Monday, March 31, 2008

చందమామ

నాలో ఊహలకు...

ఈ మధ్యనే ఈ సినిమా చూశాను,ఎప్పటిలాగానే కృష్ణ వంశీ మార్కు సాంప్రదాయం,మోడ్రెన్ లుక్ రెండూ ఉన్నాయి,సింధు నటన నచ్చింది.పాటలు కూడా బాగానే ఉన్నాయి.ఓవరాల్ గా బాగుంది...

సంగీతం: కె.ఎం.రాధాకృష్ణన్
గానం: ఆశా భోస్లే

పల్లవి :నాలో ఊహలకు
నాలో ఊసులకు అడుగులు నేర్పావూ
నాలో ఆశలకు
నాలో కాంతులకు నడకలు నేర్పావూ

పరుగులుగా ...
పరుగులుగా అవే ఇలా ఇవాళ నిన్నే చేరాయీ...
నాలో ఊహలకు..నాలో ఊసులకు అడుగులు నేర్పావూ...

చరణం : కళ్ళలో...మెరుపులే
గుండెలో...ఉరుములే
పెదవిలో...పిడుగులే
నవ్వులో...వరదలే

శ్వాసలోనా...పెనుతుఫానే... ప్రళయమవుతుంది ఇలా...

నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావూ
నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావు

చరణం : మౌనమే...విరుగుతూ
బిడియమే...ఒరుగుతూ
మనసిలా...మరుగుతూ
అవధులే...కరుగుతూ
నిన్ను చూస్తూ,ఆవిరవుతూ... అంతమవ్వాలనే...

నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావూ
నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావూ

పరుగులుగా ...
పరుగులుగా అవే ఇలా ఇవాళ నిన్నే చేరాయీ...

నాలో ఊహలకు...నాలో ఊసులకు అడుగులు నేర్పావూ...
నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావూ

జై

ఎన్ని ఆశలో..
గానం : శ్రేయ ఘోషల్
సంగీతం : అనూప్ రుబెన్స్
రచన : కులశేఖర్

పల్లవి : ఎన్ని ఆశలో చిన్ని గుండెలోనా
ఎంత అల్లరో మల్లె మనసులోనా
తీయనీ బాధ ఏమిటో
ఆపినా ఆగదేమిటో
ఉన్నమాటలే రాని వేళలో కొత్త మాటకై తొందరెమిటో
తెలుసునా చిలిపి ప్రాయమా
చరణం : గుండె గూటిలోనా నా కంటి పాపలోనా
చెప్పలేని సిగ్గులెందుకో
కొంటె ఊసులోనా ఈ కొత్త హాయిలోనా
పైట కొంగు జారెనెందుకో
గాలి అలలపైన ఉయ్యాలలూగుతున్న
మాట తాని నేను ఈ పాట పాడుతున్నా
ఎందుకోసమో ఎవరికోసమో తెలుసునా చిలిపి ప్రాయమా

ఎన్ని ఆశలో చిన్ని గుండెలోనా
ఎంత అల్లరో మల్లె మనసులోనా

చరణం : ఎన్ని రోజులైన ఈ వింత మోజు లోనా
ఆకలంటూ ఉండదేమిటో
ఎన్ని రాత్రులైనా ఎంత మాత్రమైనా
కంటి రెప్ప వాలదెందుకో
మూగ సైగలోనా మోగింది మౌన వీణ
పాల గుండె లోన పున్నాగ పూల వాన
ఎందుకోసమో ఎవరికోసమో తెలుసునా చిలిపి ప్రాయమా

ఎన్ని ఆశలో చిన్ని గుండెలోనా
ఎంత అల్లరో మల్లె మనసులోనా
తీయనీ బాధ ఏమిటో
ఆపినా ఆగదేమిటో
ఉన్నమాటలే రాని వేళలో కొత్త మాటకై తొందరెమిటో
తెలుసునా చిలిపి ప్రాయమా

శివ 2006

అప్పటికీ ఇప్పటికీ ఇళయరాజా సంగీతానికీ మొదటి స్థానమే...

