Showing posts with label ఘర్షణ. Show all posts
Showing posts with label ఘర్షణ. Show all posts

Thursday, February 24, 2011

ఘర్షణ

కురిసేను విరి జల్లులే

సంగీతం : ఇళయరాజా
గానం : S.P.బాలసుబ్రఃమణ్యం,వాణీ జయరాం

కురిసేను విరి జల్లులే
ఒకటయ్యేను ఇరు చూపులే
అనుబంధాలు విరిసేను పన్నీరు చిలికేను
శృంగార మునకీవె శ్రీకారమే కావె

ఆకుల పై రాలు ఆ..
ఆకులపై రాలు హిమబిందువు వోలె
నా చెలి వొడిలోన పవళించనా
ఆకులపై రాలు హిమబిందువు వోలె
నా చెలి వొడిలోన పవళించనా
రాతిరి పగలు మురిపాలు పండించు
చెలికాడిని ఎద చేర్చి లాలించనా
నేను నీకు రాగ తాళమ్
నీవు నాకు వేద నాదం ఆ...

కన్నుల కదలాడు ఆ....,ఆశలు శృతి పాడు
వన్నెల మురిపాల కధ ఏమిటో
తలపుల మాటుల్లో వలపుల తోటల్లో
ఊహలు పలికించు కలలేమిటో
పెదవుల తెరలోన మధురాల సిరివాన
మధురిమ లందించు సుధలేమిటో
ప్రవశమే సాగి పరువాలు చెలరేగి
మనసులు కరిగించు సుఖమేమిటో
పల్లవించే మోహ బంధం
ఆలపించే రాగ బంధం ఆ...

కురిసేను విరి జల్లులే
ఒకటయ్యేను ఇరు చూపులే
అనుబంధాలు విరిసేను పన్నీరు చిలికేను
శృంగార మునకీవె శ్రీకారమే కావె.