Saturday, December 20, 2008

మూగ మనసులు

గానం : P.సుశీల
సంగీతం : K.V.మహదేవన్
రచన : ఆత్రేయ

పల్లవి : నా పాట నీ నోట పలకాల చిలకా
పలకాల సిలక, పలకాల చిలక
యహ చీ కాదూ,సీ సీ సిలక
పలకాల సిలక

నీ బుగ్గలో సిగ్గులొలకాల సిలకా - 2

చరణం : పాట నువు పాడాల పడవ నే నడపాల
నీటిలో నేను నీ నీడనే సూడాల
నా నీడ సూసి నువ్ కిల కిలా నవ్వాల
పరవళ్ళ నురుగుల్ల గోదారి ఉరకాల

నా పాట నీ నోట పలకాల చిలకా
నీ బుగ్గలో సిగ్గులొలకాల సిలకా

చరణం : కన్నుల్లో కలవాల ఎన్నెల్లో కాయాల
ఎన్నెల్లకే మనమంటే కన్నుకుట్టాల
నీ పైట నా పడవ తెరసాప కావాల
నీ సూపె సుక్కానిగా దారి సూపాల

నా పాట నీ నోట పలకాల చిలకా
నీ బుగ్గలో సిగ్గులొలకాల సిలకా -2

మనసున్న మనుషులే మనకు దేవుల్లు
మనసూ కలిసిననాడే మనకు తిరణాళ్ళూ
సూరెచంద్రూల తోటి సుక్కల్ల తోటి
ఆటాడుకుందాము అడానే ఉందాము

నా పాట నీ నోట పలకాల చిలకా
నీ బుగ్గలో సిగ్గులొలకాల సిలకా ...

మూగ మనసులు

మానూ మాకును కాను ...
గానం : సుశీల
సంగీతం : K.V.మహదేవన్
రచన : ఆత్రేయ


పల్లవి : మానూ మాకును కాను రాయీ రప్పను కానే కానూ
మామూలు మనిషిని నే నేను నీ మనిషిని నేను - 2

చరణం : నాకూ ఒక మనసున్నదీ నలుగురిలా అసున్నదీ
కలలు కనే కళున్నాయీ అవి కలత పడితే నీళ్ళున్నాయీ

మానూ మాకును కాను రాయీ రప్పను కానే కానూ
మామూలు మనిషిని నే నేను నీ మనిషిని నేను

చరణం : ప్రమిదను తెచ్చీ వొత్తిని వేసీ
చమురును పోసీ భ్రమ చూపేవా
ఎంత చేసీ వెలిగించెందూకూ యెనక మూందూలాడేవ

మానూ మాకును కాను రాయీ రప్పను కానే కానూ
మామూలు మనిషిని నే నేను నీ మనిషిని నేను - 2

మానూ మాకును కాను రాయీ రప్పను కానే కానూ
మామూలు మనిషిని నే నేను నీ మనిషిని నేను - 2

Friday, December 19, 2008

సింధు భైరవి

సింధు భైరవి
గానం : చిత్ర

చిత్ర గారు సినిమాలలో కి వచ్చిన కొత్తలో పాడిన పాట అని విన్నాను,..
ఈ రెండు లైన్స్ ఉచ్చారణ లో మళయాళం accent చాలా స్పష్టంగా వినపడుతుంది..
ఏ పాటైన ఎద పొంగిపోదా
ఏ ప్రాణమైనా తామిదీరి పొదా


పల్లవి : పాడలేను పల్లవైన భాష రాని దానను
వేయలేను తాళమైన లయ నేనెరుగను
తోచింది చెప్పాలని ఎదుటికొచ్చి నిలుచున్నా
తోచిన మాటలనే వరుస కట్టి అంటున్నా..

చరణం : అమ్మ జోల పాటలోన రాగమెంతో ఉన్నది
పంటచేల పాటలోన భాష ఎంతో ఉన్నది
ఓయలే తాళం పైర గాలే మేళం
మమతే రాగం శ్రమ జీవనమే భావం
రాగమే లొకమంతా... ఆ.... ఆ..ఆ
రాగమే లొకమంతా కష్ట సుఖములే స్వరములంట
షడ్జమ కోకిల గాన స్రవంతికి
పొద్దు పొడుపే సంగతంట

చరణం : రాగానిదేముంది రసికులు మన్నిస్తె
తెలిసిన భాషలోనే తీయగా వినిపిస్తె
ఏ పాటైన ఎద పొంగిపోదా
ఏ ప్రాణమైనా తామిదీరి పొదా
చెప్పేది తప్పొ ఒప్పొ ఊ ఊ..ఊ..
చెప్పేది తప్పొ ఒప్పొ రహస్యమేముంది విప్పి చెపితె
ఆహు ఊహు రొకటి పాటలో లేదా మధుర సంగీతం


పాడలేను పల్లవైన భాష రాని దానను
వేయలేను తాళమైన లయ నేనెరుగను
తోచింది చెప్పాలని ఎదుటికొచ్చి నిలుచున్నా
తోచిన మాటలనే వరుస కట్టి అంటున్నా...