ఏ ఊహలోనో తేలానేమో !
గానం: శ్రేయా ఘోషల్ , విజయ్ ప్రకాష్
సంగీతం : ఇళయరాజా

ఏ ఊహలోనో తేలానేమో
ఓ వింత లోకం చేరానేమో
నా కళ్ళలో మెరిసే కాంతులూ
ఇన్నాళ్ళలో లేవే ఎన్నడూ
ఈ క్షణం ఇదేమిటో మాయో హాయో తేలని

ఏ ఊహలోనో తేలానేమో
ఓ వింత లోకం చేరానేమో

మనకేం తెలుసు సమయం ఎటు పోయిందో
మురిసే మనసు అడగదు ఏమయిందో
మనకేం తెలుసు సమయం ఎటు పోయిందో
మురిసే మనసు అడగదు ఏమయిందో

నీలాల నీకళ్ళ లోతుల్లో మునిగాక తేలేది ఎలాగో మరి
వేవేల వర్ణాల తారల్ని తాకందే ఆగేనా ఈ అల్లరీ
ప్రియమైన బంధం బిగించే వేళలో
జతలోన అందం తరించే లీలలో
ఈ నేల పొంగి ఆ నింగి వంగి హద్దేమి లేనట్టు ముద్దాడుకున్నట్టు !

ఏ ఊహలోనో తేలానేమో
ఓ వింత లోకం చేరానేమో

నీలో నాలో ..ఆ .. ఆ
నీలో నాలో కరగని తలపుల దాహం
నువ్వో నేనో తెలియని ముడిపడు మోహం
నీలో నాలో కరగని తలపుల దాహం
నువ్వో నేనో తెలియని ముడిపడు మోహం

అణువు అణువు నిలువెల్ల రగిలించి కరిగించు కౌగిళ్ళలో
తాపాల దీపాలు వెలిగించి వెతకాలి నాలోని నువ్వెక్కడో
ఏ సూర్యుడో మనని లేపే లోపుగా
ఈ లోకమే మరిచి పోదాం కైపుగా
ఏ కంటిచూపు ఈ జంట వైపు రాలేని చోటేదో రమ్మంది లెమ్మంటు !

ఏ ఊహలోనో తేలానేమో
ఓ వింత లోకం చేరానేమో
నా కళ్ళలో..
నా కళ్ళలో మెరిసే కాంతులూ
ఇన్నాళ్ళలో..
ఇన్నాళ్ళలో లేవే ఎన్నడూ
ఈ క్షణం ఇదేమిటో మాయో హాయో తేలని

ఏ ఊహలోనో తేలానేమో
ఓ వింత లోకం చేరానేమో

పంతులమ్మ

మానసవీణా మధుగీతం...
సంగీతం: రాజన్-నాగేంద్ర
సాహిత్యం: వేటూరి
గానం: ఎస్.పి.బాలసుబ్రమణ్యం, పి.సుశీల

పల్లవి : మానసవీణా మధుగీతం
మన సంసారం సంగీతం
సాగర మధనం అమృత మధురం
సంగమ సరిగమ స్వర పారిజాతం

మానసవీణా మధుగీతం
మన సంసారం సంగీతం
సంసారం సంగీతం

చరణం : యే రాగమో ఏమో మన అనురాగం వలపు వసంతానా హృదయ పరాగం
ఆ.. ఆ
ఆ.. ఆ
యే రాగమో ఏమో మన అనురాగం వలపు వసంతానా హృదయ పరాగం
ఎదలోయలలో నిదురించిన నా కోరిక పాడే కోయిల గీతం
శతవసంతాల దశ దిషాంతాల సుమ సుగంధాల బ్రహ్మార నాదాల
కుసుమించు నీ అందమే విరిసింది అరవిందమై కురిసింది మకరందమే

మానసవీణా మధుగీతం
మన సంసారం సంగీతం
సంసారం సంగీతం

చరణం : జాబిలి కన్నా నా చెలి మిన్నా పులకింతలకే పూచిన పొన్నా
కానుకలేమి నేనివ్వగలను కన్నుల కాటుక నేనవ్వగలను
పాల కడలిలా వెన్నెల పొంగింది పూల పడవలా నా తనువూగింది
ఏ మల్లెల తీరాల నిను చెరగలనో
మనసున మామతై కడతేరగలనూ

మానసవీణా మధుగీతం
మన సంసారం సంగీతం
సంసారం సంగీతం

కురిసే దాకా అనుకోలేదు శ్రావణ మేఘమనీ
తడిసే దాకా అనుకోలేదు తీరని దాహమనీ
కలిసే దాకా అనుకోలేదు తీయని స్నేహమనీ

మానసవీణా మధుగీతం
మన సంసారం సంగీతం
సాగర మధనం అమృత మధురం
సంగమ సరిగమ స్వర పారిజాతం

మానసవీణా మధుగీతం
మన సంసారం సంగీతం
సంసారం సంగీతం
సంసారం సంగీతం

Friday, March 28, 2008

గాయం

అలుపన్నది ఉందా..

