మనసా తుళ్ళి పడకే...
గానం : ఎస్.జానకి
సంగీతం : రమేష్ నాయుడు
రచన : వేటూరి
పల్లవి : మనసా తుళ్ళి పడకే అతిగా ఆశ పడకే
అతనికి నీవూ నచ్చావొ లేదో
ఆ శుభ ఘడియా వచ్చేనొ రాదో
తొందర పడితే అలుసే మనసా తెలుసా...
మనసా తుళ్ళి పడకేఅతిగా ఆశ పడకే
చరణం : ఏమంత అందాలు కలవనీ...
వస్తాడు నిన్ను వలచీ
ఏమంత సిరి వుంది నీకనీ.. మురిసేను నిన్ను తలచీ
చదువా పదవా ఏముంది నీకు
తళుకూ కులుకూ ఏదమ్మ నీకు
శృతి మించకే నీవు మనసా...
మనసా తుళ్ళి పడకేఅతిగా ఆశ పడకే
అతనికి నీవూ నచ్చావొ లేదో
ఆ శుభ ఘడియా వచ్చేనొ రాదో
తొందర పడితే అలుసే మనసా తెలుసా
మనసా తుళ్ళి పడకేఅతిగా ఆశ పడకే
చరణం : ఏనోము నోచావు నీవనీ....
దొరికేను ఆ ప్రేమ ఫలమూ
ఏ దేవుడిస్తాడు నీకనీ.. అరుదైన అంత వరమూ
మనసా వినవే మహ అందగాడు
తనుగా జతగా మనకంది రాడు
కలలాపవే కన్నె మనసా
మనసా తుళ్ళి పడకేఅతిగా ఆశ పడకే
అతనికి నీవూ నచ్చావొ లేదో
ఆ శుభ ఘడియా వచ్చేనొ రాదో
తొందర పడితే అలుసే మనసా తెలుసా
మనసా తుళ్ళి పడకేఅతిగా ఆశ పడకే........
3 comments:
i want the following songs
1.kannulu..kannulotho... from MR.MEDHAVI.
2.naa paata tetta telugu paata... from aathade oka sainaym
3.naalo.. aasallaku... naalo vuhallaku... from chandamma
mi collection chala bagundi miru swati kiranam,swati mutyam patalu okoka ti matrame rasaru vatilo patalu anni add cheste baguntundi mi abhiruchi chuste miru kavitalu kuda rastaru ani pistundi why dont u add your opions(kavitalu) and good saying , proverbs
@Sarath
చందమామ,మిష్టర్ మేధావి పాటలు చేర్చాను,నా పాట తేట తెలుగు పాట ...పాట త్వరలోనే చేరుస్తాను
@Anonymous
నా బ్లాగు చూసినందుకు ధన్యవాదాలు,.వచ్చిన ఆలోచనలు కాగితం మీద రాసుకోవడం తప్ప,కవితలు రాసేటంత భాష మీద పట్టు నాకు లేదండి. స్వాతి కిరణం,స్వాతి ముత్యంలో మిగిలిన పాటలు త్వరలోనే చేరుస్తాను.Please Keep visiting my blog...
Post a Comment