Monday, December 24, 2007

అన్నమాచార్య కీర్తనలు


చేరి యశోదకు .......


చేరి యశోదకు శిశువితడు ధారుణి బ్రహ్మకు తండ్రియు నితడు


సొలసి జూచినను సూర్యచంద్రులను లలివెదజల్లెడు లక్షణుడు

నిలిచిన నిలువున నిఖిల దేవతల కలిగించు సురల గనివో యితడు


మాటలాడినను మరియజాండములు కోటులు వొడమెటి గుణరాశి

నీటుగ నూర్పుల నిఖిల వేదములు చాటువ నూరెటి సముద్రుడితడు


ముంగిట పొలసిన మోహన మాత్మల పొంగించే ఘన పురుషుడు

సంగతి మావంటి శరణాగతులకు అంగము శ్రీ వేంకటాధిపుడితడు

No comments: