Monday, December 31, 2007

గోదావరి

మనసా వాచా....
గానం : చిత్ర, ఉన్నిక్రిష్ణన్
సంగీతం :K.M.రాధాక్రిష్ణన్

పల్లవి : మనసా వాచా నిన్నే వలచా..నిన్నే ప్రేమించా
నిన్నే తలచా..నన్నే మరిచా..నీకై జీవించా
ఆ..... ఆమాట దాచా..కాలాలు వేచా..నడిచా నే నీ నీడలా (మనసా వాచా)


చరణం : చిన్న తప్పు అని చిత్తగించమని అన్నా వినదు
అప్పుడెప్పుడో నిన్ను చూసి నీ వశమై మనసూ
కన్నీరైనా గౌతమి కన్నా....తెల్లారైనా పున్నమి కన్నా....
మూగైపోయా నేనిలా...(మనసా వాచా నిన్నే వలచా....)

చరణం : నిన్న నాదిగా..నేడు కాదుగా..అనిపిస్తున్నా
కన్ను చీకటై..కలలు వెన్నెలై..కాటేస్తున్నా
గతమేదైనా స్వాగతమననానీ జతలోనే బ్రతుకనుకోనా
రాముని కోసం సీతలా.....

మనసా వాచా నిన్నే వలచా..నిన్నే ప్రేమించా
నిన్నే తలచా..నన్నే మరిచా..నీకై జీవించా.....
ఆ.... ఆమాట దాచా.....కాలాలు వేచా....
నడిచా నే నీ నీడలా (మనసా వాచా)

No comments: