Thursday, November 19, 2009

Black & White

వలపననా వల అననా ....

ఈ పాట ఒక ఫ్రెండ్ దగ్గర విన్నాను. మొదటి సారి వినగానే చాలా నచ్చింది. ఒక్కో పదం చాలా అందంగా పేర్చారు.

Simply superb Lyrics !!!

గానం : S.P.బాలసుబ్రఃమణ్యం , చిత్ర

పల్లవి : వలపననా వల అననా వయసును తరుముతున్న తపనా
వరమగునా చెర అగునా వరసలు కలుపుతున్న లలనా
ముసిరే చీకతైనా తన జతలో వేకువవునా
నడిచే దారిలోనా ప్రతిమలుపు నాదయేనా
ఆ నిలువుటద్దమే నా ఎదుటున్నా ఆమె రూపు చూస్తున్నా
తన కంటి పాపల అద్దం లోనా నన్ను పోల్చుకున్నా

చరణం : తోడులేని ఈ ఏకాకి జీవితానా, ఏడు అడుగులు నన్నల్లుకుంది మైనా
ఎండ మావులే వెంటాడు గుండెలోనా, ఆమె రాకతో ఆకాసగంగలైనా
నిన్నలేని ఈ సంతోషమిందుకేనా, ఉన్నపాటుగా తారల్లో తేలుతున్నా.
ముళ్ళ చాటు పూల ఘుమ ఘుమ , పంచుతున్న నా ప్రియతమా
చేరువైన ప్రాణబంధమా కలయా, నిజమా కనవే ప్రేమా...

వలపననా వల అననా వయసును తరుముతున్న తపనా
వరమగునా చెర అగునా వరసలు కలుపుతున్న లలనా

చరణం : తీగచాటుగా తుళ్ళేటి పూవుకైనా, సందెవాలితే ఆ నవ్వు సొంతమౌనా...
తీరమెంతగా వద్దంటు వారిస్తున్నా, కడలి చేరదా పొంగేటి గోదారైనా
ఘడియ గదిపినా నీ ప్రేమ నీడ లోనా, సాటిరావుగా ఏడేడు జన్మలైనా
కోకిలమ్మ తీపి సరిగమ పూల ఋతువుకే సొంతమా
కోరుకున్న ప్రేమ మధురిమ కొసరే క్షణమా , ఇది నీ మహిమా


వలపననా వల అననా వయసును తరుముతున్న తపనా
వరమగునా చెర అగునా వరసలు కలుపుతున్న లలనా
ముసిరే చీకతైనా తన జతలో వేకువవునా
నడిచే దారిలోనా ప్రతిమలుపు నాదయేనా
ఆ నిలువుటద్దమే నా ఎదుటున్నా ఆమె రూపు చూస్తున్నా
తన కంటి పాపల అద్దం లోనా నన్ను పోల్చుకున్నా....

వలపననా వల అననా వయసును తరుముతున్న తపనా
వరమగునా చెర అగునా వరసలు కలుపుతున్న లలనా

No comments: