Showing posts with label ఓయ్. Show all posts
Showing posts with label ఓయ్. Show all posts

Friday, February 25, 2011

ఓయ్

నన్నొదిలి నీడ వెళ్ళిపొతోందా

సంగితం : యువన్ శంకర్ రాజా
గానం : యువన్ శంకర్ రాజా
రచన : వనమాలి


నన్నొదిలి నీడ వెళ్ళిపొతోందా
కన్నొదిలీ చూపు వెళ్ళిపోతోందా
వేకువనే సందె వాలి పోతోందే
చీకటిలో ఉదయముండిపోయిందే
నా ఎదనే తొలిచిన గురుతుగ నిను తెస్తుందా
నీ జతలో గడిపిన బ్రతుకిక బలి అవుతుందా
నువ్వుంటే నేనుంటా ప్రేమా...పోవొద్దే పోవొద్దే ప్రేమా
నన్నొదిలీ నీడ వెళ్ళిపొతోందా
కన్నొదిలీ చూపు వెళ్ళిపోతోందా..


ఇన్ని నాళ్ళు నీ వెంటే సాగుతున్న నా పాదం
వెంట పడిన అడుగేదంటోందే ఓ...
నిన్నదాక నీ రూపం నింపుకున్న కనుపాపే
నువ్వు లేక నను నిలదీస్తోందే
కోరుకున్న జీవితమే చేరువైన ఈ క్షణమే...
జాలి లేని విధిరాతే శాపమైనదే
మరుజన్మే ఉన్నదంటే బ్రహ్మనైనా అడిగేదొకటే
కనమంటా మమ్ము తన ఆటలిక సాగని చోటే
నువ్వుంటే నేనుంటా ప్రేమా,పోవొద్దే పోవొద్దే ప్రేమా

నువ్వుంటే నేనుంటా ప్రేమా....
పోవొద్దే పోవొద్దే ప్రేమా...