Monday, August 2, 2010

ప్రియమైన నీకు

మనసున వున్నదీ చెప్పాలనున్నదీ మాటలు రావేఁ ఎలా
మాటున వున్నదీ ఓ మంచి సంగతీ బయటకు రాదేఁ ఎలా
అతడిని చూస్తే రెప్పలు వాలిపోయే బిడియం ఆపేదెలా
ఎదురుగ వస్తే చెప్పక ఆగిపోయే తలపులు చూపేదెలా
ఒకసారి దరిచేరి యద గొడవేమిటో తెలుపకపోతే ఎలా..
లలలా లల లల లలలలలాలాలా (మనసున)

చరణం 1

చింత నిప్పల్లె తీయంగ వుందని
ఎంత నొప్పైన తెలియలేదనీ
తననే తలుచుకునే వేడిలో
ప్రేమ అంటేనే తీయని బాధని
లేక గుండెల్లో కొండంత బరువనీ
కొత్తగా తెలుసుకునే వేళలో
కనబడుతోందా నా ప్రియమైన నీకు
నా యద కోత అని అడగాలనీ
అనుకుంటూ తన చుట్టూ మది తిరిగిందనీ
తెలుపకపోతే ఎలా.. (మనసున)

చరణం 2

నీలికన్నుల్లో ఆతని బొమ్మని
చూసి నాకింక చోటెక్కడుందనీ
నిదరే కసురుకునే రేయిలో
మేలుకున్నా ఇదేం వింత కైపని
వేల ఊహల్లో ఊరేగు చూపుని
కలలే ముసురుకునే హాయిలో
వినబడుతోందా నా ప్రియమైననీకు
ఆశలరాగం అని అడగాలని
పగలేదో రేయేదో గురుతే లేదనీ
తెలపకపోతే ఎలా.. (లలలా) (మనసున)

కరిగేలోగా ఈ క్షణం, గడిపేయాలి జీవితం

ఆర్య-2
సంగీతం : దేవిశ్రీప్రసాద్

పాట modern గా ఉన్నా భావం చాలా బాగుంటుంది.
కరిగేలోగా ఈ క్షణం, గడిపేయాలి జీవితం శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా
కనులైపోయే సాగరం అలలై పొంగే జ్ఞాపకం కలలే జారే కన్నీరే చేరగా
గడిచే నిమిషం గాయమై ప్రతి గాయం ఓ గమ్యమై ఆ గమ్యం నీ గుర్తుగా నిలిచే నా ప్రేమ కరిగేలోగా

చరణం 1పరుగులు తీస్తూ అలసిన ఓ నది నేను
ఇరు తీరాల్లో దేనికి చేరువ కాను
నిదురను దాటి నదిచిన ఓ కల నేను
ఇరు కన్నుల్లో దేనికి సొంతం కాను
నా ప్రేమే నేస్తం అయ్యిందా
నా సగమేదో ప్రశ్నగ మారిందా
నేడీ బంధానికి పేరుందా
ఉంటే విడదీసే వీలుందా

కరిగేలోగా ఈ క్షణం, గడిపేయాలి జీవితం శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా
కనులైపోయే సాగరం అలలై పొంగే జ్ఞాపకం కలలే జారే కన్నీరే చేరగా

చరణం 2
అడిగినవన్నీ కాదని పంచిస్తూనే
మరునిముషంలో అలిగే పసివాడివిలే
నీ పెదవులపై వాడని నవ్వులు పూలు
నువు పెంచావా నీ కన్నీటిని చల్లి
సాగే మీ జంటను చూస్తుంటే
నా బాధంతటి అందంగా ఉందే
ఈ క్షణమే నూరేళ్ళవుతానంటే
మరు జన్మే క్షణమైనా చాలందే