Friday, February 12, 2010

డాన్స్ మాష్టర్

One of my most favourite songs.....!!!


సంగీతం : ఇళయరాజా
రచన : వేటూరి
గానం : చిత్ర

రానేలా వసంతాలే
రానేలా వసంతాలే శృతి కానేలా సరాగాలే
నీవేనా జీవనరాగం స్వరాల బంధం
నీదేనా యవ్వన కావ్యం స్మరించే గీతం
రానేలా వసంతాలే...

చరణం 1 : ఈ మౌన పంజరాన నే మూగనై
నీ వేణువూదగానే నే రాగమే
ఎగిరే పోతమై విరిసే తోటనై
ఏ పాట పాడినా పది పువులై
అవి నేల రాలిన చిరుతావినై
బదులైనలేని ఆశలారబోసి
రానేలా వసంతాలే...

చరణం 2 : ఓ ప్రేమికా చెలియా ఒడి చేరవా
ఈ చెలిమిని ఇపుడే దరిజేర్చవా
రగిలే తాపమే ఎదలో తీరగా
నీ చూపుతోనె చలి తీరగా
నీ స్పర్శతోనే మది పాడగా
ఎదమీటిపోయే ప్రెమగీతిలాగ

రానేలా వసంతాలే
రానేలా వసంతాలే శృతి కానేలా సరాగాలే
నీవేనా జీవనరాగం స్వరాల బంధం
నీదేనా యవ్వన కావ్యం స్మరించే గీతం
రానేలా వసంతాలే...

No comments: