ఈక్షణం ఒకే ఒక కోరిక.....
గానం : చిత్ర
సంగీతం : కోటి
పల్లవి : ఈక్షణం ఒకే ఒక కోరిక నీ స్వరం వినాలని తీయగ
తరగని దూరములో ఓ..ఓ.....
తెలియని దారులలో..ఓ..ఓ.....
ఎక్కడున్నావు అంటుంది ఆశగా
ఈక్షణం ఒకే ఒక కోరిక నీ స్వరం వినాలని తీయగా
చరణం : ఎన్ని వేల నిముషాలో లెక్కపెట్టుకుంటుంది
ఎంతసేపు గడపాలో చెప్పవేమి అంటోంది
నిన్నేవేగమెల్లమన్న సంగతి
గుర్తేలేని గుండె ఇదీ
ఆ..ఆ...ఆ..అ..మళ్ళీ నిన్ను చూసేదాకా
నాలో నేను ఉండలేక ఆరాటంగా కొట్టుకున్నది...
ఈక్షణం ఒకే ఒక కోరిక నీ స్వరం వినాలని తీయగా
చరణం : రెప్ప వేయనంటుంది ఎంత పిచ్చి మనసు ఇది
రేపు నువ్వు రాగానే కాస్త నచ్చచెప్పు మరి
నిన్న మొన్న చెప్పుకున్న ఊసులే మళ్ళి తలచుకునీ
ఆ..ఆ...ఆ..ఇంకా ఎన్నో ఉన్నాయంటూ
ఇప్పుడే చెప్పాలంటూ నిద్దరోను అంటుంది....
ఈక్షణం ఒకే ఒక కోరిక నీ స్వరం వినాలని తీయగా
తరగని దూరములో ఓ..ఓ..తెలియని దారులలో..ఓ..ఓ.....
ఎక్కడున్నావు అంటుంది ఆశగా
ఈక్షణం ఒకే ఒక కోరిక నీ స్వరం వినాలని తీయగా
2 comments:
nijanga chaala manchi sahithyamnu andistunnaru..........
padahaaranaala telugu ammayeeenani oppukuntanu.........
@అనానిమస్...
థాంక్స్...
మీకు ఏదైనా పాట సాహిత్యం కావాలంటే ఇక్కడ ఒక కామెంట్ వేస్తే అందించడానికి ప్రయత్నిస్తాను
Post a Comment