Showing posts with label నిరీక్షణ. Show all posts
Showing posts with label నిరీక్షణ. Show all posts

Saturday, June 20, 2009

నిరీక్షణ

సుక్కల్లే తోచావే...
రచన : ఆచార్య ఆత్రేయ
గానం: K.J.యేసుదాస్

పల్లవి : సుక్కల్లే తోచావే...
ఎన్నెల్లే కాచావే...ఏడ బోయావే
ఇన్ని వేల సుక్కల్లో నిన్ను నే వెతికానే
ఇన్ని వేల సుక్కల్లో నిన్ను నే వెతికానే...
సుక్కల్లే తోచావే...
ఎన్నెల్లే కాచావే...ఏడ బోయావే

చరణం :పూసిందే ఆ పూలమాను నీ దీపంలో
దాగిందే నా పేద గుండె నీ తాపం లో
ఊగానే నీ పాటలో ఉయ్యాలై
ఉన్నానే ఈ నాటికీ నేస్తాన్నై
ఉన్నా ఉన్నాదొక దూరం .. ఎన్నాళ్ళకు చేరం .. తీరందీ నేరం !

సుక్కలే తోచావే .. ఎన్నెల్లే కాచావే ..ఏడ బోయావే

చరణం :తానాలే చేసాను నీ స్నేహంలో
ప్రాణాలే దాచావు నీవు నా మోహంలో
ఆనాటి నీ కళ్ళలో నా కళ్ళే
ఈనాటీ నా కళ్ళలొ కన్నీళ్ళే
ఉందా కన్నీళ్ళకు అర్ధం .. ఇన్నేళ్ళకు వ్యర్ధం .. చట్టందే రాజ్యం !

సుక్కల్లే తోచావే...
ఎన్నెల్లే కాచావే...ఏడ బోయావే
ఇన్ని వేల సుక్కల్లో నిన్ను నే వెతికానే
ఇన్ని వేల సుక్కల్లో నిన్ను నే వెతికానే...

సుక్కల్లే తోచావే...
ఎన్నెల్లే కాచావే...ఏడ బోయావే

సుక్కల్లే తోచావే... ఎన్నెల్లే కాచావే...ఏడ బోయావే

Thursday, December 27, 2007

నిరీక్షణ

ఆకాశం ఏనాటిదో...
సంగీతం : ఇళయరాజా
గానం : యస్.జానకి

పల్లవి : ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది
ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది
ఆవేశం ఏనాడు కలిగెనో ఆనాడే తెలిసిందది
ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది (ఆకాశం ఏనాటిదో) అనురాగం ఆనాటిదీ
చరణం : ఏ పువ్వూ ఏ తేటిదన్నది ఏనాడో రాసున్నదీ
ఏ ముద్దూ ఏ మోవిదన్నది ఏ పొద్దో రాసున్నదీ
బంధాలై పెనవేయు వయసుకు అందాలే దాసోహమనగా
మందారం విరబూయు పెదవులు మధువులనే చవిచూడమనగా
పరువాలే..ప్రణయాలై.. స్వప్నాలే...స్వర్గాలై...
ఎన్నెన్నో శృంగార లీలలు కన్నుల్లో రంగేళి అలవెను

ఆవేశం ఏనాడు కలిగెనో ఆనాడే తెలిసిందదిఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది
చరణం : ఏ మేఘం ఏ వాన చినుకై చిగురాకై మొలకెత్తెనో
ఏ రాగం ఏ గుండెలోతున ఏ గీతం పలికించెనో
హృదయాలే తెరతీసి తనువుల కలబోసీ మరపించమనగ
కౌగిలిలో చెరవేచు మదనుని కరిగించీ గెలిపించమనగ
మోహాలే.. దాహాలై....సరసాలే.. సరదాలై
కలాన్నే నిలవేసి కలలకు ఇవ్వాలీ వెలలేని విలువలు

ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది
ఆవేశం ఏనాడు కలిగెనో ఆనాడే తెలిసిందది