Thursday, April 9, 2009

షాక్

మధురం మధురం ...

గానం : S.P.బాలసుబ్రఃమణ్యం, చిత్ర

మధురం మధురం మధురం మధురం
మధురం మధురం మధురం మధురం

ప్రణయం మధురం కలహం మధురం
క్షణము సగము విరహం మధురం
సరసం మధురం విరసం మధురం
చికురం మధురం చుబుకం మధురం

సరసం మధురం విరసం మధురం
చికురం మధురం చుబుకం మధురం

అందం అందం అని ఊరించే అందాలన్ని అసలే మధురం

శ్రవణం మధురం నయనం మధురం
కులుకే మధురం కురులే మధురం
గమనం మధురం జగనం మధురం
లయలో సాగే పయనం మధురం

గమనం మధురం జగనం మధురం
లయలో సాగే పయనం మధురం
ఎదరే ఉంటే ప్రతిది మధురం
చెదిరే జుట్టు చమటే మధురం

సర్వం మధురం సకలం మధురం సంసారంలో సాగరమధనం

సర్వం మధురం సకలం మధురం సంసారంలో సాగరమధనం

అన్నీ మధురం అఖిలం మధురం
ఆమే మధురం ప్రేమే మధురం - 2
కనులే మధురం కలలే మధురం
కొంచెం పెరిగే కొలతే మధురం - 2

మనసే మధురం సొగసే మధురం
విరిసే పెదవుల వరసే మధురం

ఉదయం దాచే మధురిమ గాని
ఉదరం మధురం హృదయం మధురం

తాపం మధురం శోకం మధురం
అలకే చిలికే కోపం మధురం
అలుపే మధురం సొలుపే మధురం
అతిగా మరిగే పులుపే మధురం

అధరం మధురం వ్యధనం మధురం
వెలుగే చిలికే తిలకం మధురం
బాల మధురం డోలా మధురం
లీల మధురం హేలా మధురం - 2

జోజో మధురం జోలా మధురం
మనువాటకిదే ఫలితం మధురం

మధురం మధురం ప్రణయం మధురం
మధురం మధురం విరహం మధురం
సరసం మధురం విరసం మధురం
నయనం మధురం వదనం మధురం

సరసం మధురం విరసం మధురం
నయనం మధురం వదనం మధురం
అన్ని మధురం అఖిలం మధురం
మనమే మధురం ప్రేమే మధురం

No comments: