Saturday, December 20, 2008

మూగ మనసులు

గానం : P.సుశీల
సంగీతం : K.V.మహదేవన్
రచన : ఆత్రేయ

పల్లవి : నా పాట నీ నోట పలకాల చిలకా
పలకాల సిలక, పలకాల చిలక
యహ చీ కాదూ,సీ సీ సిలక
పలకాల సిలక

నీ బుగ్గలో సిగ్గులొలకాల సిలకా - 2

చరణం : పాట నువు పాడాల పడవ నే నడపాల
నీటిలో నేను నీ నీడనే సూడాల
నా నీడ సూసి నువ్ కిల కిలా నవ్వాల
పరవళ్ళ నురుగుల్ల గోదారి ఉరకాల

నా పాట నీ నోట పలకాల చిలకా
నీ బుగ్గలో సిగ్గులొలకాల సిలకా

చరణం : కన్నుల్లో కలవాల ఎన్నెల్లో కాయాల
ఎన్నెల్లకే మనమంటే కన్నుకుట్టాల
నీ పైట నా పడవ తెరసాప కావాల
నీ సూపె సుక్కానిగా దారి సూపాల

నా పాట నీ నోట పలకాల చిలకా
నీ బుగ్గలో సిగ్గులొలకాల సిలకా -2

మనసున్న మనుషులే మనకు దేవుల్లు
మనసూ కలిసిననాడే మనకు తిరణాళ్ళూ
సూరెచంద్రూల తోటి సుక్కల్ల తోటి
ఆటాడుకుందాము అడానే ఉందాము

నా పాట నీ నోట పలకాల చిలకా
నీ బుగ్గలో సిగ్గులొలకాల సిలకా ...

3 comments:

శ్రీనివాసమౌళి said...

Hi Chandamama(Anjali) gAru after a brk maLLI gItAnjali lO posts chestunnanduku thanks..

hrudayAnjali anE mv lO guruvu gAru vrAsina title song peTTagalarA vIlu chUsukuni..

meekoka sangati telusA mI blog nEnu copy chEseskunnA nA laptop lOki nAku chAlA upayOgapaDatAyi...
inkA list chAlA undi required songs[:)]
BTW: serials title songs konni chAlA bAgunTAyi (amrutam,ammamma.com etc) avi kUDA chErchE alOchana elA unTundi..

శ్రీనివాసమౌళి said...

and ee song telugu script lo konni mistakes unnAyi like 'buggalO' is typed as 'boggalO'

పావనీలత (Pavani Latha) said...

Thx శ్రీనివాస మౌళి గారు,
తప్పు సరిదిద్దాను.
చాలా రొజులు ఊళ్ళో లేనండి అందుకే బ్లాగు అప్ డేట్ చెయ్యలేదు.

ఇలాగే చిన్న చిన్న తప్పులుంటే సూచనలిస్తూ ఉండండి.