Monday, March 31, 2008

శివ 2006

అప్పటికీ ఇప్పటికీ ఇళయరాజా సంగీతానికీ మొదటి స్థానమే...

ఏ ఊహలోనో తేలానేమో !
గానం: శ్రేయా ఘోషల్ , విజయ్ ప్రకాష్
సంగీతం : ఇళయరాజా

ఏ ఊహలోనో తేలానేమో
ఓ వింత లోకం చేరానేమో
నా కళ్ళలో మెరిసే కాంతులూ
ఇన్నాళ్ళలో లేవే ఎన్నడూ
ఈ క్షణం ఇదేమిటో మాయో హాయో తేలని

ఏ ఊహలోనో తేలానేమో
ఓ వింత లోకం చేరానేమో

మనకేం తెలుసు సమయం ఎటు పోయిందో
మురిసే మనసు అడగదు ఏమయిందో
మనకేం తెలుసు సమయం ఎటు పోయిందో
మురిసే మనసు అడగదు ఏమయిందో

నీలాల నీకళ్ళ లోతుల్లో మునిగాక తేలేది ఎలాగో మరి
వేవేల వర్ణాల తారల్ని తాకందే ఆగేనా ఈ అల్లరీ
ప్రియమైన బంధం బిగించే వేళలో
జతలోన అందం తరించే లీలలో
ఈ నేల పొంగి ఆ నింగి వంగి హద్దేమి లేనట్టు ముద్దాడుకున్నట్టు !

ఏ ఊహలోనో తేలానేమో
ఓ వింత లోకం చేరానేమో

నీలో నాలో ..ఆ .. ఆ
నీలో నాలో కరగని తలపుల దాహం
నువ్వో నేనో తెలియని ముడిపడు మోహం
నీలో నాలో కరగని తలపుల దాహం
నువ్వో నేనో తెలియని ముడిపడు మోహం

అణువు అణువు నిలువెల్ల రగిలించి కరిగించు కౌగిళ్ళలో
తాపాల దీపాలు వెలిగించి వెతకాలి నాలోని నువ్వెక్కడో
ఏ సూర్యుడో మనని లేపే లోపుగా
ఈ లోకమే మరిచి పోదాం కైపుగా
ఏ కంటిచూపు ఈ జంట వైపు రాలేని చోటేదో రమ్మంది లెమ్మంటు !

ఏ ఊహలోనో తేలానేమో
ఓ వింత లోకం చేరానేమో
నా కళ్ళలో..
నా కళ్ళలో మెరిసే కాంతులూ
ఇన్నాళ్ళలో..
ఇన్నాళ్ళలో లేవే ఎన్నడూ
ఈ క్షణం ఇదేమిటో మాయో హాయో తేలని

ఏ ఊహలోనో తేలానేమో
ఓ వింత లోకం చేరానేమో

No comments: