Wednesday, January 2, 2008

ప్రియురాలు పిలిచింది

దోబూచులాటేలరా...

గానం : చిత్ర
సంగీతం : A.R.రెహమాన్


పల్లవి : దోబూచులాటేలరా గోపాలా నా మనసంతా నీవేనురా
దోబూచులాటేలరా గోపాలా నా మనసంతా నీవేనురా
ఆ ఏటిగట్టునేనడిగా చిరుగాలినాపి నేనడిగా
ఆకాశాన్నాడిగా బదులే లేదు , ఆకాశాన్నాడిగా బదులే లేదు
చివరికి నిన్నే చూశా హృదయపు గుడిలో చూశా
చివరికి నిన్నే చూశా హృదయపు గుడిలో చూశా

దోబూచులాటేలరా గోపాలా నా మనసంతా నీవేనురా

చరణం : నా మది నీకొక ఆటాడు బొమ్మయా
నాకిక ఆశలు వేరేవి లేవయా
ఎదలో లయా ఆగదయా
నీ అధరాలు అందించరా గోపాలా ఆ....
నీ కౌగిలిలో కరిగించరా... నీ తనువేఇక నాదిగా
పాల కడలి నాడె నా గానం
నీ వన్నె మారలేదేమి
నా ఎదలో చేరి నీ వన్నె మార్చుకో
ఊపిరి నీవై కాగ పెదవుల మెరుపు నువ్వు కాగా చేరగ రా....

దోబూచులాటేలరా గోపాలా నా మనసంతా నీవేనురా


చరణం : గగనమె వర్షించ గిరినెత్తి కాచావు
నయనాలు వర్షించ నన్నెత్త బ్రోచేవు
పూవున కన్నీ మతమా
నేనొక్క స్త్రీనే కదా గోపాలా
అది తిలకించ కనులే లేవా
నీ కలనీ నేనే కదా
అనుక్షణం ఉలికే నా మనసు అరె మూగ కాదు నా వయసు
ఆ ఊపిరిలోనా ఊపిరినీవై ప్రాణం పోనీకుండా
ఎపుడూ నీవే అండ కాపాడరావా....


దోబూచులాటేలరా గోపాలా నా మనసంతా నీవేనురా....

No comments: