Thursday, May 8, 2008

అతడు

గానం : శ్రేయా ఘోషాల్
సంగీతం : మణిశర్మ

పల్లవి :పిల్ల గాలి అల్లరి ఒళ్ళంత గిల్లి నల్లమబ్బు ఉరిమేనా
కళ్ళెర్ర జేసి మెరుపై తరిమేన
యెల్లలన్నీ కరిగి జల్లుమంటు ఉరికీ
మా కళ్ళలో, వాకిళ్ళలో వెవేల వర్నాల వయ్యారి జాణ
అందమైన సిరివాన ముచ్చటగ మెరిసే సమయాన
అందరాని చంద్రుడైన, మ ఇంట్లో బంధువల్లె తిరిగేనా

చరణం : మౌనాల వెనకాలా వైనాలు తెలిసేలా
గారంగ పిలిచేనా ఝల్లు మంటు గుండెలోన
తుంటరిగా తుళ్ళుతున్న థిల్లానా
ఇంద్ర జాలమై వినోదాల సుడిలొ కాలాన్ని కరిగించగా
చంద్ర జాలమై తారంగాల వొడిలో యెల్లన్ని మురిపించగ
తారలన్ని తోరణాలై వారాల ముత్యాల హారలయ్యెన
చందనాలు చిలికేనా ముంగిల్లొ నందనాలు విరిసేనా
అందరాని చంద్రుడైన, మా ఇంట్లో బంధువల్లె తిరిగేనా

చరణం : నవ్వుల్లొ హాయి రాగం మువ్వల్లొ వాయు వేగం
ఎమైందొ ఇంత కాలం ఇంతమంది బృంద గానం
ఇవ్వాళే పంపెనేమొ ఆహ్వానం
పాల వెల్లిగా సంతోషాలు చిలికే సరదా సరాగాలుగా
స్వాతి ఝల్లుగా స్వరాలెన్నొ పలికె సరికొత్త రాగాలుగా
నింగి దాక పొంగి పోగా హోరెత్తి పొతున్న గానా బజాన
చెంగు మంటు ఆడేనా చిత్రంగా జావళీలు పాడేనా
అందరాని చంద్రుడైన, మ ఇంట్లో బంధువల్లె తిరిగేనా

పిల్ల గాలి అల్లరి ఒళ్ళంత గిల్లి నల్లమబ్బు ఉరిమేనా
కళ్ళెర్ర జేసి మెరుపై తరిమేన
యెల్లలన్నీ కరిగి జల్లుమంటు ఉరికీ
మా కళ్ళలో, వాకిళ్ళలో వెవేల వర్నాల వయ్యారి జాణ
అందమైన సిరివాన ముచ్చటగ మెరిసే సమయాన
అందరాని చంద్రుడైన, మ ఇంట్లో బంధువల్లె తిరిగేనా

2 comments:

ప్రపుల్ల చంద్ర said...

మీ ప్రయత్నం అభినందనీయం, ఇంకా ఎన్నో మంచి పాటల సాహిత్యాన్ని అందిస్తారని ఆశిస్తున్నాను

చందమామ said...

ప్రఫుల్ల చంద్ర గారు...
తప్పకుండా మంచి పాటలన్నీ చేర్చటానికి ప్రయత్నిస్తాను.
మీ అభిమానానికి ధన్యవాదాలు.