గానం: చిత్ర
సంగీతం: శ్రీ
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

పల్లవి : అలుపన్నది ఉందా..ఎగిరే అలకు..ఎదలోని లయకు
అదుపన్నది ఉందా..కలిగే కలకు..కరిగే వరకు
మెలికెలు తిరిగే నది నడకలకు
మరి మరి ఉరికే మది తలపులకు
లల లలా లలలలలా

అలుపన్నది ఉందా..ఎగిరే అలకు..ఎదలోని లయకు
అదుపన్నది ఉందా..కలిగే కలకు..కరిగే వరకు

చరణం : నాకోసమే చినుకై కరిగి ఆకాశమే దిగదా ఇలకు
నా సేవకే సిరులే చిలికి దాసోహమే అనదా వెలుగు
అరారు కాలాల అందాలు బహుమతి కావా నా ఊహలకు
కలలను తేవా నా కన్నులకు
లల లలా లలలలలా

అలుపన్నది ఉందా..ఎగిరే అలకు..ఎదలోని లయకు
అదుపన్నది ఉందా..కలిగే కలకు..కరిగే వరకు

చరణం : నీ చూపులే తడిపే వరకు ఏమైనదో నాలో వయసు
నీ ఊపిరే తగిలే వరకు ఎటు ఉన్నదో మెరిసే సొగసు
ఏడేడు లోకాల ద్వారాల తలుపులు తెరిచే తరుణం కొరకు
ఎదురుగ నడిచే తొలి ఆశలకు
లల లలా లలలలలా

అలుపన్నది ఉందా..ఎగిరే అలకు..ఎదలోని లయకు
అదుపన్నది ఉందా..కలిగే కలకు..కరిగే వరకు
మెలికెలు తిరిగే నది నడకలకు
మరి మరి ఉరికే మది తలపులకు
లల లలా లలలలలా

నువ్వు నేను ప్రేమ

ప్రేమించే ప్రేమవా
గానం : శ్రేయ ఘోషల్
సంగీతం : A.R.రెహమాన్

పల్లవి : ప్రేమించే ప్రేమవా,ఊరించే ఊహవా,
ప్రేమించే ప్రేమవా పూవల్లే పుష్పించే,
నే నేనా అడిగా నన్ను నేనే,
నే నీవే హృదయం అన్నదే,
ప్రేమించే ప్రేమవా,ఊరించే ఊహవా,
ప్రేమించే ప్రేమవా పూవల్లే పుష్పించీ,

రంగు రంగోలి కోరింది నువుపెట్టే
రంగే పెట్టిన మేఘం విరిసి గాజుల సవ్వడి ఘల్ ఘల్,
రంగు రంగోలి కోరింది నువుపెట్టి
రంగే పెట్టిన మేఘం విరిసి
సుందరి,వందరి,చిందల ,వందల,చల్లని పున్నమి వెన్నల విందుల.

చరణం : పూవై నే పుస్తున్నా నీ పరువంగానే పుడతా,
మధుమాసపు మల్లెల మాటలు రగిలించే ఉసురే,
నీవే నా మదిలో ఆడ నేనే నీ మతమై రాగా,
నా నాడుల నీ రక్తం నడకల్లో నీ శబ్దం .... ఉందేమో,
తోడే దొరకని రోజు విల విల లాడేఒంటరి వీనం ..మ్మ్..,

ప్రేమించే ప్రేమవా,ఊరించే ఊహవా,
ప్రేమించే ప్రేమవా పూవల్లే పుష్పించే,
నే నేనా అడిగా నన్ను నేనే,
నే నీవే హృదయం అన్నదే

చరణం : నెల నెల వేడుక అడిగి నెలవంకల గుడి కడదమ,
నా పొదరింటికి వేరే అతిధులు రాతరమా ఆ...,
తుమ్మెద తేనెలు తేలె నీ మదిలో చోటిస్తావ,
నీ ఒదిగే ఎద పై ఎవరొ నిదురించ తరమా ఆ,
నీవే సంద్రం చేరి గల గల పారీ నది తెలుసా..,

ప్రేమించే ప్రేమవా,ఊరించే ఊహవా,
ప్రేమించే ప్రేమవా పూవల్లే పుష్పించీ,
నీ నేనా అడిగా నన్ను నేనే,
నీ నీవే హృదయం ఆనాడే,
ప్రేమించే ప్రేమవా,ఊరించే ఊహవా,
ప్రేమించే ప్రేమవా పూవల్లే పుష్పించీ,

రంగు రంగోలి కోరింది నువు పెట్టే
రంగే పెట్టిన మేఘం విరిసి గాజుల సవ్వడి ఘల్ ఘల్,
రంగు రంగోలి కోరింది నువుపెట్టి
రంగే పెట్టిన మేఘం విరిసి
సుందరి,వందరి,చిందల ,వందల,చల్లని పున్నమి వెన్నల విందుల.

