సంగీత దర్శకులు "శ్రీ" గారికి అశృనివాళి...
గాయం,లిటిల్ సోల్జర్స్, సింధూరం, అనగనగా ఒక రోజు వంటి చిత్రాలతో సంగీత దర్శకుడిగానే కాక జగమంత కుటుంబం వంటి పాటలతో గాయకుడిగా కూడా అందరికీ సుపరిచితులే అయిన శ్రీ గారికి అశృనివాళి ...
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ.

రచన : సిరివెన్నెల
సంగీతం : స్వర్గీయ చక్రి
గానం : శ్రీ
పల్లవి:
జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది
జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది
సంసార సాగరం నాదే..సన్యాసం శూన్యం నావే
జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది
చరణం:
జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది
సంసార సాగరం నాదే..సన్యాసం శూన్యం నావే
జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది
చరణం:
కవినై..కవితనై..భార్యనై..భర్తనై ….కవినై..కవితనై..భార్యనై..భర్తనై
మల్లెలదారిలో..మంచు ఎడారిలో
మల్లెలదారిలో మంచు ఎడారిలో పన్నీటి జయగీతాలు..కన్నీటి జలపాతాల
నాతో నేను అంగమిస్తూ..నాతో నేను రమిస్తూ..
వంటరినై అనవరతం .. ఉంటున్నాను నిరంతరం
కలల్ని..కధల్ని..మాటల్ని..పాటల్ని..రంగుల్ని..రంగవల్లుల్ని..కావ్య కన్నెల్ని..ఆడపిల్లల్ని
జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది
చరణం:
మల్లెలదారిలో..మంచు ఎడారిలో
మల్లెలదారిలో మంచు ఎడారిలో పన్నీటి జయగీతాలు..కన్నీటి జలపాతాల
నాతో నేను అంగమిస్తూ..నాతో నేను రమిస్తూ..
వంటరినై అనవరతం .. ఉంటున్నాను నిరంతరం
కలల్ని..కధల్ని..మాటల్ని..పాటల్ని..రంగుల్ని..రంగవల్లుల్ని..కావ్య కన్నెల్ని..ఆడపిల్లల్ని
జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది
చరణం:
మింటికి కంటిని నేనై..కంటను మంటను నేనై…
మింటికి కంటిని నేనై..కంటను మంటను నేనై
మంటల మాటున వెన్నెల నేనై..
వెన్నెల పూతల మంటను నేనై..
రవినై..శశినై..దివమై..నిశినై..
నాతో నేను సహగమిస్తూ..నాతో నేనే రమిస్తూ
వంటరినై ప్రతినిముషం .. కంటున్నాను నిరంతరం
కిరణాల్ని కిరణాల..హరిణాల్ని హరిణాల..చరణాల్ని చరణాల
చలనాన కనరాని గమ్యాల కాలాన్ని..ఇంద్రజాలాన్ని

గాలిపల్లకీ లోన తరలినా పాట పాప ఊరేగి వెడలె
గొంతువాకిలిని మూసి మరలి తను మూగవోయి నా గుండె మిగిలె
నా హృదయమే నా లోగిలీ..నా హృదయమే నా పాటకి తల్లీ..
నా హృదయమే నాకు ఆలి..నా హృదయములో ఇది సినీ వాలి..