Showing posts with label త్యాగరాజ కీర్తనలు. Show all posts
Showing posts with label త్యాగరాజ కీర్తనలు. Show all posts

Thursday, January 3, 2008

త్యాగరాజ కీర్తనలు


అనురాగము లేని...

రాగం : సరస్వతి
తాళం : రూపకం

ప: అనురాగము లేని మనసున సుజ్ఞానము రాదు

అ.ప: ఘనులైన యంతర్జ్ఞానుల కెఱుకయే గాని

చ1: వగవగగా భుజియించే వారికి తృప్త్యగు రీతిసగుణ ధ్యానము పైని సౌఖ్యము త్యాగరాజనుత

Wednesday, December 19, 2007

శ్రీ రామ పాదమా





శ్రీ రామ పాదమా
రాగం: అమృతవాహిని
ఆ: స రి2 మ1 ప ద1 ని2 స
అవ: స ని2 ద1 మ1 గ2

పల్లవి : శ్రీ రామ పాదమా నీ కృప జాలునే
చిత్తమునకు రావే

అను.పల్లవి: వారిజభవ సనక సనందన వాసవ శ్రీనారదాదులెల్ల పూజించే

చరణం: దారిని శిలయై తాపము తాళక ధారగా కన్నీరును రాల్చగ
శూర అహల్యను జూచి బ్రోచిన రీతిధన్యు సేయవే త్యాగరాజ గేయమా

Tuesday, December 18, 2007

బ్రోవ భారమా...




బ్రోవ భారమా...



రాగం: బహుదారి
ఆ: స గ3 మ1 ప ద2 ని2 స
అవ: స ని2 ప మ1 గ3 స
తాళం: ఆది
పల్లవి :
బ్రోవ భారమా రఘురామా
భువనమెల్ల నీవై నన్నుకని


అనుపల్లవి : శ్రీ వాసుదేవ అండకోటుల కుక్షిని యుంచకోలేదా నన్ను - బ్రోవ
చరణం :
కలశాంబుధిలో దయతోన మరులకై ఆదికూర్మమై
గోపికలకై కొండ నెత్త లేదా కరుణాకర త్యాగరాజుని - బ్రోవ


గమగ,గగ,గమపమగమగసగమగ,గగ,నిసనిపమగస, గమగ,గగ,సనిపమగసనిసగమగ,గగ,సగసనిపమగపపమ గ,గగ,పమగ,గగ,నిపమ,మమ, సనిప,పప, గసని,నిని,మగస,సస,నినిససనిస,సపపనినిపని,ని మమపపమప,పగగమమగమ,మగసమమగసపపమగనినిపమససనిప గగసనిమమగసపపమగమమగసగగసనిససనిపనినిపమపమగస సనిపమగససగమపదనిస,గమపదనిస,మపదనిస,పదనిస, దనిస,నిస,సమ,,గ,మగసనిప,,గ,,స,గసనిపమ,,ప,మ,మగసగమ - బ్రోవ


చిట్ట స్వరం : పదనిసా సనిదని పదదని పమగస పమగమ గససని. సమగమ ప,,, మమగస సగమప దనిపద నిసగమ గస,స దనిప, పమగస ,సగమ

సీతమ్మ మాయమ్మ!

శ్రీ త్యాగరాజకీర్తన
వసంత రాగం
రూపక తాళం

పల్లవి :


సీతమ్మ మాయమ్మ! శ్రీ రాముడు మా తండ్రి!

అనుపల్లవి :
వాతాత్మజ, సౌమిత్రి, వైనతేయ, రిపు మర్దన, ధాత, భరతాదులు సోదరులు మాకు! ఓ మనసా! (సీతమ్మ)
చరణం :
పరమేశ, వసిష్ఠ, పరాశర, నారద, శౌనక, శుక, సుర పతి, గౌతమ, లంబోదర, గుహ, సనకాదులు

ధర నిజ భాగవతాగ్రేసరులెవరో, వారెల్లను, వర త్యాగరాజునికి పరమ బాంధవులు. మనసా!! (సీతమ్మ)