Showing posts with label సిరివెన్నెల సీతారామశాస్త్రి. Show all posts
Showing posts with label సిరివెన్నెల సీతారామశాస్త్రి. Show all posts

Monday, April 20, 2015

జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది

సంగీత దర్శకులు "శ్రీ" గారికి అశృనివాళి...
గాయం,లిటిల్ సోల్జర్స్, సింధూరం, అనగనగా ఒక రోజు వంటి చిత్రాలతో సంగీత దర్శకుడిగానే కాక జగమంత కుటుంబం వంటి పాటలతో గాయకుడిగా కూడా అందరికీ సుపరిచితులే అయిన శ్రీ గారికి అశృనివాళి ...

ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ.    


రచన : సిరివెన్నెల
సంగీతం : స్వర్గీయ చక్రి
గానం : శ్రీ


పల్లవి:
జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది
జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది
సంసార సాగరం నాదే..సన్యాసం శూన్యం నావే
జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది

చరణం:
కవినై..కవితనై..భార్యనై..భర్తనై ….కవినై..కవితనై..భార్యనై..భర్తనై
మల్లెలదారిలో..మంచు ఎడారిలో
మల్లెలదారిలో మంచు ఎడారిలో పన్నీటి జయగీతాలు..కన్నీటి జలపాతాల
నాతో నేను అంగమిస్తూ..నాతో నేను రమిస్తూ..
వంటరినై అనవరతం .. ఉంటున్నాను నిరంతరం
కలల్ని..కధల్ని..మాటల్ని..పాటల్ని..రంగుల్ని..రంగవల్లుల్ని..కావ్య కన్నెల్ని..ఆడపిల్లల్ని

జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది

చరణం:
మింటికి కంటిని నేనై..కంటను మంటను నేనై
మింటికి కంటిని నేనై..కంటను మంటను నేనై
మంటల మాటున వెన్నెల నేనై..
వెన్నెల పూతల మంటను నేనై..
రవినై..శశినై..దివమై..నిశినై..
నాతో నేను సహగమిస్తూ..నాతో నేనే రమిస్తూ

వంటరినై ప్రతినిముషం .. కంటున్నాను నిరంతరం
కిరణాల్ని కిరణాల..హరిణాల్ని హరిణాల..చరణాల్ని చరణాల
చలనాన కనరాని గమ్యాల కాలాన్ని..ఇంద్రజాలాన్ని

జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది
జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది

చరణం:

గాలిపల్లకీ లోన తరలినా పాట పాప ఊరేగి వెడలె
గొంతువాకిలిని మూసి మరలి తను మూగవోయి నా గుండె మిగిలె

నా హృదయమే నా లోగిలీ..నా హృదయమే నా పాటకి తల్లీ..
నా హృదయమే నాకు ఆలి..నా హృదయములో ఇది సినీ వాలి..

జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది
జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది

Saturday, April 18, 2015

గులాబి


సంగీతం : శశీ ప్రీతం
రచన : సిరివెన్నెల
గానం : శశి ప్రీతం


పల్లవి :
రోజైతే చూసానో నిన్ను.. రోజే నువ్వు అయిపొయా నేను
కాలం కాదన్నా ఏదూరం అడ్డున్నా నీ ఊపిరినై నే జీవిస్తున్నాను

చరణం :
నీ స్పర్శే వీచే గాలుల్లొ..నీ రూపే నా వేచే గుండెల్లో...
నిన్నటి నీ స్మృతులే నన్ను నడిపిస్తూ ఉంటే
నీ నీడై నే వస్తా ఎటు ఉన్నా
నీ కష్టం లో నేను ఉన్నాను....కరిగే నీ కన్నీరౌతాను...
చెంపల్లో జారి నీ గుండెల్లో చేరి నీ ఏకాంతంలో ఒదార్పౌతాను

చరణం :
కాలం ఏదో గాయం చేసింది...నిన్నే మాయం చేసానంటోంది
లోకం నమ్మి అయ్యో అంటోంది...శోకం పిండి జో కొడతానంది
గాయం కోస్తున్నా నే జీవించే ఉన్నా,  జీవం నీవని సాక్షం ఇస్తున్నా
ఆఆ ..నీతో గడిపిన నిముషాలన్ని
నాలో దాగే గుండెల సవ్వడులే...జరిగే వింతే నే నమ్మేదెట్టాగా..


నువు లేకుంటే నేనంటు ఉండనుగా
నీ స్పర్శే వీచే గాలుల్లొ ..నీ రూపే నా వేచే గుండెల్లో
నిన్నటి నీ స్మృతులే నన్ను నడిపిస్తూ ఉంటే
నీ నీడై నే వస్తా ఎటు ఉన్నా
నీ కష్టం లో నేను ఉన్నానుకరిగే నీ కన్నీరౌతాను
చెంపల్లో జారి నీ గుండెల్లో చేరి నీ ఏకాంతంలో ఒదార్పౌతాను


Saturday, March 19, 2011

భద్ర


ఓ మనసా ఓ మనసా చెబితే వినవా నువ్వు

సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్
గానం : రవి వర్మ
రచన : సిరివెన్నెల సీతారామశాస్త్రి,

