Friday, March 7, 2008

రోజా

గానం :బాలసుబ్రమణ్యం
సంగీతం : రెహమాన్

పల్లవి : నా చెలి రోజావే నాలో వున్నావే నిన్నే తలచేనే నేనే
నా చెలి రోజావే నాలో వున్నావే నిన్నే తలచేనే నేనే
కళ్ళల్లో నీవే కన్నీటా నీవే
కనుమూస్తే నీవే ఎదలోనిండేవే
కనిపించవో అందించవో తోడు
నా చెలి రోజావే నాలో వున్నావే నిన్నే తలచేనే నేనే

చరణం : గాలి నన్ను తాకినా నిన్ను తాకు ఙ్ఞాపకం
గులాబీలు పూసినా చిలిపి నవ్వు ఙ్ఞాపకం
అలలు పొంగి పారితే చెలియ పలుకు ఙ్ఞాపకం
మేఘమాల సాగితే మోహ కథలు ఙ్ఞాపకం
మనసు లేకపోతే మనిషి ఎందుకంటా
నీవులేకపోతే బతుకు దండగంటా
కనిపించవో అందించవో తోడు
నా చెలి రోజావే నాలో వున్నావే నిన్నే తలచేనే నేనే
నా చెలి రోజావే నాలో వున్నావే నిన్నే తలచేనే నేనే
కళ్ళల్లో నీవే కన్నీటా నీవే
కనుమూస్తే నీవే ఎదలోనిండేవే
కనిపించవో అందించవో తోడు

చరణం : చెలియ చెంత లేదులే చల్లగాలి ఆగిపో
మమత దూరమాయెనే చందమమ దాగిపో
కురుల సిరులు లేవులే పూలవనం వాడిపో
తోడు లేదు గగనమా చుక్క లాగ రాలిపో
మనసులోని మాట ఆలకించలేవా
వీడిపోని నీడై నిన్ను చేరనీవా
కనిపించవో అందించవో తోడు

నా చెలి రోజావే నాలో వున్నావే నిన్నే తలచేనే నేనే
నా చెలి రోజావే నాలో వున్నావే నిన్నే తలచేనే నేనే
కళ్ళల్లో నీవే కన్నీటా నీవే
కనుమూస్తే నీవే ఎదలోనిండేవే
కనిపించవో అందించవో తోడు

No comments: