Friday, May 23, 2008

శివపుత్రుడు

సంగీతం : ఇళయరాజా
గానం : R.P. పట్నాయక్

పల్లవి :చిరుగాలి వీచెనే...
చిగురాశ రేపెనే
వెదురంటి మనసులో రాగం వేణు ఊదెనే
మేఘం మురిసి పాడెనే

కరుకైన గుండెలో..చిరుజల్లు కురిసెనే..
తనవారి పిలుపులో
ఆశలు వెల్లువాయెనే..ఊహలు ఊయలూపెనే..
ఆశలు వెల్లువాయెనే..ఊహలు ఊయలూపెనే..

చినుకు రాక చూసి మది చిందులేసెనే..
చిలిపితాళమేసి చెలరేగి పోయెనే..

చిరుగాలి వీచెనే...
చిగురాశ రేపెనే
వెదురంటి మనసులో రాగం వేణు ఊదెనే
మేఘం మురిసి పాడెనే

చరణం : తుళ్ళుతున్న చిన్ని సెలయేరు
గుండెలోన పొంగి పొలమారు
అల్లుకున్న ఈ బంధమంతా
వెల్లువైనదీ లోగిలంతా
పట్టెడన్నమిచ్చి పులకించే
నేలతల్లివంటి మనసల్లే
కొందరికే హౄదయముందీ
నీకొరకే లోకముందీ
నీకూ తోడు ఎవరంటు లేరూ గతములో
నేడు చెలిమికై చాపే,ఆరే బ్రతుకులో

కలిసిన బంధం , కరిగిపోదులే
మురళి మోవి,విరివి తావి కలిసిన వేళా

చిరుగాలి వీచెనే...
చిగురాశ రేపెనే
వెదురంటి మనసులో రాగం వేణు ఊదెనే
మేఘం మురిసి పాడెనే

చరణం : మనసున వింత ఆకాశం
మెరుపులు చిందె మనకోసం
తారలకే తళుకు బెళుకా
ప్రతి మలుపూ ఎవరికెరుకా
విరిసిన ప్రతి పూదోటా
కోవెల ఒడి చేరేనా
ౠణమేదో మిగిలి ఉందీ
ఆ తపనే తరుముతోందీ

రోజూ ఊహలే ఊగే,రాగం గొంతులో
ఏవో పదములే పాడే,మోహం గుండెలో

ఏనాడూ తోడు లేకనే
కడలి ఒడిని చేరుకున్న గోదారల్లే

కరుకైన గుండెలో....చిరుజల్లు కురిసెనే
తనవారి పిలుపులో...
ఆశలు వెల్లువాయెనే,ఊహలు ఊయలూపెనే
ఆశలు వెల్లువాయెనే,ఊహలు ఊయలూపెనే

చినుకు రాక చూసి మది చిందులేసెనే
చిలిపితాళమేసి చెలరేగి పోయెనే...

Thursday, May 22, 2008

సంతోషం

So much to say that i Love you.....
I Love this song So.........much

గానం : రాజేష్
సంగీతం : R.P. పట్నాయక్

So much to say that I Love you
Now that so much I Need you
How would it be if you leave me
Feeling for me to believe me
Im all alone ...But not alone
Living for you and dying for you
Im all alone ...But not alone
Living for you and dying... for you

సొంతం

ఎపుడూ నీకు నే తెలుపనిది
గానం : మల్లిఖార్జున్
సంగీతం : దేవి శ్రీ ప్రసాద్

ఎపుడూ నీకు నే తెలుపనిది ఇకపై ఎవరికీ తెలియనిదీ
మనసే మోయగలదా జీవితాంతం
వెతికే తీరమే రానంది బ్రతికే దారినే మూసింది
రగిలే నిన్నలేనా నాకు సొంతం
సమయం చేదుగా నవ్వింది హృదయం బాధగా చూసింది
నిజమే నీడగా మారింది

జ్ఞాపకం సాక్షిగా పలకరించావు ప్రతి చోట
జీవితం నీవనీ గురుతు చేసావు ప్రతి పూట
ఒంటిగా బతక లేనంటూ వెంట తరిమావు ఇన్నాళ్ళూ
మెలకువేరాని కలగంటూ గడపమన్నావు నూరేళ్ళూ
ప్రియతమా నీ పరిచయం ఒక ఊహేగాని ఊపిరిగ సొంతం కాదా

Thursday, May 8, 2008

అతడు

గానం : శ్రేయా ఘోషాల్
సంగీతం : మణిశర్మ

పల్లవి :పిల్ల గాలి అల్లరి ఒళ్ళంత గిల్లి నల్లమబ్బు ఉరిమేనా
కళ్ళెర్ర జేసి మెరుపై తరిమేన
యెల్లలన్నీ కరిగి జల్లుమంటు ఉరికీ
మా కళ్ళలో, వాకిళ్ళలో వెవేల వర్నాల వయ్యారి జాణ
అందమైన సిరివాన ముచ్చటగ మెరిసే సమయాన
అందరాని చంద్రుడైన, మ ఇంట్లో బంధువల్లె తిరిగేనా