ఓ మనసా ఓ మనసా చెబితే వినవా నువ్వు
నీ మమతే మాయ కదా నిజమే కనవా నువ్వు
చెలియా గుండె తాకలేక పలకనందే నా మౌనం
చెలిమి వెంట సాగలేక శిల అయిందే నా ప్రాణం
గతమే మరిచి బ్రతకాలే మనసా
ఓ మనసా ఓ మనసా చెబితే వినవా నువ్వు
నీ మమతే మాయ కదా నిజమే కనవా నువ్వు

ఎగసి పడే అల కోసం దిగి వస్తుందా ఆకాశం
తపనపడి ఏం లాభం అందని జాబిలి జత కోసం
కలిసి ఉన్న కొంతకాలం వెనక జన్మ వరమనుకో
కలిసి రాని ప్రేమ తీరం తీరిపోయిన రుణమనుకో
మిగిలే స్మృతులే వరమనుకో మనసా మనసా
ఓ మనసా ఓ మనసా చెబితే వినవా నువ్వు
నీ మమతే మాయ కదా నిజమే కనవా నువ్వు

తన ఒడిలో పొదువుకుని భద్రంగా నడిపే నౌక
తననొదిలి వెళ్ళకని ఏ బంధాన్ని కోరదుగా
కడలిలోనే ఆగుతుందా కదలనంటు ఈ పయనం
వెలుగువైపు చూడనందా నిదరలేచే నా నయనం
కరిగే కలలే తరిమే మనసా మనసా
ఓ మనసా ఓ మనసా చెబితే వినవా నువ్వు
నీ మమతే మాయ కదా నిజమే కనవా నువ్వు

Thursday, March 17, 2011

శశిరేఖా పరిణయం

ఏదో వప్పుకోనంది నా ప్రాణం

సంగీతం: విద్యాసాగర్,మణి శర్మ
రచన : సిరివెన్నెల
గానం: సైంధవి

ఏదో ….వప్పుకోనంది నా ప్రాణం
అది ఏదో .... చెప్పనంటోంది నా మౌనం

ఉబికి వస్తుంటే సంతోషం, అదిమిపెడుతోందే ఉక్రోషం
తన వెనుక నేనూ, నా వెనుక తానూ
ఎంతవరకీ గాలి పయనం అడగదే ఉరికే ఈ వేగం

ఎదో ఎదో ఏదో వప్పుకోనంది నా ప్రాణం
అది ఏదో చెప్పనంటోంది నా మౌనం

ముల్లులా బుగ్గను చిదిమిందా ,మెల్లగా సిగ్గును కదిపిందా
వానలా మనసును తడిపిందా ,వీణలా తనువును తడిమిందా -2

చిలిపి కబురు ఏం విందో, వయసుకేమి తెలిసిందో-2
ఆదమరుపో , ఆటవిడుపో , కొద్దిగా నిలబడి చూద్దాం….ఓ క్షణం

అంటే …. కుదరదంటోంది నా ప్రాణం
కాదంటే …. ఎదురు తిరిగింది నా హృదయం
---------------------------------------------------------------

సంగీతం: విద్యాసాగర్,మణి శర్మ
రచన :అనంత శ్రీరాం
గానం: సైంధవి

ఏదో …. వప్పుకోనంది నా ప్రాణం
అది ఏదో ... చెప్పలేనంది ఏ వైనం
కలతపడుతుందే లోలోనా ,కసురుంటుందే నా పైనా
తన గుబులు నేనూ ,నా దిగులు తానూ
కొంచెమైనా పంచుకుంటే తీరిపోతుందేమో భారం

ఎదో ఎదో ఏదో వప్పుకోనంది నా ప్రాణం
అది ఏదో చెప్పలేనంది ఏ వైనం

పచ్చగా ఉన్నా పూదోటా , నచ్చడం లేదే ఈ పూటా
మెచ్చుకుంటున్నా ఊరంతా, గిచ్చినట్టుందే నన్నంతా -2

ఉండలేను నెమ్మదిగా ,ఎందుకంటే తెలియదుగా
ఉండలేను నెమ్మదిగా ,ఎందుకంటే తెలియదుగా
తప్పటడుగో ,తప్పు అనుకో
తప్పదే తప్పుకు పోదాం ….తక్షణం

అంటూ అడ్డుపడుతుంది ఆరాటం
పదమంటూ నెట్టుకెడుతోంది నను సైతం

Wednesday, March 16, 2011

కిక్

Sounds catchy...

సంగీతం :తమన్
రచన: సిరివెన్నెల
గానం : చిత్ర
ధీం తన నాహిరే ధీం ధీం తన నాహిరే - 4

అటు చూడొద్దన్నానా, మాటాడొద్దన్నానా
ఒద్దొద్దు అంటే విన్నావంటే మనసా
ఏం పర్వాలేదనుకున్నావేమో బహుశా

ఈ తలనొప్పేదైనా, నీ తప్పేం లేదన్నా
అయ్యయ్యో అంటారేమో గాని మనసా
పడవలసిందేగా నువిలా నానా హింస

ధీం తన నాహిరే ధీం ధీం తన నాహిరే-2
ప్రేమని కదిలించావే తోచి తొచని తొలి వయసా
ఎందుకు బదులిచ్చావే తెలిసి తెలియని పసి మనసా

అటు చూడొద్దన్నానా, మాటాడొద్దన్నానా
ఒద్దొద్దు అంటే విన్నావంటే మనసా
ఏం పర్వాలేదనుకున్నావేమో బహుశా

మునుపేనాడు,ఏ కుర్రాడు ,పడలేదంటే నీ వెనకాల
వందలు వేలు ,ఉండుంటారు, మతి చెడలేదే ఇలా వాళ్ళందరి వల్ల
ఎందుకివాళే ఇంత మంటెక్కిందో చెబుతావా
ఏం జరిగుంటుందంటే అడిగిన వాళ్ళని తిడతావా

అందరిలాగా వాణ్ణీ విధుల్లో వదిలేసావా
గుండెల గుమ్మం దాటి వస్తుంటే చూస్తున్నావా

అటు చూడొద్దు అన్నానా, మాటాడొద్దు అన్నానా
ఒద్దొద్దు అంటే విన్నావంటే మనసా
ఏం పర్వాలేదనుకున్నావేమో బహుశా

ఏ దారైనా,ఏ వేళైనా,ఎదురవుతుంటే నేరం తనదే
ఇంట్లో ఉన్నా ,నిదురోతున్నా, కనిపిస్తుంటే ఆ చిత్రం నీలో ఉందే
ఎవ్వరినని ఏం లాభం ఎందుకు ఎద లయ తప్పిందే
ఎక్కడ ఉందో లోపం నీతో వయసేం చెప్పిందే
అలకో ఉలుకో పాపం ఒప్పుకునేందుకు ఇబ్బందే
తనకే నాకే కోపం కన్నెగ పుట్టిన నా మీదే

ధీం తన నాహిరే ధీం ధీం తన నాహిరే-4

Saturday, February 19, 2011

వాసు

నీ జ్ఞాపకాలే నన్నే తరిమేనే...

సంగీతం : హారిస్ జయరాజ్
గానం :S.P.బాలసుబ్రఃమణ్యం


నీ జ్ఞాపకాలే నన్నే తరిమేనే
నీకోసం నేనే పాటై మిగిలానే చెలియా చెలియా ఓ చెలియా...

పాడనా తియ్యగా కమ్మని ఒక పాట
పాటగా బతకనా మీ అందరి నోటా
ఆరాధనే.. అమృత వర్షం అనుకున్నా
ఆవేదనే.. హాలహలమై పడుతున్నా
నా గానమాగదులే.. ఇక నా గానమాగదులే..

పాడనా తియ్యగా కమ్మని ఒక పాట
పాటగా బతకనా మీ అందరి నోటా

గుండెల్లో ప్రేమకే.... గుండెల్లో ప్రేమకే గుడి కట్టే వేళలో
తనువంతా పులకింతే వయసంతా గిలిగింతే
ప్రేమించే ప్రతి మనిషి ఇది పొందే అనుభూతే
అనురాగాల సారం జీవతమనుకుంటే
అనుబంధాల తీరం ఆనందాలుంటే
ప్రతి మనసులొ కలిగే భావం ప్రేమేలే
ప్రతి మనసులొ కలిగే భావం ప్రేమేలే

పాడనా తియ్యగా కమ్మని ఒక పాట
పాటగా బతకనా మీ అందరి నోటా

ఆకాశం అంచులో.. ఆకాశం అంచులో ఆవేశం చేరితే
అభిమానం కలిగెనులే ,అపురూపం అయ్యెనులే
కలనైన ,నిజమైనా కనులెదుటే ఉన్నావే
కలువకు చంద్రుడు దూరం ఓ ..నేస్తం
కురిసే వెన్నెల వేసే ఆ.. బంధం
ఈ విజయం వెనుక ఉన్నది నీవేలే
ఈ విజయం వెనుక ఉన్నది నీవేలే

పాడనా తియ్యగా కమ్మని ఒక పాట
పాటగా బతకనా మీ అందరి నోటా
ఆరాధనే అమృత వర్షం అనుకున్నా
ఆవేదనే హాలహలమై పడుతున్నా
నా గానమాగదులే ఇక నా గానమాగదులే

ఓ ప్రేమా ఓ ప్రేమా ఓ ప్రేమా ఓ ప్రేమా ఓ ప్రేమా
ఓ ప్రేమా ఓ ప్రేమా ఓ ప్రేమా ఓ ప్రేమా ఓ ప్రేమా

Tuesday, February 8, 2011

శశిరేఖా పరిణయం

ఏదో ... వప్పుకోనంది నా ప్రాణం
సంగీతం: మణి శర్మ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: సైంధవి

ఏదో ... వప్పుకోనంది నా ప్రాణం..
అది ఏదో .. చెప్పనంటోంది నా మౌనం..

ఉబికి వస్తుంటే సంతోషం , అదిమిపెడుతోందే ఉక్రోషం
తన వెనుక నేనూ, నా వెనుక తానూ
ఎంతవరకీ గాలి పయనం అడగదే ఉరికే ఈ వేగం ....
ఎదో ఎదో ఏదో .. వప్పుకోనంది నా ప్రాణం
అది ఏదో .. చెప్పనంటోంది నా మౌనం

ముల్లులా బుగ్గను చిదిమిందా,
మెల్లగా సిగ్గును కదిపిందా ,
వానలా మనసును తడిపిందా ,
వీణలా తనువును తడిమిందా ,వీణలా తనువును తడిమిందా
చిలిపి కబురు ఏం విందో ... వయసుకేమి తెలిసిందో
చిలిపి కబురు ఏం విందో .. .వయసుకేమి తెలిసిందో
ఆదమరుపో ,ఆటవిడుపో , కొద్దిగా నిలబడి చూద్దాం.......ఓ క్షణం ..
అంటే .. కుదరదంటోంది నా ప్రాణం
కాదంటే .. ఎదురు తిరిగింది నా హృదయం ....

