Saturday, January 5, 2008

పెళ్ళిపుస్తకం

బాపు సినిమాలన్నా,బొమ్మలన్నా చాలా ఇష్టం...
ఈ సినిమాలో ప్రతీ పాటా ప్రతీపదం వేటూరి గారు ఎంతో అందంగా రాసారు...,
ముఖ్యంగా ఈపాట....

సరికొత్త చీర.....
గానం : ఎస్.పి.బాలసుబ్రమణ్యం
సంగీతం : K.V.మహదేవన్


పల్లవి : సరికొత్త చీర ఊహించినాను
సరదాల సరిగంచు నేయించి నాను
మనసూ మమత....
పడుగూ పేక చీరలో చిత్రించి నాను
ఇది ఎన్నో కలల కలనేత....
నా వన్నెల రాశికీ సిరి జోత
నా వన్నెల రాశికీ సిరి జోతా...

చరణం : ముచ్చట గొలిపే మొగలి పొత్తుకు....
ముళ్ళూ వాసన ఒక అందం
అభిమానం గల ఆడపిల్లకు .....
అలకా కులుకూ ఒక అందం
ఈ అందాలన్నీ కల బోస్తా....
నీ కొంగుకు చెంగున ముడి వేస్తాఈ అందాలన్నీ కల బోస్తా.... 2
ఇది ఎన్నో కలల కలనేత..నా వన్నెల రాశికీ సిరి జోత
నా వన్నెల రాశికీ సిరి జోతా...

చరణం : చుర చుర చూపులు ఒక మారూ....
నీ చిరు చిరు నవ్వులు ఒక మారు
మూతి విరుపులు ఒక మారూ....
నువ్వు ముద్దుకు సిద్ధం ఒక మారు
నువ్వు ఏ కళనున్నా మహ బాగే..ఈ చీర విశేషం అలాగే... 2

సరికొత్త చీర ఊహించినాను
సరదాల సరిగంచు నేయించి నాను
మనసూ మమత..పడుగూ పేక చీరలో చిత్రించి నాను
ఇది ఎన్నో కలల కలనేత..నా వన్నెల రాశికీ సిరి జోత
నా వన్నెల రాశికీ సిరి జోతా.......

2 comments:

శ్రీనివాసమౌళి said...

chandamaama gaaru bhalE manchi manchi pATalu collect chEstunnAru gaa keep it up [:)]

edO okarOju mee blog lOki naa pATa chErutundi ... adee cinI sAhityam category lO [:)][:)]

పావనీలత (Pavani Latha) said...

థాంక్స్ శ్రీనివాస మౌళి గారు,తప్పకుండా మంచి పాటలన్నీ చేర్చటానికి ప్రయత్నిస్తాను.
అలాగే, మీకు కూడా ఆల్ ది బెస్ట్...