Showing posts with label వనమాలి. Show all posts
Showing posts with label వనమాలి. Show all posts

Thursday, April 16, 2015

ఓయ్...

సంగితం : యువన్ శంకర్ రాజా
రచన : వనమాలి
గానం : యువన్ శంకర్ రాజా


నన్నొదిలి నీడ వెళ్ళిపొతోందా...... కన్నొదిలీ చూపు వెళ్ళిపోతోందా
వేకువనే సందె వాలి పోతోందే చీకటిలో ఉదయముండిపోయిందే
నా ఎదనే తొలిచిన గురతుగా నిను తెస్తుందా
నీ జతలో గడిపిన బ్రతుకిక బలి అవుతుందా
నువ్వుంటే నేనుంటా ప్రేమా.......పోవొద్దే పోవొద్దే ప్రేమా
నన్నొదిలీ నీడ వెళ్ళిపొతోందా.......కన్నొదిలీ చూపు వెళ్ళిపోతోందా..


ఇన్ని నాళ్ళు నీ వెంటే సాగుతున్న నా పాదం..వెంట పడిన అడుగేదంటోందే ఓ ఓ ఓ
నిన్నదాక నీ రూపం నింపుకున్న కనుపాపే నువ్వు లేక నను నిలదీస్తోందే
కోరుకున్న జీవితమే చేరువైన ఈ క్షణమే......జాలి లేని విధిరాతే శాపమైనదే
మరుజన్మే ఉన్నదంటే బ్రహ్మనైనా అడిగేదొకటే.. కనమంటా మమ్ము తన ఆటలిక సాగని చోటే
నువ్వుంటే నేనుంటా ప్రేమా......పోవొద్దే పోవొద్దే ప్రేమా

నువ్వుంటే నేనుంటా ప్రేమా......పోవొద్దే పోవొద్దే ప్రేమా

Friday, February 25, 2011

ఓయ్

నన్నొదిలి నీడ వెళ్ళిపొతోందా

సంగితం : యువన్ శంకర్ రాజా
గానం : యువన్ శంకర్ రాజా
రచన : వనమాలి


నన్నొదిలి నీడ వెళ్ళిపొతోందా
కన్నొదిలీ చూపు వెళ్ళిపోతోందా
వేకువనే సందె వాలి పోతోందే
చీకటిలో ఉదయముండిపోయిందే
నా ఎదనే తొలిచిన గురుతుగ నిను తెస్తుందా
నీ జతలో గడిపిన బ్రతుకిక బలి అవుతుందా
నువ్వుంటే నేనుంటా ప్రేమా...పోవొద్దే పోవొద్దే ప్రేమా
నన్నొదిలీ నీడ వెళ్ళిపొతోందా
కన్నొదిలీ చూపు వెళ్ళిపోతోందా..


ఇన్ని నాళ్ళు నీ వెంటే సాగుతున్న నా పాదం
వెంట పడిన అడుగేదంటోందే ఓ...
నిన్నదాక నీ రూపం నింపుకున్న కనుపాపే
నువ్వు లేక నను నిలదీస్తోందే
కోరుకున్న జీవితమే చేరువైన ఈ క్షణమే...
జాలి లేని విధిరాతే శాపమైనదే
మరుజన్మే ఉన్నదంటే బ్రహ్మనైనా అడిగేదొకటే
కనమంటా మమ్ము తన ఆటలిక సాగని చోటే
నువ్వుంటే నేనుంటా ప్రేమా,పోవొద్దే పోవొద్దే ప్రేమా

నువ్వుంటే నేనుంటా ప్రేమా....
పోవొద్దే పోవొద్దే ప్రేమా...

Thursday, February 24, 2011

ఆరంజ్

చిలిపిగ చూస్తావలా...

సంగీతం: హారిస్ జయరాజ్
సాహిత్యం: వనమాలి
గానం: కార్తీక్


చిలిపిగ చూస్తావలా,పెనవేస్తావిలా ,నిన్నే ఆపేదెలా ...
చివరకి నువ్వే అలా ,వేస్తావే వలా,నీతో వేగేదెలా ...

ఓ ప్రేమా ...కన్నుల్లో వాలే రోజు ఎంతో బాగుందనీ కలా..
కొన్నాళ్ళే ...అందంగా ఊరిస్తోందీ ఆపై చేదెక్కుతోందిలా..
కడదాకా ప్రేమించే దారేదో పోల్చేదెలా.

చిలిపిగ చూస్తావలా,పెనవేస్తావిలా ,నిన్నే ఆపేదెలా ...
చివరకి నువ్వే అలా ,వేస్తావే వలా,నీతో వేగేదెలా ...

నిన్నే ఇలా ,చేరగా ,మాటే మార్చీ మాయే చెయ్యాలా
నన్నే ఇకా ,నన్నుగా,ప్రేమంచనీ ప్రేమేలా
ఊపిరే ఆగేదాకా,ఏదో ఒక తోడుండాలా
నన్నింతగా , ఊరించేస్తూ అల్లేస్తుందే నీ సంకెలా


కొంచెం మధురము,కొంచెం విరహము ,ఇంతలో నువ్వు నరకం
కొంచెం స్వర్గము,కొంచెం శాంతము ,గొంతులో చాలు గరళం
కొంచెం పరువము ,కొంచెం ప్రణయము,గుండెనే కోయు గాయం
కొంచెం మౌనము,కొంచెం గానము ,ఎందుకీ ఇంద్రజాలం


ఇన్నాళ్ళుగా ,సాగినా ప్రేమనుంచి వేరై పోతున్నా
మళ్ళీ మరో , గుండెతో స్నేహం కోరీ వెళుతున్నా
ప్రేమనే ,దాహం తీర్చేసాయం కోసం వేచానిలా
ఒక్కోక్షణం , ఆ సంతోషం , నాతో పాటు సాగేదెలా ఎలా

చిలిపిగ చూస్తావలా,పెనవేస్తావిలా ,నిన్నే ఆపేదెలా ...
చివరకి నువ్వే అలా ,వేస్తావే వలా,నీతో వేగేదెలా ...