అంతఃపురం

అసలేం గుర్తుకురాదు ...

గానం :చిత్ర
సంగీతం :ఇళయరాజా

పల్లవి : అసలేం గుర్తుకురాదు నా కన్నులముందు నువ్వు ఉండగా
అసలేం తోచదు నాకు ఓ నిమిషం పాటు నిన్ను చూడకా
నీలో ఉందీ నా ప్రాణం ...అది నీకు తెలుసునా
ఉన్నా నేనూ నీకోసం ...నువ్వు దూరమైతె బతకగలనా

ఏం గుర్తుకురాదు నా కన్నులముందు నువ్వు ఉండగా
అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడ నిన్ను చూడకా

చరణం : గోరువెచ్చని ఊసుతో చిన్నబుచ్చకనీ .. వినిపించనీ
ఆకుపచ్చని ఆశతో నిన్ను చుట్టుకుని .. చిగురించనీ
అల్లుకోమని గిల్లుతున్నది చల్ చల్లని గాలి
తెల్లవారులు అల్లలరల్లరి సాగించాలి
ఏకమయె ... ఏకమయె ఏకాంతం లోకమయె వేళ
అహ జంట ఊపిరి వేడికి మరిగింది వెన్నెలా !

అసలేం గుర్తుకురాదు నా కన్నులముందు నువ్వు ఉండగ
అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడ నిన్ను చూడక
నీలో ఉందీ నా ప్రాణం .. అది నీకు తెలుసునా
ఉన్నా నేనూ నీకోసం .. నువ్వు దూరమైతె బతకగలనా

ఏం గుర్తుకురాదు నా కన్నులముందు నువ్వు ఉండగా
అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడ నిన్ను చూడకా

చరణం : కంటిరెప్పల చాటుగా నిన్ను దాచుకుని .. బంధించనీ
కౌగిలింతల సీమలో కోట కట్టుకుని .. కొలువుండనీ
చెంత చేరితె చేతి గాజులు .. చేసే గాయం
జంట మధ్యన సన్నజాజులు .. హాహాకారం
మళ్ళీ మళ్ళీ ..
మళ్ళీ మళ్ళీ ఈ రోజూ రమ్మన్నా రాదేమో
నిలవనీ చిరకాలమిలాగే ఈ క్షణం

అసలేం గుర్తుకురాదు నా కన్నులముందు నువ్వు ఉండగా
అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడ నిన్ను చూడకా
నీలో ఉందీ నా ప్రాణం .. అది నీకు తెలుసునా
ఉన్నా నేనూ నీకోసం .. నువ్వు దూరమైతె బతకగలనా

ఏం గుర్తుకురాదు నా కన్నులముందు నువ్వు ఉండగా
అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడ నిన్ను చూడకా

Thursday, March 27, 2008

పదహారేళ్ళ వయసు

సంగీతం : చక్రవర్తి
సాహిత్యం : వేటూరి
గానం : S.జానకి

పల్లవి : సిరిమల్లె పువ్వా
సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా...చిన్నారి చిలకమ్మా
నా వాడు ఎవరే నా తోడు ఎవరే...ఎన్నాళ్ళకొస్తాడే
సిరిమల్లె పువ్వా...

చరణం : తెల్లారబోతుంటీ నా కల్లోకి వస్తాడే
కళ్ళరా చూదామంటే నా కళ్ళు మూస్తాడే
ఆ అందగాడు నా ఈడు జోడు ఏడే
ఈ సందె కాడ నా చందమామ రాడే
చుక్కల్లారా దిక్కులుదాటి వాడెన్నాళ్ళకొస్తాడో

సిరిమల్లె పువ్వా...
సిరిమల్లె పువ్వా... సిరిమల్లె పువ్వా...చిన్నారి చిలకమ్మ
నా వాడు ఎవరే నా తోడు ఎవరే..ఎన్నాళ్ళకొస్తాడే

చరణం : కొండల్లో కోనల్లో కూ యన్న ఓ కోయిలా
ఈ పూల వానల్లో ఝుమ్మన్న ఓ తుమ్మెదా
వయసంతా వలపై మనసే మైమరపై ఊగేనే
పగలంతా దిగులు రేయంతా వగలు రేగేనే
చుక్కల్లారా దిక్కులుదాటి వాడెన్నాళ్ళకొస్తాడో...

