మనసా వాచా నిన్నే వలచా ....
సంగీతం : K.M.రాధాక్రిష్ణన్
రచన : వేటూరి
గానం : ఉన్ని క్రిష్ణన్, చిత్ర
పల్లవి : మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా
నిన్నే తలచా నన్నే మరిచా నీకై జీవించా
ఆ మాట దాచా కాలాలు వేచా నడిచానే నీ నీడలా
మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా
చరణం : చిన్న తప్పు అని చిత్తగించమని అన్నా వినదు
అప్పుడెప్పుడో నిన్ను చూసి నీ వశమై మనసు
కన్నీరైనా గౌతమికన్నా తెల్లారైనా పున్నమికన్నా
మూగైపోయా నేనిలా ఆ ...
మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా
చరణం : నిన్న నాదిగా నేడు కాదుగా అనిపిస్తున్నా
కన్ను చీకటై కలలు వెన్నెలై కాటేస్తున్నా
గతమేదైనా స్వాగతమననా
నీ జతలోనే బ్రతుకనుకోనా
రాముని కోసం సీతలా ఆ ...
మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా
నిన్నే తలచా నన్నే మరిచా నీకై జీవించా
ఆ మాట దాచా కాలాలు వేచా నడిచానే నీ నీడలా
మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా
No comments:
Post a Comment