************************************************

ఏదో .. వప్పుకోనంది నా ప్రాణం
అది ఏదో .. చెప్పలేనంది ఏ వైనం
కలతపడుతుందే లోలోనా , కసురుంటుందే నా పైనా
తన గుబులు నేనూ , నా దిగులు తానూ
కొంచెమైనా పంచుకుంటే తీరిపోతుందేమో భారం ...
ఎదో ఎదో ఏదో .. వప్పుకోనంది నా ప్రాణం
అది ఏదో .. చెప్పలేనంది ఏ వైనం

పచ్చగా ఉన్నా పూదోటా .. నచ్చడం లేదే ఈ పూటా
మెచ్చుకుంటున్నా ఊరంతా .. గిచ్చినట్టుందే నన్నంతా (2)

ఉండలేను నెమ్మదిగా , ఎందుకంటే తెలియదుగా
ఉండలేను నెమ్మదిగా , ఎందుకంటే తెలియదుగా
తప్పటడుగో .. తప్పు అనుకో,తప్పదే తప్పుకు పోదాం ..తక్షణం ..
అంటూ .. అడ్డుపడుతుంది ఆరాటం
పదమంటూ .. నెట్టుకెడుతోంది నను సైతం....

Wednesday, December 30, 2009

గాయం

గాయం
రచన : సిరివెన్నెల
గానం : S.P.బాలసుబ్రమణ్యం

నిగ్గ దీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని
మారదు లోకం మారదు కాలం
దేవుడు దిగి రాని యెవ్వరు యేమై పోని
మారదు లోకం మారదు కాలం

గాలి వాటు గమనానికి కాలి బాట దేనికి
గొర్రెదాటు మందకి మీ జ్ణానబోధ దేనికి
యే చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠం
యే క్షణాన మార్చుకుంది జిత్తుల మార్గం
రామబాణమార్పిందా రావణ కాష్ఠం
కృష్ణ గీత ఆపిందా నిత్య కురుక్షేత్రం

నిగ్గ దీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని
మారదు లోకం మారదు కాలం

పాత రాతి గుహలు పాల రాతి గృహాలయినా
అడవి నీతి మారిందా ఎన్ని యుగాలయినా
వేట అదే వేటు అదే నాటి కధే అంతా
నట్టడవులు నడివీధికి నడిచొస్తే వింతా
బలవంతులె బ్రతకాలని సూక్తి మరవకుండా
శతాబ్ధాలు చదవలేదా ఈ అరణ్యకాండ

నిగ్గ దీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని
మారదు లోకం మారదు కాలం
దేవుడు దిగి రాని యెవ్వరు యేమై పోని
మారదు లోకం మారదు కాలం

చంద్రలేఖ

ఉరుములు నీ మువ్వలై, మెరుపులు నీ నవ్వులై

రచన : సిరివెన్నెల
గానం : రాజేష్

పల్లవి : ఉరుములు నీ మువ్వలై, మెరుపులు నీ నవ్వులై
తొలకరి మేఘానివై రా అలివేణి, పరుగులు నీ గానమై, తరగలు నీ తాళమై
చిలిపిగ చిందాడవే కిన్నెరసా..ని…

కాలానికే కాలాడక ఆగాలి నువ్వు ఆడే వేళ
అది చూడగా మనసాగక ఆడాలి నీతో నింగి నేల

తకధిమి తాళాలపై తళుకుల తరంగమై, చిలిపిగ చిందాడవే కిన్నెరసా…ని..
మెలకల మందాకిని కులుకుల బృందావని, కనులకు విందీయవే ఆ అందాన్ని…

చరణం : చంద్రుల్లో కుందేలే మా ఇంట ఉందంటూ
మురిసింది ఈ ముంగిలి
చిందాడే కిరణంలా మా ముందు నువ్వుంటే
ప్రతి పూట దీపావళి

మా కళ్ళల్లో వెలిగించవే సిరివెన్నెల
మా ఆశలే నీ అందెలై ఈ మంచు మౌనం మ్రోగే వేళ
ఆ సందడే ఆనందమై, ప్రేమించు ప్రాణం పాడే వేళ…

ఉరుములు నీ మువ్వలై, మెరుపులు నీ నవ్వులై.
తొలకరి మేఘానివై రా కల్యాణి

పరుగులు నీ గానమై, తరగలు నీ తాళమై
చిలిపిగ చిందాడవే కిన్నెరసాని

చరణం : నడయాడే నీ పాదం నట వేదమేనంటు
ఈ పుడమే పులకించగా
నీ పెదవే తనకోసం అనువైన కొలువంటు
సంగీతం నిను చేరగా

మా గుండెనే శృతి చేయవా నీ వీణగా
ఈ గాలిలో నీ వేలితో రాగాలు ఎన్నో రేగేవేలా
నీ మేనిలో హరివిల్లులే వర్ణాల వాగులై సాగేవేళ

ఉరుములు నీ మువ్వలై, మెరుపులు నీ నవ్వులై.
తొలకరి మేఘానివై రా కల్యాణి

పరుగులు నీ గానమై, తరగలు నీ తాళమై
చిలిపిగ చిందాడవే కిన్నెరసాని

Tuesday, May 12, 2009

లవ్ బర్డ్స్

రెహమాన్ స్వరకల్పనలోని అందమంతా ఈ పాట లో కనిపిస్తుంది...
తోడుగా అంతే అందంగా సమకూరిన సిరివెన్నెల సాహిత్యం...
వెరసి భూలోకంలో కూడా అమృతం ఉందని నిరూపిస్తున్నాయి మన తెలుగు పాటలు .


మనసున మనసుగ, నిలిచిన కలవా....

లవ్ బర్డ్స్
సంగీతం : A.R.రెహమాన్
రచన: సిరివెన్నెల


పల్లవి : మనసున మనసుగ, నిలిచిన కలవా....
పిలిచిన పలకగ ఎదుటనే కలవా,
దొరికినదే నా స్వర్గం, పరిచినది విరి మార్గం
మిన్నుల్లో నీవే ,మన్నుల్లో నీవే ,
కన్నుల్లో నీవే ........రావా

మనసున మనసుగ, నిలిచిన కలవా....

చరణం : మేఘం నేల ఒళ్ళు మీటే రాగామల్లే...
ప్రేమా వరాల జల్లు కావా...
పిలుపే అందుకొని,బదులే తెలుపుకొని ,కౌగిట ఒదిగి ఉండనీవా....
నా గుండె కోవెల విడిచి వెళ్ళ తగునా ...తగునా,
మల్లె పూల మాలై నిన్నే వరించి పూజించే వేళా
నిరీక్షించి స్నేహం కోరి , జతనై రానా ...రానా...
ఉప్పొంగి పోయే ప్రాయం నిన్ను విడువదు ఏ వెళైనా
నా శ్వాస ప్రతి పూట వినిపించు నీ పాట..
ఏడేడు జన్మలు నేనుంటా నీ జంట ...


మనసున మనసుగ, నిలిచిన కలవా....


చరణం : పూవై నవ్వులని , తేనై మాధురిని పంచే పాట మన ప్రేమ ...
విరిసే చంద్రకళ , ఎగసే కడలి అల , పలికే కవిత మన ప్రేమ ....
కాలాన్ని పరిపాలిద్దాం, కన్న కలలే నిజమై ....
వేటాడు ఎడబాటు, ఏనాడు కలగదు ఇక ఇటుపై ..

నూరేళ్ళ కాలం కూడా, ఒక్క క్షణమై.. నువ్వూ నేను చేరి సగమవుదాం వయస్సు పండించే వరమై ..
ప్రియమైన అనురాగం పలికింది మధుగీతం, తుది లేని ఆనందం వేచేనే నీకోసం ..

మనసున మనసుగ, నిలిచిన కలవా....
పిలిచిన పలకగ ఎదుటనే కలవా,
దొరికినదే నా స్వర్గం, పరిచినది విరి మార్గం
మిన్నుల్లో నీవే ,మన్నుల్లో నీవే ,
కన్నుల్లో నీవే ........రావా

మనసున మనసుగ, నిలిచిన కలవా....

Saturday, April 25, 2009

వాన

ఆకాశగంగా,దూకావే పెంకితనంగా...

రచన : సిరివెన్నెల సీతారామశాస్త్రి
సంగీతం: కమలాకర్
గానం: కార్తీక్

పల్లవి : ఆకాశగంగా,దూకావే పెంకితనంగా...
జలజల జడిగా,తొలి అలజడిగా..
తడబడు అడుగా,నిలబడు సరిగా...
నా తలపు ముడి వేస్తున్నా,నిన్నాపగా ఆ ఆ ...

ఆకాశగంగా,దూకావే పెంకితనంగా...
ఆకాశగంగా...

చరణం : కనుబొమ్మ విల్లెత్తి,ఓ నవ్వు విసిరావే,
చిలకమ్మ గొంతెత్తి,తీయంగ కసిరావే,
కనుబొమ్మ విల్లెత్తి,ఓ నవ్వు విసిరావే,
చిలకమ్మ గొంతెత్తి,తీయంగ కసిరావే.

చిటపటలాడి,వెలసిన వానా...
మెరుపుల దాడి,కనుమరుగైనా
నా గుండెలయలో విన్నా నీ అలికిడీ ...

ఆకాశగంగా,దూకావే పెంకితనంగా...
ఆకాశగంగా...

చరణం : ఈ పూట వినకున్నా,నా పాట ఆగేనా
ఏ బాటలోనైనా,నీ పైటనొదిలేనా-2

మనసుని నీతో,పంపేస్తున్నా..
నీ ప్రతి మలుపూ.తెలుపవె అన్నా...
ఆ జాడలన్నీ వెతికి,నిన్ను చేరనా ..ఆ ఆ ...

ఆకాశగంగా,దూకావే పెంకితనంగా...
జలజల జడిగా,తొలి అలజడిగా..
తడబడు అడుగా,నిలబడు సరిగా...
నా తలపు ముడి వేస్తున్నా,నిన్నాపగా ఆ ఆ ...

ఆకాశగంగా,దూకావే పెంకితనంగా...
ఆకాశగంగా...

వాన

ఎదుట నిలిచింది చూడు...

సంగీతం : కమలాకర్
రచన : సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం : కార్తీక్


పల్లవి : ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో
ఎదను తడిపింది నేడు చినుకంటి చిన్నదేమో
మైమరచిపోయా మాయలో
ప్రాణమంత మీటుతుంటే వానవీణలా ...ఆ ఆ ....


