Monday, March 31, 2008

జై

ఎన్ని ఆశలో..
గానం : శ్రేయ ఘోషల్
సంగీతం : అనూప్ రుబెన్స్
రచన : కులశేఖర్

పల్లవి : ఎన్ని ఆశలో చిన్ని గుండెలోనా
ఎంత అల్లరో మల్లె మనసులోనా
తీయనీ బాధ ఏమిటో
ఆపినా ఆగదేమిటో
ఉన్నమాటలే రాని వేళలో కొత్త మాటకై తొందరెమిటో
తెలుసునా చిలిపి ప్రాయమా
చరణం : గుండె గూటిలోనా నా కంటి పాపలోనా
చెప్పలేని సిగ్గులెందుకో
కొంటె ఊసులోనా ఈ కొత్త హాయిలోనా
పైట కొంగు జారెనెందుకో
గాలి అలలపైన ఉయ్యాలలూగుతున్న
మాట తాని నేను ఈ పాట పాడుతున్నా
ఎందుకోసమో ఎవరికోసమో తెలుసునా చిలిపి ప్రాయమా

ఎన్ని ఆశలో చిన్ని గుండెలోనా
ఎంత అల్లరో మల్లె మనసులోనా

చరణం : ఎన్ని రోజులైన ఈ వింత మోజు లోనా
ఆకలంటూ ఉండదేమిటో
ఎన్ని రాత్రులైనా ఎంత మాత్రమైనా
కంటి రెప్ప వాలదెందుకో
మూగ సైగలోనా మోగింది మౌన వీణ
పాల గుండె లోన పున్నాగ పూల వాన
ఎందుకోసమో ఎవరికోసమో తెలుసునా చిలిపి ప్రాయమా

ఎన్ని ఆశలో చిన్ని గుండెలోనా
ఎంత అల్లరో మల్లె మనసులోనా
తీయనీ బాధ ఏమిటో
ఆపినా ఆగదేమిటో
ఉన్నమాటలే రాని వేళలో కొత్త మాటకై తొందరెమిటో
తెలుసునా చిలిపి ప్రాయమా

No comments: