Showing posts with label కరెంట్. Show all posts
Showing posts with label కరెంట్. Show all posts

Wednesday, May 12, 2010

కరెంట్

అటు నువ్వే ఇటు నువ్వే....

రోజూ వినే నా Favourite Songs List లో ఈపాట కూడా ఉంటుంది

పల్లవి : అటు నువ్వే ఇటు నువ్వే, మనసెటు చూస్తే అటు నువ్వే
ఎటువెళుతున్నా ఏంచేస్తున్నా ప్రతిచోటా నువ్వే
అటు నువ్వే ఇటు నువ్వే,అలికిడి వింటే అది నువ్వే
అదమరపైనా పెదవుల పైనా ప్రతి మాటా నువ్వే
అపుడు ఇపుడు ఎపుడైనా,నా చిరునవ్వే నీ వలనా
తెలియని లోకం తీపిని నాకు రుచి చూపావులే
పరిచయమంతా గతమేన,గురుతుకురానా క్షణమైనా
ఎదురుగ ఉన్నా నిజమే కాని కలవైనావులే...

అటు నువ్వే ఇటు నువ్వే, మనసెటు చూస్తే అటు నువ్వే
ఎటువెళుతున్నా ఏంచేస్తున్నా ప్రతిచోటా నువ్వే

చరణం : రంగూ రూపమంటూ లేనే లేనిదీ ప్రేమా
చుట్టూ శూన్యమున్నా నిన్ను చూపిస్తూ ఉంది
దూరం దగ్గరంటూ,తేడా చూడదీ ప్రేమా
నీలా చెంత చేరీ, నన్ను మాటాడిస్తుందీ
కనుపాప లోతులో దిగిపోయీ ఇంతలా
ఒక రెప్ప పాటు కాలమైనా మరుపే రావుగా
ఎద మారు మూలలో ఒదిగున్న ప్రాణమై
నువు లేని నేను లేనె లేను అనిపించావుగా

అటు నువ్వే ఇటు నువ్వే, మనసెటు చూస్తే అటు నువ్వే
ఎటువెళుతున్నా ఏంచేస్తున్నా ప్రతిచోటా నువ్వే
అటు నువ్వే ఇటు నువ్వే,అలికిడి వింటే అది నువ్వే
అదమరపైనా పెదవుల పైనా ప్రతి మాటా నువ్వే

చరణం : నాకే తెలియకుండా నాలో నిన్ను వదిలావే
నేనే నువ్వయేలా ప్రేమ గుణమై ఎదిగావే
మాటే చెప్పకుండా నీతో నువ్వు కదిలావే
ఇటుగా చూడనంటూ నన్ను ఒంటరి చేసావే
ఏకాంత వేళలో ఏకాంతి లేదురా
మనసంత కూడ జాలి లేని పంతాలేంటిలా
నీ తోడు లేనిదే మనసుండ లేదురా
నీ పేరు లేని ప్రేమనైన ఊహించేదెలా

అటు నువ్వే ఇటు నువ్వే, మనసెటు చూస్తే అటు నువ్వే
ఎటువెళుతున్నా ఏంచేస్తున్నా ప్రతిచోటా నువ్వే
అటు నువ్వే ఇటు నువ్వే,అలికిడి వింటే అది నువ్వే
అదమరపైనా పెదవుల పైనా ప్రతి మాటా నువ్వే