ఎదుట నిలిచింది చూడు

చరణం :నిజం లాంటి ఈ స్వప్నం ఎలా పట్టి ఆపాలీ
కలే ఐతే ఆ నిజం ఎలా తట్టుకోవాలీ
అవునో కాదో అడగకంది నా మౌనం
చెలివో శిలవో తెలియకుంది నీ రూపం
చెలిమి బంధమల్లుకుందే జన్మ ఖైదులా ..ఆ ఆ ....


ఎదుట నిలిచింది చూడు


చరణం : నిన్నే చేరుకోలేక ఎటేళ్ళిందో నా లేఖా
వినేవారు లేకా విసుక్కుంది నా కేకా
నీదో కాదో రాసున్న చిరునామా
ఉందో లేదో ఆ చోట నా ప్రేమా

వరంలాంటి శాపమేదో సొంతమైందిలా ...ఆ ఆ .....

ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో
ఎదను తడిపింది నేడు చినుకంటి చిన్నదేమో
మైమరచిపోయా మాయలో
ప్రాణమంత మీటుతుంటే వానవీణలా ...ఆ ఆ ....

ఎదుట నిలిచింది చూడు

Saturday, April 4, 2009

ఆంధ్రుడు

ప్రాణం లో ప్రాణంగా మాటల్లో

గానం : చిత్ర
రచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
సంగీతం : కళ్యాణీ మాలిక్

పల్లవి : ప్రాణం లో ప్రాణంగా మాటల్లో మౌనం గా చెపుతున్నా..
బాధైనా ఏదైనా భారం గా దూరం గా వెళుతున్నా..
మొన్న కన్న కలా నిన్న విన్న కథ రేపు రాదు కదా జతా..
ఇలా ఇలా... నిరాశగా...
నది దాటుతున్నా ఊరు మారుతున్నా ఊరుకోదు ఎదా ఆ..

ప్రాణం లో ప్రాణంగా మాటల్లో మౌనం గా చెపుతున్నా..
బాధైనా ఏదైనా భారం గా దూరం గా వెళుతున్నా..

చరణం :స్నేహం నాదే, ప్రేమా నాదే, ఆ పైన ద్రోహం నాదే ...
కనులు నావె, వేలు నాదే, కన్నీరు నాదే లే..
తప్పంత నాదే, శిక్షంత నాకే, తప్పించుకోలేనే..
ఎడారి లొ తుఫాను లొ
తడి ఆరుతున్న తడి చూడకున్నా ఎదురేది అన్నా...

ప్రాణం లో ప్రాణంగా మాటల్లో మౌనం గా చెపుతున్నా..
బాధైనా ఏదైనా భారం గా దూరం గా వెళుతున్నా..

చరణం :ఆట నాదే, గెలుపు నాదే, అనుకోని ఊటమి నాదే ఈ..
మాట నాదే, బదులు నాదే, ప్రశ్నల్లే మిగిలానే
నా జాతకాన్నె, నా చేతి తోనే, నే మార్చి రాశానే..
గతానిపై సమాధినై, బ్రతిమాలుతున్నా,
స్థితి మారుతున్నా, బ్రతికేస్తు ఉన్నా ఆ..

ప్రాణం లో ప్రాణంగా మాటల్లో మౌనం గా చెపుతున్నా..
బాధైనా ఏదైనా భారం గా దూరం గా వెళుతున్నా..

Friday, April 3, 2009

గులాబి

ఏ రోజైతే చూసానో నిన్ను....

సంగీతం : శశి ప్రీతం
సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం : శశి ప్రీతం

పల్లవి : ఏ రోజైతే చూసానో నిన్ను..
ఆ రోజే నువ్వయిపొయా నేను
కాలం కాదన్నా ఏదూరం అడ్డున్నా నీ ఊపిరినై నే జీవిస్తున్నాను
నీ స్పర్శే ఈ వీచే గాలుల్లొ ..నీ రూపే నా వేచే గుండెల్లో
నిన్నటి నీ స్మృతులే నన్ను నడిపిస్తూ ఉంటే
ఆ నీ నీడై వస్తాను ఎటువైపున్నా

నీ కష్టం లో నేను ఉన్నాను
కరిగే నీ కన్నీరౌతా నేను
చెంపల్లో జారి నీ గుండెల్లో చేరి నీ ఏకాంతంలో ఓదార్పౌతాను

చరణం : కాలం ఏదో గాయం చేసింది
నిన్నే మాయం చేసానంటోంది
లోకం నమ్మి అయ్యో అంటోంది
శోకం పిండి జో కొడతానంది
గాయం కోస్తున్నా నే జీవించే ఉన్నా
ఆ జీవం నీవని సాక్షం ఇస్తున్నా
 
ఆఆ ..నీతో గడిపిన ఆ నిముషాలన్ని
నాలో దాగే గుండెల సవ్వడులే
జరిగే వింతే నే నమ్మేదెట్టాగా
నువు లేకుంటే నేనంటు ఉండనుగా

నీ స్పర్శే ఈ వీచే గాలుల్లొ ..నీ రూపే నా వేచే గుండెల్లో
నిన్నటి నీ స్మృతులే నన్ను నడిపిస్తూ ఉంటే
ఆ నీ నీడై వస్తాను ఎటువైపున్నా
నీ కష్టం లో నేను ఉన్నానుకరిగే నీ కన్నీరౌతా నేను
చెంపల్లో జారి నీ గుండెల్లో చేరి నీ ఏకాంతంలో ఓదార్పౌతాను

Wednesday, April 23, 2008

అంతం,

ఎంతసేపైన...

గానం : చిత్ర
పల్లవి :ఎంతసేపైన ఎదురు చూపేన నా గతీ
ఎంతకీ రాడు ఏవిటోగాని సంగతి
లా..లా..ల ఈ వేళ ఈ చోటనీ రమ్మంది తానేననీ
ఈ వేళ ఈ చోటనీ రమ్మంది తానేననీ
బొత్తిగా మరిచిపోయాడు ఏవిటో

ఎంతసేపైన

పాపర పా పా....పాపర పా పా....

చరణం :ఎన్ని కళ్ళో కమ్ముకుంటున్నా హా అతనినేగా నమ్ముకుంటున్నా
వెక్కిరించే వేయిమందున్నా హా హ ఒక్కదాన్నే వేగి పోతున్నా
ఎన్నాళ్ళు ఈ యాతనా ఇట్టగె ఎదురీదనా
ఎన్నాళ్ళు ఈ యాతనా ఇట్టగె ఎదురీదనా
ఏలుకోడేవె నా రాజు చప్పునా హ హా

ఎంతసేపైన ఎదురు చూపేన నా గతీ
ఎంతకీ రాడు ఏవిటోగాని సంగతి
లా..లా..ల ఈ వేళ ఈ చోటనీ రమ్మంది తానేననీ
ఈ వేళ ఈ చోటనీ రమ్మంది తానేననీ
బొత్తిగా మరిచిపోయాడు ఏవిటో

చరణం :హా తోడులేని ఆడవాళ్ళంటే లా..ల..లా కోడేగాళ్ళ చూడలేరంటా
తోడేళ్ళే తరుముతు ఉంటే తప్పు కోను త్రోవలేకుందే లా.ల..ల
ఓ ఊరంత ఉబలాటమూ నా వెంటనే ఉన్నదే
ఓ ఊరంత ఉబలాటమూ నా వెంటనే ఉన్నదే
ఏవిలాభం గాలిలో చెప్పుకుంటే

ఎంతసేపైన ఎదురు చూపేన నా గతీ
ఎంతకీ రాడు ఏవిటోగాని సంగతి
లా..లా..ల ఈ వేళ ఈ చోటనీ రమ్మంది తానేననీ
ఈ వేళ ఈ చోటనీ రమ్మంది తానేననీ
బొత్తిగా మరిచిపోయాడు ఏవిటో

అంతం

నీ నవ్వు చెప్పింది నాతో ...
గానం : S.P.బాలసుబ్రమణ్యం
రచన : సీతారామశాస్త్రి

పల్లవి :నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరో ఏమిటో
నీ నీడ చూపింది నాలో ఇన్నాళ లోటేమిటో
నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరో ఎమిటో
నీ నీడ చూపింది నాలో ఇన్నాళ లోటేమిటో

చరణం :నాకై చాచిన నీ చేతిలో
చదివాను నా నిన్న నీ
నాకై చాచిన నీ చేతిలో
చదివాను నా నిన్న నీ
నాతో సాగిన నీ అడుగులో చూశాను మన రేపు నీ
పంచేందుకే ఒకరు లేని బతుకెంత బరువో అనీ
ఏ తోడుకీ నోచుకోనినడకెంత అలుపో అనీ

చరణం :నల్లని నీ కను పాపలలో ఉదయాలు కనిపించనీ
నల్లని నీ కను పాపలలో ఉదయాలు కనిపించనీ
వెన్నెల పేరే వినిపించనీ నడి రేయి కరిగించనీ
నా పెదవిలో నువ్విలాగె చిరునవ్వు పుడుతుందనీ
నీ సిగ్గు నా జీవితాన తొలి ముగ్గు పెడుతుందనీ

చరణం : యెనాడైతే ఈ జీవితం రెట్టింపు బరువెక్కునో
యేనాడైతే ఈ జీవితం రెట్టింపు బరువెక్కునో
తనువు మనసు చెరి సగమని పంచాలి అనిపించునో
సరిగా అదే సుభముహూర్తం సంపూర్ణ మయ్యేందుకు
మనమే మరో కొత్త జన్మం పొందేటి బంధాలకు
ఊ లాల లాల...

నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరో ఏమిటో
నీ నీడ చూపింది నాలో ఇన్నాళ లోటేమిటో

Saturday, April 19, 2008

గులాబి

ఈవేళలో నీవు...
గానం : సునీత
సంగీతం : శశిప్రీతం
రచన : సిరివెన్నెల

పల్లవి : ఈవేళలో నీవు ఏంచేస్తు ఉంటావో
అనుకుంటు ఉంటాను ప్రతి నిముషమూ నేను
నా గుండె ఏనాడో చేజారిపోయింది
నీ నీడగా మారి నా వైపు రానంది
దూరాన ఉంటూనే ఏ మాయ చేశావో
ఈవేళలో నీవు ఏంచేస్తు ఉంటావో
అనుకుంటు ఉంటాను ప్రతి నిముషమూ నేను

చరణం :నడిరేయిలో నీవు నిదురైన రానీఎవు
గడిచేదెలా కాలము...గడిచేదెలా కాలము
పగలైన కాసేపు పనిచేసుకోనీవు
నీ మీదనే ధ్యానము...నీమీదనే ధ్యానము

ఏవైపు చూస్తున్న నీ రూపె తోచింది
నువు కాక వేరేది కనిపించనంటూందిఈ ఇంద్రజాలాన్ని నీవేన చేసింది
నీ పేరులో ఏదో ప్రియమైన కైపుంది
నీ మాట వింటూనే ఏంతోచనీకుంది
నీ మీద ఆశేదో నను నిలువనీకుంది
మతి పోయి నేనుంటే నువు నవ్వుకుంటావు
ఈవేళలో నీవు ఏంచేస్తు ఉంటావో
అనుకుంటు ఉంటాను ప్రతి నిముషమూ నేను...

