Showing posts with label సీతారామయ్యగారి మనవరాలు. Show all posts
Showing posts with label సీతారామయ్యగారి మనవరాలు. Show all posts

Wednesday, July 7, 2010

సీతారామయ్యగారి మనవరాలు

పూసింది పూసింది పున్నాగ ...

సీతారామయ్యగారి మనవరాలు
రచన : వేటూరి
సంగీతం : M.M.కీరవాణి
గానం : బాలు , చిత్ర

పూసింది పూసింది పున్నాగ
పూసంత నవ్వింది నీలాగ
సందేళ లాగేసే సల్లంగ
దాని సన్నాయి జెళ్ళోన సంపెంగ
ముల్లోకాలే కుప్పెలై
జడ కుప్పెలై
ఆ...డ జతులా..డ

పూసింది పూసింది పున్నాగ
పూసంత నవ్వింది నీలాగ
సందేళ లాగేసే సల్లంగ
దాని సన్నాయి జెళ్ళోన సంపెంగ

ఇష్టసఖి నా చిలుక నీ పలుకే బంగారంగా
అష్టపదులే పలికే నీ నడకే వయ్యారంగా
కలిసొచ్చేటి కాలాల కౌగిల్లలో కలలొచ్చాయిలే
కలలొచ్చేటి నీ కంటి పాపయిలే కధ చెప్పాయిలే
అనుకోని రాగమే అనురాగ గీతమై
వలపన్న గానమే ఒక వాయులీనమై
పాడే మది పాడే

పూసింది పూసింది పున్నాగ
పూసంత నవ్వింది నీలాగ
సందేళ లాగేసే సల్లంగ
దాని సన్నాయి జెళ్ళోన సంపెంగ

పట్టుకుంది నా పదమే నీ పదమే పారాణిగా
కట్టుకుంది నా కవితే నీ కళలే కల్యాణిగా
అరవిచ్చేటి ఆభేరి రాగాలకే స్వరమిచ్చావులే
ఇరుతీరాల గోదారి గంగమ్మకే అలలిచ్చావులే

అల ఎంకి పాటలే ఇల పూల తోటలై
పసిమొగ్గ రేకులే పరువాల చూపులై
పూసే
విరబూసే

పూసింది పూసింది పున్నాగ
పూసంత నవ్వింది నీలాగ
సందేళ లాగేసే సల్లంగ
దాని సన్నాయి జెళ్ళోన సంపెంగ
ముల్లోకాలే కుప్పెలై జడ కుప్పెలై
ముల్లోకాలే కుప్పెలై జడ కుప్పెలై
ఆడ జతులాడ

పూసింది పూసింది పున్నాగ
పూసంత నవ్వింది నీలాగ
సందేళ లాగేసే సల్లంగ
దాని సన్నాయి జెళ్ళోన సంపెంగ