పాడలేను పల్లవైన భాష రాని దానను
వేయలేను తాళమైన లయ నేనెరుగను
మపదమ పాడలేను పల్లవైన
సారీగమపదమ పాడలేను పల్లవైన
పదనిస నీదమగసరి పాడలేను పల్లవైన


ససరిగ సరిగమగస పదమ
మమపద మపదనిదమ పదని
పదనిస రిగసని దమపదనిస ని
ద పదనిద మపదమ గమపద మగమగస

సాసస సాసస సాసాసస సరిగమగమగసనిద
మామమ మామమ మామమ పదనిసనిదమగ
సాస రీరీ గాగా మామా పాపా దాదా నీనిస
రిగసస నిసనినిద మపదని దనిదదమ
గమగస రిగమగ మపదమ పదనిసరి గపదని సనిదమగ

మరి మరి నిన్నే మొరలిడ నీ మనసున దయరాదూ..
మరి మరి నిన్నే మొరలిడ నీ మ...న..సు...న.. ద..య..రా...దూ..

గమ్యం

ఎంతవరకు ఎందుకొరకు ...
గానం : కె.కె

Awesome lyrics...

ఎంతవరకు ఎందుకొరకు ఇంత పరుగు అని అడక్కు
గమనమే నీ గమ్యమైతే బాటలోనే బ్రతుకు దొరుకు
ప్రశ్నలోనే బదులు ఉందే గుర్తుపట్టే గుండెనడుగు

ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాక ఆ నిజం తెలుసుకోవా
తెలిస్తే ప్రతి చోట నిన్ను నువ్వే కలుసుకుని పలకరించుకోవా

ఎంతవరకు ఎందుకొరకు ఇంత పరుగు అని అడక్కు
గమనమే నీ గమ్యమైతే బాటలోనే బ్రతుకు దొరుకు
ప్రశ్నలోనే బదులు ఉందే గుర్తుపట్టే గుండెనడుగు

కనపడేవెన్నెన్ని కెరటాలు కలగలిపి సముద్రమంటారు
అడగరే ఒక్కొక్క అల పేరు
మనకిల ఎదురైన ప్రతి వారు మనిషనే సంద్రాన కెరటాలు
పలకరే మనిషి అంటే ఎవరూ

సరిగ చూస్తున్నదా నీ మది గదిలో నువ్వే కదా ఉన్నది
చుట్టూ అద్దాలలో విడి విడి రూపాలు నువ్వు కాదంటూ
అది నీ ఊపిరిలో లేదా
గాలివెలుతురు నీ చూపుల్లో లేదా
మన్ను మిన్ను నీరు అన్ని కలిపితే నువ్వే కాదా

ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాక ఆ నిజం తెలుసుకోవా
తెలిస్తే ప్రతి చోట నిన్ను నువ్వే కలుసుకుని పలకరించుకోవా

మనసులో నీవైన భావాలే బయట కనిపిస్తాయి దృశ్యాలై
నీడలు నిజాల సాక్ష్యాలే
శత్రువులు నీలోని లోపాలే
స్నేహితులు నీకున్న ఇస్టాలే
ఋతువులు నీ భావ చిత్రాలే

ఎదురైన మందహాసం నీలోని చెలిమి కోసం
మోసం రోషం ద్వేషం నీ మతిలి మదికి బాష్యం
పుటక చావు రెండే రెండు నీకవి సొంతం కావు పోనీ
జీవితకాలం నీదే నేస్తం రంగులు ఏం వేస్తావో కానీ

ఆకాశవీధిలో హాయిగా ఎగిరేవు.....

మల్లేశ్వరి-(1951)
సంగీతం : సాలూరి రాజేశ్వర రావు
రచన : దేవులపల్లి
పాడినవారు :భానుమతి,ఘంటసాల

పల్లవి : ఆకాశవీధిలో హాయిగా ఎగిరేవు దేశదేశాలన్ని తిరిగిచూసేవూ
ఏడతానున్నాడో బావా ఏడతానున్నాడో బావా
జాడ తెలిసిన పోయిరావా
అందాల ఓ మేఘమాలా అందాల ఓ మేఘమాలా

చరణం : గగనసీమల తేలు ఓ మేఘమాలా
మా వూరు గుడి పైన మసలి వస్తున్నావా
మల్లి మాటేదైనా నాతో మనసు చల్లగా చెప్పి పోవా
నీలాల ఓ మేఘమాలా రాగాల ఓ మేఘమాలా

చరణం : మమతలెరిగిన మేఘమాలా
మమతలెరిగిన మేఘమాలా
నా మనసు బావకు చెప్పిరావా
ఎన్నాళ్ళు నా కళ్ళు దిగులుతోరేపవలు
ఎన్నాళ్ళు నా కళ్ళు దిగులుతోరేపవలు
ఎదురుతెన్నులు చూచెనే ఎదరి కాయలు కాచెనే
అందాల ఓ మేఘమాలా రాగాల ఓ మెఘ మాలా

చరణం : మనసు తెలిసిన మేఘమాలా మరువలేనని చెప్పలేవా
మల్లితో మరువులేవని చెప్పలేవా
కళ్ళు తెరచిన గానీ కళ్ళుమూసినగానీ
కళ్ళు తెరచిన గానీ కళ్ళుమూసినగానీ
మల్లిరూపే నిలిచనే నా చెంత మల్లి మాటే పిలిచెనే

జాలిగుండెల మేఘమాలా బావ లేనిదే బ్రతుకజాలా
జాలిగుండెల మేఘమాలా
కురియునాకన్నీరు గుండెలో దాచుకుని వానజల్లుగ కురిసిపోవా
కన్నీరు వాన వాలుగా బావ ఏలా