కురిసేను విరి జల్లులే
సంగీతం : ఇళయరాజా
గానం : S.P.బాలసుబ్రఃమణ్యం,వాణీ జయరాం
కురిసేను విరి జల్లులే
ఒకటయ్యేను ఇరు చూపులే
అనుబంధాలు విరిసేను పన్నీరు చిలికేను
శృంగార మునకీవె శ్రీకారమే కావె
ఆకుల పై రాలు ఆ..
ఆకులపై రాలు హిమబిందువు వోలె
నా చెలి వొడిలోన పవళించనా
ఆకులపై రాలు హిమబిందువు వోలె
నా చెలి వొడిలోన పవళించనా
రాతిరి పగలు మురిపాలు పండించు
చెలికాడిని ఎద చేర్చి లాలించనా
నేను నీకు రాగ తాళమ్
నీవు నాకు వేద నాదం ఆ...
కన్నుల కదలాడు ఆ....,ఆశలు శృతి పాడు
వన్నెల మురిపాల కధ ఏమిటో
తలపుల మాటుల్లో వలపుల తోటల్లో
ఊహలు పలికించు కలలేమిటో
పెదవుల తెరలోన మధురాల సిరివాన
మధురిమ లందించు సుధలేమిటో
ప్రవశమే సాగి పరువాలు చెలరేగి
మనసులు కరిగించు సుఖమేమిటో
పల్లవించే మోహ బంధం
ఆలపించే రాగ బంధం ఆ...
కురిసేను విరి జల్లులే
ఒకటయ్యేను ఇరు చూపులే
అనుబంధాలు విరిసేను పన్నీరు చిలికేను
శృంగార మునకీవె శ్రీకారమే కావె.
Showing posts with label వాణీ జయరాం. Show all posts
Showing posts with label వాణీ జయరాం. Show all posts
Thursday, February 24, 2011
Saturday, April 25, 2009
పూజ
ఈ పాట తో గీతాంజలి 100 పాటలు పూర్తి చేసుకుంది. . . .
ఎన్నెన్నో జన్మల బంధం నీదీ.. నాదీ
సంగీతం : రమెష్ నాయుడు
గానం : S.P.బాల సుబ్రమణ్యం ,వాణీ జయరాం
పల్లవి : ఎన్నెన్నో జన్మల బంధం నీదీ.. నాదీ
ఎన్నటికీ మాయని మమతా నాదీ.. నీదీ
ఒక్క క్షణం నిను వీడీ నేనుండలేనూ
ఒక్క క్షణం నీ విరహం నే తళలేను
ఎన్నెన్నో జన్మల బంధం నీదీ.. నాదీ
చరణం :పున్నమి వెన్నెలలోనా.. పొంగును కడలి
నిన్నే చూసిన వేళ నిండును చెలిమి
నువ్వు కడలివైతే నెను నదిగ మరీ
చిందులే వేసి వేసి నిన్ను చేరనా..
చేరనా... చేరనా..
ఎన్నెన్నో జన్మల బంధం నీదీ.. నాదీ
చరణం : కోటి జన్మలకయినా.. కోరేదొకటే
నాలో సగమై ఎప్పుడు.. నెనుండాలి
నీవున్న వేళ.. ఆ స్వర్గమేల..
ఈ పొందు ఎల్లవేళలందు ఉండనీ..
ఉందని.. ఉందని..
ఎన్నెన్నో జన్మల బంధం నీదీ.. నాదీ
ఎన్నటికీ మాయని మమతా నాదీ.. నీదీ
ఒక్క క్షణం నిను వీడీ నేనుండలేనూ
ఒక్క క్షణం నీ విరహం నే తళలేను
Subscribe to:
Posts (Atom)