Wednesday, April 27, 2011

ఒకరికి ఒకరు

False వాయిస్ తో పాడినా కీరవాణి గారి వాయిస్ చాలా బాగా సూట్ అయింది ఈ పాట కు.

గానం & సంగీతం : కీరవాణి

వెళ్ళిపోతె ఎలా మనసా ఎటో అలా,ఇనా ఎందుకె ఇలా తడబాటు అంతలా
తెగ హుషారుగా ఎగిరిపోకే,తగని ఊహ వెంట
సరైన దారి తెలియందే,ఈ ఉరుకులెందుకంట
వెళ్ళిపోతే ఎలా వెళ్ళిపోతే ఎలా

ఆమె వలలో చిక్కుకున్న సమయం
ప్రేమ లయలో దూకుతోందా హృదయం
నేను ఇపుడెక్కడున్నానంటే,నాక్కూడ అంతు చిక్కకుంటే
గమ్మత్తుగానే ఉన్నదంటే,నాకేదో మత్తు కమ్మినట్టే
రమ్మంది కాని నన్ను చేరి మెరుపు సైగ చేసి
చెప్పింది నింగి చెలి దారి చినుకు వంతెనేసి

వెళ్ళనంటే ఎలా మనసా అటే అలా
వెళ్ళనంటే ఎలా ఎలా హే హే....

తాను కూడ రాకపొతే నాతో,నేను కూడా ఆగిపొనా తనతొ
నా ప్రాణం ఉంది తన వెంటే,నా ఊపిరుంది తననంటే
కళ్ళార చూసానంటు వుంటే,ఎల్లా నమ్మేదీ స్వప్నమంటే
వెనక్కి వెళ్ళి వెతకాలి తిరిగి ఆ క్షణాన్ని
మరొక్కసారి చూడాలి కనులు ఆ నిజాన్ని

వెళ్ళనంటే ఎలా మనసా అటే అలా
వెళ్ళనంటే ఎలా ఎలా హే హే....

Friday, April 15, 2011

సిద్ధు From సికాకుళం

Short Duration Song అయినా Instrument Using చాలా Perfect గా ఉంటుంది...

సంగీతం: K.M.రాధాకృష్ణన్
రచన: పెద్దాడ మూర్తి
గానం: గాయత్రి

తెల్లారి పోనీకూ ఈ రేయినీ,చేజారి పోనీకూ ఈ హాయినీ
మనసు కనక,మనవి వినక,చెలికి మరి దూరాన ఉంటే ఎలా ....
తెల్లారి పోనీకూ ఈ రేయినీ,చేజారి పోనీకూ ఈ హాయినీ

ఆ నింగి జాబిలమ్మ తోడుగానె ఉందిగా
చుక్కే నీదంటు ,పక్కే రమ్మంటు,చూస్తావేంటలా

తెల్లారి పోనీకూ ఈ రేయినీ,చేజారి పోనీకూ ఈ హాయినీ

ఏ మంత లేనిదాన్ని కానిదాన్ని కాదుగా
ఏలా ఛీ పో లు ,పైపై కోపాలు ,నాపై నీకిలా

తెల్లారి పోనీకూ ఈ రేయినీ,చేజారి పోనీకూ ఈ హాయినీ
మనసు కనక,మనవి వినక,చెలికి మరి దూరాన ఉంటే ఎలా ....
తెల్లారి పోనీకూ ఈ రేయినీ,చేజారి పోనీకూ ఈ హాయినీ

Wednesday, April 6, 2011

అస్త్రం

ప్రేమ కన్న ఏముంది ప్రియం, ప్రియా ప్రేమించు క్షణం...

రచన : వేటూరి
సంగీతం :S.A.రాజ్ కుమార్
గానం : రాజేష్

ప్రేమ కన్న ఏముంది ప్రియం ప్రియా ప్రేమించు క్షణం
ప్రేమకున్న ప్రాణాలు మనం ప్రియా కానివ్వు సగం
ఎదే పెట్టే సొదే ఓ ఆపదై వేధించగా
అదే పొంగే సుధై ఏ దేవతో దీవించగా
This is my love... This is my love...
ఇదో కథలే,ఇదో జతలే...
ప్రేమ కన్న ఏముంది ప్రియం ప్రియా ప్రేమించు క్షణం
ప్రేమకున్న ప్రాణాలు మనం ప్రియా కానివ్వు సగం

కలవరమొక వరమనుకో కలలను కంటూ
ప్రతి నిమిషము నీదనుకో జతపడి ఉంటూ
నింగి నేలకి స్నేహం ఎప్పుడైనది,
అప్పుడే కదా ప్రేమా చప్పుడైనది
వలపే సోకని నాడు, ఎడారే గుండె చూడు
ముళ్ళని చూడకు, నేడు గులాబి పూలకు
This is my love...This is my love
ఇదే కథలే... ఇలా మొదలే...

ప్రేమ కన్న ఏముంది ప్రియం ప్రియా ప్రేమించు క్షణం
ప్రేమకున్న ప్రాణాలు మనం ప్రియా కానివ్వు సగం

నిదురెరగని తనువులతో నిలువని పరుగు
మధువుల తడి పెదవులతో పిలువని పిలుపు
మండుటెండలా తాకే పండు వెన్నెల
కొండ వాగులా మారే ఎండమావిలా
కనులే మూయను నేను, జపిస్తూ ప్రేమ రూపం
కవితే రాయను నేను, లిఖిస్తా నీ స్వరూపం
This is my love...This is my love...
ప్రతి ఎదలో ఇదో కథలే