Wednesday, April 16, 2008

చక్రం

చాలా ఇష్టమైన పాట
ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది...

ఒకే ఒక మాటా...
గానం,సంగీతం : చక్రి
రచన : సిరివెన్నెల

పల్లవి :ఒకే ఒక మాటా..మదిలోన దాగుంది మౌనంగా
ఒకే ఒక మాటా..పెదవోపలేనంత తీయంగా

నా పేరు నీ ప్రేమనీ..నా దారి నీ వలపనీ
నా చూపు నీ నవ్వనీ..నా ఊపిరే నువ్వనీ
నీకు చెప్పాలని..

ఒకే ఒక మాటా..మదిలోన దాగుంది మౌనంగా
ఒకే ఒక మాటా..పెదవోపలేనంత తీయంగా

చరణం :నేను అనీ..లేను అనీ..చెబితె ఏం చేస్తావూ
నమ్మననీ..నవ్వుకొనీ..చాల్లె పొమ్మంటావూ
నీ మనసులోని ఆశగా..నిలిచేది నేననీ
నీ తనువులోని స్పర్సగా..తగిలేది నేననీ
నీ కంటి మైమరపులో నను పోల్చుకుంటాననీ
తల ఆన్చి నీగుండెపై నా పేరు వింటాననీ
నీకు చెప్పాలని..

ఒకే ఒక మాటా..మదిలోన దాగుంది మౌనంగా
ఒకే ఒక మాటా..పెదవోపలేనంత తీయంగా

చరణం : నీ అడుగై నడవడమే..పయనమన్నది పాదం
నిను విడిచీ బతకడమే..మరణమన్నది ప్రాణం
నువు రాక ముందు జీవితం గురుతైన లేదనీ
నిను కలుసుకున్న ఆ క్షణం నను వదలి పోదనీ
ప్రతి ఘడియ ఓ జన్మగా..నే గడుపుతున్నాననీ
ఈ మహిమ నీదేననీ..నీకైన తెలుసా అనీ
నీకు చెప్పాలని..

ఒకే ఒక మాటా..మదిలోన దాగుంది మౌనంగా
ఒకే ఒక మాటా..పెదవోపలేనంత తీయంగా
నా పేరు నీ ప్రేమనీ..నా దారి నీ వలపనీ
నా చూపు నీ నవ్వనీ..నా ఊపిరే నువ్వనీ
నీకు చెప్పాలని..

ఒకే మాటా..
ఒకే ఒక మాటా..మదిలోన దాగుంది మౌనంగా
ఒకే ఒక మాటా..పెదవోపలేనంత తీయంగా

Friday, April 11, 2008

నీ స్నేహం

చాలా ఇష్టమైన పాట.పిక్చరైజేషన్ కూడా చాలా నాచురల్ గా ఉంటుంది.
ఈపాటకు ఉష కు మొదటి సారి నంది అవార్డు వచ్చిందనుకుంటా...

చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా
గానం : ఉష
సంగీతం : R.P.పట్నాయక్
రచన : సిరివెన్నెల

పల్లవి : చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా ఆ ...
ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా
మువ్వలే మనసు పడు పాదమా
ఊహలే ఉలికి పడు ప్రాయమా
హిందోళంలా సాగే అందాల సెలయేరమ్మా
ఆమని మధువనమా...ఆ..ఆ..

చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా ఆ ...
ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా

చరణం : పసిడి వేకువలు పండు వెన్నెలలు
పసితనాలు పరువాల వెల్లువలు
కలిపి నిన్ను మలిచాడో బ్రహ్మ...
స్వచ్చమైన వరిచేల సంపదలు
అచ్చతెనుగు మురిపాల సంగతులు
కళ్ళముందు నిలిపావె ముద్దుగుమ్మా
పాలకడలి కెరటాలవంటి నీ లేత అడుగు
తన ఎదను మీటి నేలమ్మ పొంగెనమ్మా...ఆ..ఆ..ఆ
ఆగని సంబరమా...ఆ..ఆ..ఆ..

చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా ఆ ...
ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా

చరణం : వరములన్ని నిను వెంటబెట్టుకుని
ఎవరి ఇంట దీపాలు పెట్టమని అడుగుతున్నవే కుందనాల బొమ్మా...
సిరుల రాణి నీ చేయి పట్టి శ్రీహరిగ మారునని రాసిపెట్టి
ఏ వరుని జాతకం వేచి ఉన్నదమ్మా....
అన్నమయ్య శృంగారకీర్తనం వర్ణనలకు ఆకారమైన
బంగారు చిలకవమ్మా....
ఆ..ఆ..ఆ..ఆ కముని సుమ శరమా...ఆ.ఆ

చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా ఆ ...
ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా....