Showing posts with label మల్లీశ్వరి. Show all posts
Showing posts with label మల్లీశ్వరి. Show all posts

Friday, December 19, 2008

ఆకాశవీధిలో హాయిగా ఎగిరేవు.....

మల్లేశ్వరి-(1951)
సంగీతం : సాలూరి రాజేశ్వర రావు
రచన : దేవులపల్లి
పాడినవారు :భానుమతి,ఘంటసాల

పల్లవి : ఆకాశవీధిలో హాయిగా ఎగిరేవు దేశదేశాలన్ని తిరిగిచూసేవూ
ఏడతానున్నాడో బావా ఏడతానున్నాడో బావా
జాడ తెలిసిన పోయిరావా
అందాల ఓ మేఘమాలా అందాల ఓ మేఘమాలా

చరణం : గగనసీమల తేలు ఓ మేఘమాలా
మా వూరు గుడి పైన మసలి వస్తున్నావా
మల్లి మాటేదైనా నాతో మనసు చల్లగా చెప్పి పోవా
నీలాల ఓ మేఘమాలా రాగాల ఓ మేఘమాలా

చరణం : మమతలెరిగిన మేఘమాలా
మమతలెరిగిన మేఘమాలా
నా మనసు బావకు చెప్పిరావా
ఎన్నాళ్ళు నా కళ్ళు దిగులుతోరేపవలు
ఎన్నాళ్ళు నా కళ్ళు దిగులుతోరేపవలు
ఎదురుతెన్నులు చూచెనే ఎదరి కాయలు కాచెనే
అందాల ఓ మేఘమాలా రాగాల ఓ మెఘ మాలా

చరణం : మనసు తెలిసిన మేఘమాలా మరువలేనని చెప్పలేవా
మల్లితో మరువులేవని చెప్పలేవా
కళ్ళు తెరచిన గానీ కళ్ళుమూసినగానీ
కళ్ళు తెరచిన గానీ కళ్ళుమూసినగానీ
మల్లిరూపే నిలిచనే నా చెంత మల్లి మాటే పిలిచెనే

జాలిగుండెల మేఘమాలా బావ లేనిదే బ్రతుకజాలా
జాలిగుండెల మేఘమాలా
కురియునాకన్నీరు గుండెలో దాచుకుని వానజల్లుగ కురిసిపోవా
కన్నీరు వాన వాలుగా బావ ఏలా

Tuesday, December 18, 2007

మల్లీశ్వరి

మల్లీశ్వరి
గానం : భానుమతి
రచన :దేవులపల్లి కృష్ణశాస్త్రి

పిలిచినా బిగువటరా ఔరౌరా -3
చెలువలు తామే వలచి వచ్చిన పిలిచినా బిగువటరా ఔరౌరా
చెలువలు తామే వలచి వచ్చిన
భళిరా రాజా ఆ

ఈ నయగారము ఈ వయ్యారముఈ - 2
ఈ నవ యవ్వన మారం వినునే
పిలిచినా బిగువటరా
ఈ నయగారము ఈ వయ్యారము
ఈ నవ యవ్వన మారం వినునే
పిలిచినా బిగువటరా

గాలుల తేనెల వాడని మమతల - 2
నీలపు మబ్బుల నీడను గననను
అందెల రవళుల సందడి మరిమరి
అందెల రవళుల ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
అందెల రవళుల సందడి మరిమరి
అందగాడా ఇటు తొందర చేయగా - 2
పిలిచినా బిగువటరా ఔరౌరా
పిలిచినా బిగువటరా

మల్లీశ్వరి

మల్లీశ్వరి
గానం : భానుమతి
రచన :దేవులపల్లి కృష్ణశాస్త్రి

మనసున మల్లెల మాలలూగెనే
కన్నుల వెన్నెల డోలలూగెనే
ఎంత హాయి ఈ రేయి నిండెనోఎంత హాయి ఈ రేయి నిండెనో
ఎన్ని నాళ్ళకీ బ్రతుకు పండెనో

కొమ్మల గువ్వలు గుస గుస మనినా
రెమ్మల గాలులు ఉసురుసుననినా
అలలు కొలనులో గల గల మనినా - 2
దవ్వున వేణువు సవ్వడి వినినా - 2
నీవు వచ్చేవని నీ పిలుపే విని - 2
కన్నుల నీరిడి కలయ చూచితిని
ఘడియ యేని ఇక విడిచిపోకుమా - 2
ఎగసిన హృదయము పగులనీకుమా
ఎన్ని నాళ్ళకీ బ్రతుకు పండెనో
ఎంత హాయి ఈ రేయి నిండెనో