డాక్టర్.చక్రవర్తి
సంగీతం : మాస్టర్ వేణు
గానం : P.సుశీల
పల్లవి :నీవు లేక వీణ పలుకలేనన్నది
నీవు రాక రాధ నిలువలేనన్నది
నీవు లేక వీణ..ఆ ఆ ...
చరణం : జాజిపూలు నీకై రోజు రోజు పూచే
చూసి చూసి పాపం సొమ్మసిల్లిపోయే
చందమామ నీకై తొంగి తొంగి చూచి
చందమామ నీకై తొంగి తొంగి చూచి
సరసను లేవని అలుకలు బోయే
నీవు లేక వీణ..ఆ ఆ ...
చరణం : కలనైన నిన్ను కనులచూదమన్నా
నిదుర రాని నాకు కలలు కూడా రావే
కదలలేని కాలం విరహ గీతి రేపి
కదలలేని కాలం విరహ గీతి రేపి
పరువము వృధగా బరువుగ సాగే
నీవు లేక వీణ..ఆ ఆ ...
చరణం : తలుపులన్ని నీకై తెరచి ఉంచినాను
తలపులన్ని నీకై దాచి వేచినాను
తాపమింక నేను ఓపలేను స్వామి
తాపమింక నేను ఓపలేను స్వామి
తరుణిని కరుణను ఏలగ రావా
నీవు లేక వీణ పలుకలేనన్నది
నీవు రాక రాధ నిలువలేనన్నది
నీవు లేక వీణ..ఆ ఆ ...