Friday, November 13, 2009

సరికొత్త చీర ఊహించినాను ...

ఈ పాట గురించి ఎంత చెప్పినా తక్కువే,
బుడుగు చదివి చిన్నప్పుడే బాపు-రమణ అభిమానినయ్యాను, కాని వీరాభిమానిని అవ్వటానికి కారణం మాత్రం ఈ పాటే. పాట సారమంతా ఈ రెండు లైన్లలోనే తెలిసిపోతుంది .
"ముచ్చట గొలిపే మొగలి పొత్తుకు, ముళ్ళూ వాసన ఒక అందం
అభిమానం గల ఆడపిల్లకు , అలకా కులుకూ ఒక అందం "


సంగీతం : K.V.మహదేవన్
రచన : వేటూరి
గానం : S.P.బాలసుబ్రఃమణ్యం


పల్లవి : సరికొత్త చీర ఊహించినాను
సరదాల సరిగంచు నేయించి నాను
మనసూ మమత, పడుగూ పేక చీరలో చిత్రించినాను
ఇది ఎన్నో కలల కలనేత, నా వన్నెల రాశికీ సిరి జోత
నా ... వన్నెల రాశికీ సిరి జోతా.

చరణం : ముచ్చట గొలిపే మొగలి పొత్తుకు, ముళ్ళూ వాసన ఒక అందం
అభిమానం గల ఆడపిల్లకు , అలకా కులుకూ ఒక అందం
ఈ అందాలన్నీ కల బోస్తా, నీ కొంగుకు చెంగున ముడి వేస్తా
ఈ అందాలన్నీ కల బోస్తా, నీ కొంగుకు చెంగున ముడి వేస్తా

ఇది ఎన్నో కలల కలనేత, నా వన్నెల రాశికీ సిరి జోత
నా ... వన్నెల రాశికీ సిరి జోతా.


చరణం : చుర చుర చూపులు ఒక మారూ, నీ చిరు చిరు నవ్వులు ఒక మారు
మూతి విరుపులు ఒక మారూ, నువ్వు ముద్దుకు సిద్ధం ఒక మారు
నువ్వు ఏ కళనున్నా మహ బాగే, ఈ చీర విశేషం బహు బాగే
నువ్వు ఏ కళనున్నా మహ బాగే..ఈ చీర విశేషం బహు బాగే

సరికొత్త చీర ఊహించినాను
సరదాల సరిగంచు నేయించి నాను
మనసూ మమత, పడుగూ పేక చీరలో చిత్రించినాను
ఇది ఎన్నో కలల కలనేత, నా వన్నెల రాశికీ సిరి జోత
నా ... వన్నెల రాశికీ సిరి జోతా.

2 comments:

vinayakamchittoor said...

nice to c ur telugu songs blog..
good taste..

పావనీలత (Pavani Latha) said...

Vinayakam garu !
Thanks for visiting my blog .