సిరిమల్లె పువ్వా...
సిరిమల్లె పువ్వా... సిరిమల్లె పువ్వా...చిన్నారి చిలకమ్మ
నా వాడు ఎవరే నా తోడు ఎవరే..ఎన్నాళ్ళకొస్తాడే

Friday, March 7, 2008

రోజా

గానం :బాలసుబ్రమణ్యం
సంగీతం : రెహమాన్

పల్లవి : నా చెలి రోజావే నాలో వున్నావే నిన్నే తలచేనే నేనే
నా చెలి రోజావే నాలో వున్నావే నిన్నే తలచేనే నేనే
కళ్ళల్లో నీవే కన్నీటా నీవే
కనుమూస్తే నీవే ఎదలోనిండేవే
కనిపించవో అందించవో తోడు
నా చెలి రోజావే నాలో వున్నావే నిన్నే తలచేనే నేనే

చరణం : గాలి నన్ను తాకినా నిన్ను తాకు ఙ్ఞాపకం
గులాబీలు పూసినా చిలిపి నవ్వు ఙ్ఞాపకం
అలలు పొంగి పారితే చెలియ పలుకు ఙ్ఞాపకం
మేఘమాల సాగితే మోహ కథలు ఙ్ఞాపకం
మనసు లేకపోతే మనిషి ఎందుకంటా
నీవులేకపోతే బతుకు దండగంటా
కనిపించవో అందించవో తోడు
నా చెలి రోజావే నాలో వున్నావే నిన్నే తలచేనే నేనే
నా చెలి రోజావే నాలో వున్నావే నిన్నే తలచేనే నేనే
కళ్ళల్లో నీవే కన్నీటా నీవే
కనుమూస్తే నీవే ఎదలోనిండేవే
కనిపించవో అందించవో తోడు

చరణం : చెలియ చెంత లేదులే చల్లగాలి ఆగిపో
మమత దూరమాయెనే చందమమ దాగిపో
కురుల సిరులు లేవులే పూలవనం వాడిపో
తోడు లేదు గగనమా చుక్క లాగ రాలిపో
మనసులోని మాట ఆలకించలేవా
వీడిపోని నీడై నిన్ను చేరనీవా
కనిపించవో అందించవో తోడు

నా చెలి రోజావే నాలో వున్నావే నిన్నే తలచేనే నేనే
నా చెలి రోజావే నాలో వున్నావే నిన్నే తలచేనే నేనే
కళ్ళల్లో నీవే కన్నీటా నీవే
కనుమూస్తే నీవే ఎదలోనిండేవే
కనిపించవో అందించవో తోడు

ఇందిర

గానం : హరిణి
సంగీతం : A.R.రెహమాన్

పల్లవి : లాలీ లాలీ అను రాగం పాడుతుంటే
ఎవరూ నిదురపోరే...చిన్నపోదా మరీ చిన్ని ప్రాణం
కాసే వెన్నెలకు వీచే గాలులకు హృదయం కుదుటపడదే
అంతచేదా మరీఎ వేణు గానం
కళ్ళు మేలుకుంతే కాలమాగుతుందా భారమైన మనసా....
ఆ పగటి బాధలన్ని మరచిపోవుటకె ఉంది కద ఈ ఏకాంత వేళా...

చరణం : ఎటో పోయేటి నీలి మేఘం,వర్షం చిలికి వెళ్ళదా
ఏదో అంటుంది కోయిల పాట,రాగం ఆలకించదా
అన్ని వైపులా మధువనం,..పూలుపూయదా అనుక్షణం...
అణువణువునా జీవితం అందజేయదా అమృతం

లాలీ లాలీ అను రాగం పాడుతుంటే
ఎవరూ నిదురపోరే...చిన్నపోదా మరీ చిన్ని ప్రాణం
కాసే వెన్నెలకు వీచే గాలులకు హృదయం కుదుటపడదే
అంతచేదా మరీఎ వేణు గానం
కళ్ళు మేలుకుంతే కాలమాగుతుందా భారమైన మనసా....
ఆ పగటి బాధలన్ని మరచిపోవుటకె ఉంది కద ఈ ఏకాంత వేళా...