Thursday, July 3, 2014

ష్...గప్ చుప్

తెలుగందాలే ...

నాకు నచ్చిన వేటూరి గారి పాటల్లో ఇదీ ఒకటి.
అచ్చమైన తెలుగు పాటకు ఇప్పటికీ ఎప్పటికీ చిరునామా వేటూరి పాటే...

రచన : వేటూరి
గానం : బాలుచిత్ర
సంగీతం : రాజ్,కోటి

పల్లవి : 
తెలుగందాలే నన్ను తొంగి తొంగి చూసెనమ్మ తొలకరిగా
మకరందాలే మది పొంగి పొంగి పోయెనమ్మ తుంటరిగా
అమ్మడి సిగ్గులే గుమ్మడి పువ్వులై
పిల్లడి పల్లవే పచ్చని వెల్లువై
సాగపా దాపపా దాససా రీసదా
సాగపా దాపపా దాససా రీసదా
కాటుకాకళ్ళలో కన్నె వాకిళ్ళలో

చరణం :
తిక్కనలో తీయదనం లిపి చక్కని నీ కన్నెతనం
పోతనలో రామరసంవడబోసెను నీ ప్రేమరసం
ప్రాయానికే వేదంనవపద్మావతీపాదం
రాగానికే అందం రసగీతగోవిందం
వంశధర ఒడిలో హర్షవల్లికా
సూర్యకాంత వీణారాగదీపిక

సాగపా దాపపా దాససా రీసదా
సాగపా దాపపా దాససా రీసదా
కాటుకాకళ్ళలో కన్నె వాకిళ్ళలో
తెలుగందాలే నన్ను తొంగి తొంగి చూసెనమ్మ తొలకరిగా
మకరందాలే మది పొంగి పొంగి పోయెనమ్మ తుంటరిగా


చరణం :
క్షేత్రయలో జాణతనంవరదయ్యెనులే వలపుతనం
అందని నీ ఆడతనంఅమరావతిలో శిల్పధనం
ఏడుగ చీలిందిలే నది గౌతమి గోదావరి
ఏకం కావాలిలే ఏడుజన్మలబంధాలివి
కృష్ణవేణి జడలో శైలమల్లిక
శివుని ఆలయాన భ్రమరదీపిక

సాగపా దాపపా దాససా రీసదా
సాగపా దాపపా దాససా రీసదా
కాటుకాకళ్ళలో కన్నె వాకిళ్ళలో
తెలుగందాలే నన్ను తొంగి తొంగి చూసెనమ్మ తొలకరిగా
మకరందాలే మది పొంగి పొంగి పోయెనమ్మ తుంటరిగా





No comments: