Sounds catchy...
సంగీతం :తమన్
రచన: సిరివెన్నెల
గానం : చిత్ర
ధీం తన నాహిరే ధీం ధీం తన నాహిరే - 4
అటు చూడొద్దన్నానా, మాటాడొద్దన్నానా
ఒద్దొద్దు అంటే విన్నావంటే మనసా
ఏం పర్వాలేదనుకున్నావేమో బహుశా
ఈ తలనొప్పేదైనా, నీ తప్పేం లేదన్నా
అయ్యయ్యో అంటారేమో గాని మనసా
పడవలసిందేగా నువిలా నానా హింస
ధీం తన నాహిరే ధీం ధీం తన నాహిరే-2
ప్రేమని కదిలించావే తోచి తొచని తొలి వయసా
ఎందుకు బదులిచ్చావే తెలిసి తెలియని పసి మనసా
అటు చూడొద్దన్నానా, మాటాడొద్దన్నానా
ఒద్దొద్దు అంటే విన్నావంటే మనసా
ఏం పర్వాలేదనుకున్నావేమో బహుశా
మునుపేనాడు,ఏ కుర్రాడు ,పడలేదంటే నీ వెనకాల
వందలు వేలు ,ఉండుంటారు, మతి చెడలేదే ఇలా వాళ్ళందరి వల్ల
ఎందుకివాళే ఇంత మంటెక్కిందో చెబుతావా
ఏం జరిగుంటుందంటే అడిగిన వాళ్ళని తిడతావా
అందరిలాగా వాణ్ణీ విధుల్లో వదిలేసావా
గుండెల గుమ్మం దాటి వస్తుంటే చూస్తున్నావా
అటు చూడొద్దు అన్నానా, మాటాడొద్దు అన్నానా
ఒద్దొద్దు అంటే విన్నావంటే మనసా
ఏం పర్వాలేదనుకున్నావేమో బహుశా
ఏ దారైనా,ఏ వేళైనా,ఎదురవుతుంటే నేరం తనదే
ఇంట్లో ఉన్నా ,నిదురోతున్నా, కనిపిస్తుంటే ఆ చిత్రం నీలో ఉందే
ఎవ్వరినని ఏం లాభం ఎందుకు ఎద లయ తప్పిందే
ఎక్కడ ఉందో లోపం నీతో వయసేం చెప్పిందే
అలకో ఉలుకో పాపం ఒప్పుకునేందుకు ఇబ్బందే
తనకే నాకే కోపం కన్నెగ పుట్టిన నా మీదే
ధీం తన నాహిరే ధీం ధీం తన నాహిరే-4
No comments:
Post a Comment