ఓ ప్రేమా ...కన్నుల్లో వాలే రోజు ఎంతో బాగుందనీ కలా..
కొన్నాళ్ళే ...అందంగా ఊరిస్తోందీ ఆపై చేదెక్కుతోందిలా..
కడదాకా ప్రేమించే దారేదో పోల్చేదెలా.


కొంచెం మధురము,కొంచెం విరహము ,ఇంతలో నువ్వు నరకం
కొంచెం స్వర్గము,కొంచెం శాంతము ,గొంతులో చాలు గరళం
కొంచెం పరువము ,కొంచెం ప్రణయము,గుండెనే కోయు గాయం
కొంచెం మౌనము,కొంచెం గానము ,ఎందుకీ ఇంద్రజాలం

Monday, February 14, 2011

తీసే ప్రతి శ్వాసా ...

Village లో వినాయకుడు

సంగీతం : మణికాంత్ కద్రి
రచన : వనమాలి
గానం : హరిచరణ్

తీసే ప్రతి శ్వాసా ,తన తలపవుతున్నదీ...
తీసే ప్రతి శ్వాసా, తన తలపవుతున్నదీ...
జారే ప్రతి ఆశా జత అడుగేదన్నదీ..
ఓ నీడ తన వెలుగునే వెతుకుతున్నదీ
ఓ నీడ తన వెలుగునే వెతుకుతున్నదీ

కలవో లేవో కనలేని ,కను చూపు ఎటు వాలుతున్నా .. తన రూపు కదలాడుతోందా
ప్రతి గాలి తన లాలి పాటైనదా
కన్నీటి అల తాకుతుంటే , ఈ కంటి కల కరుగుతోందా...
ప్రతి మలుపు తను లేని బాటైనదా

హే ఆ పాశమే నేడు ,ఆవేదనవుతోందా
ఏ దారి కనరాక ఎదురీదుతూ ఉందా
ఈ పాదమీ వేళా ఏకాకి లా మల్లే
ఏ దరికి చేరాలో ఎదనడుగుతుందా

తొలి ప్రేమ గుండెలను తొలిచేస్తు ఉన్నదా (2)

కలవో లేవో కనలేని ...!

Monday, February 7, 2011

విలేజ్ లో వినాయకుడు

చినుకై వరదై సెలయేటి తరగై...
సంగీత సాహిత్యాల పర్ ఫెక్ట్ జోడీ ...

గానం : హరి హరన్,శ్వేతా మోహన్
సంగీతం :మణికాంత్ కద్రి
రచన :వనమాలి

చినుకై వరదై సెలయేటి తరగై...
ఉరికే మదిని కడలల్లె కరిగించి కలిపేసుకున్నావు..
వరమై వలపై అనుకోని మలుపై...
కలలే చూపే కనుపాప తెర మీద తొలి వేకువైనావు...

తీసే ప్రతి శ్వాస,నీ తలపవుతున్నది...
రేగే ప్రతి ఆశ, నువు కావాలన్నది...

నా నీడ నను వీడి నిను చేరుకున్నది...
నా నీడ నను వీడి నిను చేరుకున్నది...

చినుకై వరదై సెలయేటి తరగై...
తడి లేని నీరున్నదేమో,సడి లేని ఎద ఉన్నదేమో..
నువు లేక నేనున్న క్షణమున్నదా...

నాలోని ఏనాటి చెలిమో
నిను చేరి మనిషైనదేమో
ఈ వేళ నిను వదిలి రానన్నదా
ఏ రూపమూ లేని ఆకాశమే నీవు
నా నీలి వర్ణాలు నిను వీడి పోలేవు
ఏ బంధమూ లేని ఆనందమే నీవు
తోడు వచ్చి నాకిపుడు.. తొలి బంధువైనావు...
ఆకాశమే నీతో అడుగేయమన్నది..
ఆకాశమే నీతో అడుగేయమన్నది..

చినుకై వరదై సెలయేటి తరగై..
మన వలపు కథ విన్నదేమో..
ఆ కలల కబురందెనేమో..
ప్రతి ఋతువు మధుమాసమవుతున్నదీ...

పసితనపు లోగిళ్ళలోకి
నీ మనసు నను లాగెనేమో
నా వేలు నిను వీడనంటున్నదీ
ఆరారు కాలాలు.. హరివిల్లు విరియనీ
ఆ నింగి తారల్లె.. మన ప్రేమ నిలవనీ
ఈ మనసు కొలువైన.. తొలి చోటే నీదనీ
నా కలలు నిజమవ్వగా..ఆ విధినైనా గెలవనీ.
లోకాలు కనలేని తొలి జంట మనదనీ..
లోకాలు కనలేని తొలి జంట మనదనీ..

చినుకై వరదై సెలయేటి తరగై..
వరమై వలపై అనుకోని మలుపై..