Wednesday, April 6, 2011

అస్త్రం

ప్రేమ కన్న ఏముంది ప్రియం, ప్రియా ప్రేమించు క్షణం...

రచన : వేటూరి
సంగీతం :S.A.రాజ్ కుమార్
గానం : రాజేష్

ప్రేమ కన్న ఏముంది ప్రియం ప్రియా ప్రేమించు క్షణం
ప్రేమకున్న ప్రాణాలు మనం ప్రియా కానివ్వు సగం
ఎదే పెట్టే సొదే ఓ ఆపదై వేధించగా
అదే పొంగే సుధై ఏ దేవతో దీవించగా
This is my love... This is my love...
ఇదో కథలే,ఇదో జతలే...
ప్రేమ కన్న ఏముంది ప్రియం ప్రియా ప్రేమించు క్షణం
ప్రేమకున్న ప్రాణాలు మనం ప్రియా కానివ్వు సగం

కలవరమొక వరమనుకో కలలను కంటూ
ప్రతి నిమిషము నీదనుకో జతపడి ఉంటూ
నింగి నేలకి స్నేహం ఎప్పుడైనది,
అప్పుడే కదా ప్రేమా చప్పుడైనది
వలపే సోకని నాడు, ఎడారే గుండె చూడు
ముళ్ళని చూడకు, నేడు గులాబి పూలకు
This is my love...This is my love
ఇదే కథలే... ఇలా మొదలే...

ప్రేమ కన్న ఏముంది ప్రియం ప్రియా ప్రేమించు క్షణం
ప్రేమకున్న ప్రాణాలు మనం ప్రియా కానివ్వు సగం

నిదురెరగని తనువులతో నిలువని పరుగు
మధువుల తడి పెదవులతో పిలువని పిలుపు
మండుటెండలా తాకే పండు వెన్నెల
కొండ వాగులా మారే ఎండమావిలా
కనులే మూయను నేను, జపిస్తూ ప్రేమ రూపం
కవితే రాయను నేను, లిఖిస్తా నీ స్వరూపం
This is my love...This is my love...
ప్రతి ఎదలో ఇదో కథలే

No comments: