా
అడవి నీతి మారిందా ఎన్ని యుగాలయినా
వేట అదే వేటు అదే నాటి కధే అంతా
నట్టడవులు నడివీధికి నడిచొస్తే వింతా
బలవంతులె బ్రతకాలని సూక్తి మరవకుండా
శతాబ్ధాలు చదవలేదా ఈ అరణ్యకాండ

నిగ్గ దీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని
మారదు లోకం మారదు కాలం
దేవుడు దిగి రాని యెవ్వరు యేమై పోని
మారదు లోకం మారదు కాలం

చల్లని వెన్నెలలో …చల్లని వెన్నెలలో

గానం : ఘంటసాల

పల్లవి : చల్లని వెన్నెలలో …చల్లని వెన్నెలలో…ఓఓఓ
చల్లని వెన్నెలలో చక్కని కన్నె సమీపములో. …
చల్లని వెన్నెలలో చక్కని కన్నె సమీపములో
అందమే నాలో లీనమాయెనే ఆనందమే నా గానమాయెనే
చల్లని వెన్నెలలో...

చరణం : తెలిమబ్బుల కౌగిలిలో జాబిలి తేలి ఆడెనే ముద్దులలో
తెలిమబ్బుల కౌగిలిలో జాబిలి తేలి ఆడెనే ముద్దులలో
గాలి పెదవులే మెల్లగ సోకిన …గాలి పెదవులే మెల్లగ సోకిన
పూలు నవ్వెనే నిద్దురలో ఓఓఓ...
చల్లని వెన్నెలలో…చక్కని కన్నె సమీపములో …
అందమే నాలో లీనమాయెనే
ఆనందమే నా గానమాయెనే …
చల్లని వెన్నెలలో

చరణం : కళకళలాడే కన్నె వదనమే కనిపించును ఆ తారలలో ఓ…. ఓఓ… ఓఓఓ…ఓఓ…
కళకళలాడే కన్నె వదనమే కనిపించును ఆ తారలలో
కలకాలం నీ కమ్మని రూపము ,..కలకాలమం నీ కమ్మని రూపము
కలవరించునలే నా మదిలో … ఓఓఓ....చల్లని వెన్నెలలో ..
చక్కని కన్నె సమీపములో అందమే నాలో లీనమాయెనే
ఆనందమే నా గానమాయెనే చల్లని వెన్నెలలో

చంద్రలేఖ

ఉరుములు నీ మువ్వలై, మెరుపులు నీ నవ్వులై

రచన : సిరివెన్నెల
గానం : రాజేష్

పల్లవి : ఉరుములు నీ మువ్వలై, మెరుపులు నీ నవ్వులై
తొలకరి మేఘానివై రా అలివేణి, పరుగులు నీ గానమై, తరగలు నీ తాళమై
చిలిపిగ చిందాడవే కిన్నెరసా..ని…

కాలానికే కాలాడక ఆగాలి నువ్వు ఆడే వేళ
అది చూడగా మనసాగక ఆడాలి నీతో నింగి నేల

తకధిమి తాళాలపై తళుకుల తరంగమై, చిలిపిగ చిందాడవే కిన్నెరసా…ని..
మెలకల మందాకిని కులుకుల బృందావని, కనులకు విందీయవే ఆ అందాన్ని…

చరణం : చంద్రుల్లో కుందేలే మా ఇంట ఉందంటూ
మురిసింది ఈ ముంగిలి
చిందాడే కిరణంలా మా ముందు నువ్వుంటే
ప్రతి పూట దీపావళి

మా కళ్ళల్లో వెలిగించవే సిరివెన్నెల
మా ఆశలే నీ అందెలై ఈ మంచు మౌనం మ్రోగే వేళ
ఆ సందడే ఆనందమై, ప్రేమించు ప్రాణం పాడే వేళ…

ఉరుములు నీ మువ్వలై, మెరుపులు నీ నవ్వులై.
తొలకరి మేఘానివై రా కల్యాణి

పరుగులు నీ గానమై, తరగలు నీ తాళమై
చిలిపిగ చిందాడవే కిన్నెరసాని

చరణం : నడయాడే నీ పాదం నట వేదమేనంటు
ఈ పుడమే పులకించగా
నీ పెదవే తనకోసం అనువైన కొలువంటు
సంగీతం నిను చేరగా

మా గుండెనే శృతి చేయవా నీ వీణగా
ఈ గాలిలో నీ వేలితో రాగాలు ఎన్నో రేగేవేలా
నీ మేనిలో హరివిల్లులే వర్ణాల వాగులై సాగేవేళ

ఉరుములు నీ మువ్వలై, మెరుపులు నీ నవ్వులై.
తొలకరి మేఘానివై రా కల్యాణి

పరుగులు నీ గానమై, తరగలు నీ తాళమై
చిలిపిగ చిందాడవే కిన్నెరసాని