నాలో ఊహలకు...
ఈ మధ్యనే ఈ సినిమా చూశాను,ఎప్పటిలాగానే కృష్ణ వంశీ మార్కు సాంప్రదాయం,మోడ్రెన్ లుక్ రెండూ ఉన్నాయి,సింధు నటన నచ్చింది.పాటలు కూడా బాగానే ఉన్నాయి.ఓవరాల్ గా బాగుంది...
సంగీతం: కె.ఎం.రాధాకృష్ణన్
గానం: ఆశా భోస్లే
పల్లవి :నాలో ఊహలకు
నాలో ఊసులకు అడుగులు నేర్పావూ
నాలో ఆశలకు
నాలో కాంతులకు నడకలు నేర్పావూ
పరుగులుగా ...
పరుగులుగా అవే ఇలా ఇవాళ నిన్నే చేరాయీ...
నాలో ఊహలకు..నాలో ఊసులకు అడుగులు నేర్పావూ...
చరణం : కళ్ళలో...మెరుపులే
గుండెలో...ఉరుములే
పెదవిలో...పిడుగులే
నవ్వులో...వరదలే
శ్వాసలోనా...పెనుతుఫానే... ప్రళయమవుతుంది ఇలా...
నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావూ
నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావు
చరణం : మౌనమే...విరుగుతూ
బిడియమే...ఒరుగుతూ
మనసిలా...మరుగుతూ
అవధులే...కరుగుతూ
నిన్ను చూస్తూ,ఆవిరవుతూ... అంతమవ్వాలనే...
నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావూ
నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావూ
పరుగులుగా ...
పరుగులుగా అవే ఇలా ఇవాళ నిన్నే చేరాయీ...
నాలో ఊహలకు...నాలో ఊసులకు అడుగులు నేర్పావూ...
నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావూ
2 comments:
i want the songs of
1.chinuku tadiki........from nee sneham.
2.kaanulu..kaanulu tho....... from MR. MEDHAVI
3. koncham kaaranga... from
CHAKRAM
.
Thx for visiting my blog sarath...
Definitely i will try to post those as soon as possible
Post a Comment