Showing posts with label చల్లని వెన్నెలలో …చల్లని వెన్నెలలో. Show all posts
Showing posts with label చల్లని వెన్నెలలో …చల్లని వెన్నెలలో. Show all posts

Wednesday, December 30, 2009

చల్లని వెన్నెలలో …చల్లని వెన్నెలలో

గానం : ఘంటసాల

పల్లవి : చల్లని వెన్నెలలో …చల్లని వెన్నెలలో…ఓఓఓ
చల్లని వెన్నెలలో చక్కని కన్నె సమీపములో. …
చల్లని వెన్నెలలో చక్కని కన్నె సమీపములో
అందమే నాలో లీనమాయెనే ఆనందమే నా గానమాయెనే
చల్లని వెన్నెలలో...

చరణం : తెలిమబ్బుల కౌగిలిలో జాబిలి తేలి ఆడెనే ముద్దులలో
తెలిమబ్బుల కౌగిలిలో జాబిలి తేలి ఆడెనే ముద్దులలో
గాలి పెదవులే మెల్లగ సోకిన …గాలి పెదవులే మెల్లగ సోకిన
పూలు నవ్వెనే నిద్దురలో ఓఓఓ...
చల్లని వెన్నెలలో…చక్కని కన్నె సమీపములో …
అందమే నాలో లీనమాయెనే
ఆనందమే నా గానమాయెనే …
చల్లని వెన్నెలలో

చరణం : కళకళలాడే కన్నె వదనమే కనిపించును ఆ తారలలో ఓ…. ఓఓ… ఓఓఓ…ఓఓ…
కళకళలాడే కన్నె వదనమే కనిపించును ఆ తారలలో
కలకాలం నీ కమ్మని రూపము ,..కలకాలమం నీ కమ్మని రూపము
కలవరించునలే నా మదిలో … ఓఓఓ....చల్లని వెన్నెలలో ..
చక్కని కన్నె సమీపములో అందమే నాలో లీనమాయెనే
ఆనందమే నా గానమాయెనే చల్లని వెన్నెలలో