Thursday, April 9, 2009

హృదయం

ఊసులాడే ఒక జాబిలట

సంగీతం : ఇళయరాజా
సాహిత్యం :సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం : S.P.బాలసుబ్రఃమణ్యం

ఊసులాడే ఒక జాబిలట
సిరిమువ్వలుగా నను తాకెనట

ఊసులాడే ఒక జాబిలట
సిరిమువ్వలుగా నను తాకెనట
చూపులతో బాణమేసెనట
చెలి నా ఎదలో సెగ రేపెనట

మాటే వేదం తానే నా లోకం ప్రేమే యోగం

ఊసులాడే ఒక జాబిలట
సిరిమువ్వలుగా నను తాకెనట

అందాలే చిందె చెలి రూపం నా కోసం
ఆనందం నిలిపేటి ధ్యానం చెలి ధ్యానం
అదే పేరు నేను జపించేను రొజూ
ననే చూసేటి వేళ అలై పొంగుతాను

మౌనం సగమై మోహం సగమై
నేనే నాలో రగిలేను

ఊసులాడే ఒక జాబిలట
సిరిమువ్వలుగా నను తాకెనట
చూపులతో బాణమేసెనట
చెలి నా ఎదలో సెగ రేపెనట

మాటే వేదం తానే నా లోకం
ప్రేమే యోగం

ఊసులాడే ఒక జాబిలట
సిరిమువ్వలుగా నను తాకెనట

నాలోన రేగేనే పాట చెలి పాట
నీడల్లే సాగే నీ వెంట తన వెంట
స్వరాలై పొంగేనా వరాలే కోరేనా
ఇలా ఊహల్లోనా సదా ఉండిపోనా

ఒకటై ఆడు ఒకటై పాడు
పండగ నాకు ఏనాడు

ఊసులాడే ఒక జాబిలట
సిరిమువ్వలుగా నను తాకెనట
చూపులతో బాణమేసెనట
చెలి నా ఎదలో సెగ రేపెనట

మాటే వేదం తానే నా లోకం
ప్రేమే యోగం

ఊసులాడే ఒక జాబిలట
సిరిమువ్వలుగా నను తాకెనట

No comments: