Showing posts with label నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్. Show all posts
Showing posts with label నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్. Show all posts

Saturday, April 5, 2008

నా ఆటోగ్రాఫ్...స్వీట్ మెమొరీస్

నువ్వంటే ప్రాణమనీ ...

గానం: విజయ్ ఏసుదాస్
సంగీతం : M.M.కీరవాణి
రచన : చంద్రబోస్

పల్లవి :నువ్వంటే ప్రాణమనీ నీతోనే లోకమనీ
నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకనీ
ఎవరికి చెప్పుకోను నాకు తప్పా
కన్నులకి కలలు లేవు నీరు తప్పా

నువ్వంటే ప్రాణమనీ నీతోనే లోకమనీ
నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకనీ
ఎవరికి చెప్పుకోను నాకు తప్పా
కన్నులకి కలలు లేవు నీరు తప్పా

చరణం : మనసూ ఉంది మమతా ఉంది..పంచుకొనే నువ్వు తప్ప
ఊపిరి ఉంది ఆయువు ఉంది...ఉండాలనే ఆశ తప్ప
ప్రేమంటేనే శాశ్వత విరహం అంతేనా
ప్రేమిస్తేనే సుధీర్గ నరకం నిజమేనా
ఎవరిని అడగాలి నన్ను తప్పా
చివరికి ఏమవాలి మన్ను తప్పా

నువ్వంటే ప్రాణమనీ నీతోనే లోకమనీ
నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకనీ...

చరణం :వెంటొస్తానన్నావు వెళొస్తానన్నావు..జంటై ఒకరి పంటై వెళ్ళావు
కరుణిస్తానన్నావు వరమిస్తానన్నావు..బరువై మెడకు వురివై పోయావు
దేవతలోనూ ద్రోహం ఉందని తెలిపావు
దీపం కూడా దహియిస్తుందని తేల్చావు
ఎవరిని నమ్మాలి నన్ను తప్పా
ఎవరిని నిందించాలి నిన్ను తప్పా

నువ్వంటే ప్రాణమనీ నీతోనే లోకమనీ
నీ తోడే లేకుంటే బ్రతికేది ఎందుకనీ
ఎవరికి చెప్పుకోను నాకు తప్పా
కన్నులకి కలలు లేవు నీరు తప్పా...