చరణం : మౌనాల వెనకాలా వైనాలు తెలిసేలా
గారంగ పిలిచేనా ఝల్లు మంటు గుండెలోన
తుంటరిగా తుళ్ళుతున్న థిల్లానా
ఇంద్ర జాలమై వినోదాల సుడిలొ కాలాన్ని కరిగించగా
చంద్ర జాలమై తారంగాల వొడిలో యెల్లన్ని మురిపించగ
తారలన్ని తోరణాలై వారాల ముత్యాల హారలయ్యెన
చందనాలు చిలికేనా ముంగిల్లొ నందనాలు విరిసేనా
అందరాని చంద్రుడైన, మా ఇంట్లో బంధువల్లె తిరిగేనా

చరణం : నవ్వుల్లొ హాయి రాగం మువ్వల్లొ వాయు వేగం
ఎమైందొ ఇంత కాలం ఇంతమంది బృంద గానం
ఇవ్వాళే పంపెనేమొ ఆహ్వానం
పాల వెల్లిగా సంతోషాలు చిలికే సరదా సరాగాలుగా
స్వాతి ఝల్లుగా స్వరాలెన్నొ పలికె సరికొత్త రాగాలుగా
నింగి దాక పొంగి పోగా హోరెత్తి పొతున్న గానా బజాన
చెంగు మంటు ఆడేనా చిత్రంగా జావళీలు పాడేనా
అందరాని చంద్రుడైన, మ ఇంట్లో బంధువల్లె తిరిగేనా

పిల్ల గాలి అల్లరి ఒళ్ళంత గిల్లి నల్లమబ్బు ఉరిమేనా
కళ్ళెర్ర జేసి మెరుపై తరిమేన
యెల్లలన్నీ కరిగి జల్లుమంటు ఉరికీ
మా కళ్ళలో, వాకిళ్ళలో వెవేల వర్నాల వయ్యారి జాణ
అందమైన సిరివాన ముచ్చటగ మెరిసే సమయాన
అందరాని చంద్రుడైన, మ ఇంట్లో బంధువల్లె తిరిగేనా

సఖి

అలై పొంగెరా కన్నా ...
గానం : హరిణి
సంగీతం A.R.రెహమాన్
రచన : వేటూరి
అలై పొంగెరా కన్నా
మానసమలై పొంగెరా

ఆనంద మోహన వేణుగానమున ఆలాపనే
కన్నా మానసమునలై పొంగెరా
నీ నవరస మోహన వేణుగానమది

నిలబడి వింటూనే చిత్తరువైనాను
కాలమాగినదిరా దొరా ప్రాయమను
యమున మురళీధర యవ్వనమలైపొంగెరా

కనుల వెన్నెల పట్ట పగల్పాల్చిలుకగా
కలువరేకుల మంచు ముత్యాలు వెలిగే
కన్నె మోమున కనుబొమ్మలతో పొంగే
కాదిలి వేణుగానం కానడ పలికే
కన్నె వయసు కలలొలికే వేళలో
కన్నె సొగసు ఒక విధమై ఒదిగెలే

అనంత మనాది వసంత పదాల సరాగ సరాల స్వరానివా
నిశాంత మహీజ శకుంతమరంద మెడారి గళాన వర్షించవా
ఒక సుగంధ వనాన సుఖాల క్షణాన వరించి కౌగిళ్ళు బిగించవా

కడలికి అలలకు కధకళి కలలిడు శశి కిరణము వలె చలించవా
చిగురు సొగసులను కలిరుటాకులకు రవికిరణాలె రచించవాకవిత మదిని రగిలే ఆవేదనా ఇతర భామలకు లేని వేదనా
ఇది తగునో యెద తగవో ఇది ధర్మం అవునోకొసరి ఊదు వేణువున వలపులే చిలుకు
మధుర గాయమిది గేయము పలుకగా

అనుకోకుండా ఒక రోజు

ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని
గానం : స్మిత
సంగీతం : కీరవాణి

పల్లవి :ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని
ఎదురొస్తే ఎగబడిపోరా నేనే ఆ చిత్రాన్ని

ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని
ఎదురొస్తే ఎగబడిపోరా నేనే ఆ చిత్రాన్ని
నే పండిస్తున్నా రైతునై చిరునవ్వు తోటల్ని
పరిపాలిస్తున్నా రాజునేనై కోటిగుండెల కోటల్ని
ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని

చరణం : రాళ్ళే ఉలిక్కిపడాలి నా రాగం వింటే
ఊళ్ళే ఉప్పొంగిపోవాలి నా వేగం వెంటే
కొండవాగులై ఇలా నేను చిటికేస్తే
క్షణాలన్ని వీణ తీగలై స్వరాలెన్నో కురిపిస్తాయంటే అంతే
అది నిజమోకాదో తేలాలంటే చూపిస్తాగా నాతో వస్తే నమ్మేంత గమ్మత్తుగా
ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని

చరణం :చంద్రుడికి మన భాషే నేర్పిస్తా తెలుగు కథ తెలిసేలా
ఇంద్రుడికి చూపిస్తా ఇంకో ఇంద్రుడున్న దాఖలా
ఆంధ్రుడెవరంటే జగదేకవీరుడని
ఆ స్వర్గం కూడా తలవంచేలా మన జెండా
ఎగరాలీవేళ చుక్కల్ని తాకేంతలా

ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని
ఎదురొస్తే ఎగబడిపోరా నేనే ఆ చిత్రాన్ని
నే పండిస్తున్నా రైతునై చిరునవ్వు తోటల్ని
పరిపాలిస్తున్నా రాజునేనై కోటిగుండెల కోటల్ని
ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని