Showing posts with label S.జానకి. Show all posts
Showing posts with label S.జానకి. Show all posts

Thursday, April 16, 2015

ఆరాధన

అరె ఏమైందీ….

గానం :బాలు, జానకి
సంగీతం : ఇళయ రాజా


పల్లవి :
అరె ఏమైందీ….ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరిందీ
అది ఏమైందీతన మనిషిని వెదుకుచు ఇక్కడొచ్చి వాలిందీ
కలగాని కలయేదొ కళ్ళెదుటే నిలిచిందీ
అది నీలొ మమతను నిద్దురలేపింది
అరె ఏమైందీ…..ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరిందీ
అది ఏమైందీ….

చరణం :
నింగివంగి నేలతోటీ నేస్తమేదో కోరిందీ
నేల పొంగి నింగికోసం పూలదోసిలిచ్చింది
పూలు నేను చూ..డలేదూ పూజలేవి చే..యలేదు
నేలపైన కాళ్ళులేవు నింగి వైపు చూపులేదు
కన్నెపిల్ల కళ్ళలోకి ఎన్నడైన చూశావో
కానరాని గుండెలోకి కన్నమేసి వచ్చావో
అది దోచావో…..లలలలా..లలల...లలలల

చరణం :
బీడూలోన వాన చినుకు పిచ్చిమొలక వేసింది
పాడలేని గొంతులోన పాటా ఏదొ పలికింది
గుండె ఒక్కటున్న చాలు గొంతు తానె పాడగలదు
మాటలన్ని దాచుకుంటే పాట నీవు వ్రాయగలవు
రాతరాని వాడి రాత దేవుడేమి వ్రాసాడో
చేతనైతె మార్చి చూడూ వీడు మారిపోతాడు
మనిషౌతాడు
అరె ఏమైందీ….ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరిందీ
అది ఏమైందీతన మనిషిని వెదుకుచు ఇక్కడొచ్చి వాలిందీ

Tuesday, April 22, 2008

స్వాతిముత్యం

మనసు పలికే మౌన గీతం...
గానం : జానకి,బాలసుబ్రమణ్యం
రచన : వేటూరి

పల్లవి :మనసు పలికే...మనసు పలికే
మౌన గీతం...మౌన గీతం
మనసు పలికే మౌన గీతం నీవే...
మమతలోలికే... మమతలోలికే
స్వాతిముత్యం...స్వాతిముత్యం...
మమతలోలికే స్వాతిముత్యం నీవే
అణువు అణువు ప్రణయ మధువు
అణువు అణువు ప్రణయ మధువు
తనువు సుమధనువు ఊ ఊ
మనసు పలికే మౌన గీతం నీవే...
మమతలోలికే స్వాతిముత్యం నీవే
చరణం : శిరసు పై నే గంగనై మరుల జలక లాడనీ
మరుల జలకాలాడనీ ఆ...
పదము నే నీగిరిజనై
పగలు రేయి వోదగనీ
పగలు రేయి వోదగనీ
హృదయ వేదనలో మధుర లానలలో
హృదయ వేదనలో మధుర లానలలో
వెలిగి పోని... రాగ దీపం...
వెలిగి పోని రాగ దీపం వేయి జన్మలు గా

మనసు పలికే మౌన గీతం నీవే...
మమతలోలికే స్వాతిముత్యం నీవే
చరణం :కాన రాని ప్రేమకే ఓనమాలు దిద్దనీ
ఓనమాలు దిద్దనీ ఆ...
పెదవి పై నీ ముద్దునై మోదటి తీపి అద్దనా
మొదటి తీపి....
లలితయామినివో కలల కౌముదివో
లలితయామినివో కలల కౌముదివో
కరిగిపోని కాలమంతా
కరిగిపోని కాల మంతా కౌగిలింతలుగా

మనసు పలికే మౌన గీతం నీవే...
మమతలోలికే స్వాతిముత్యం నీవే

Saturday, April 19, 2008

సాగర సంగమం

మౌనమేల నోయీ...
గానం: S.P.బాలసుబ్రమణ్యం, S.జానకి
సంగీతం: ఇళయరాజా
రచన : వేటూరి

పల్లవి : మౌనమేల నోయీ ఈ మరపు రాని రేయి
మౌనమేల నోయి ఈ మరపు రాని రేయి
ఎదలో వెన్నెలా వెలిగే కన్నులా
ఎదలో వెన్నెలా వెలిగే కన్నులా
తారాడే హాయిలో.....హా....
ఇంత మౌనమేల నోయి ఈ మరపు రాని రేయి

చరణం : పలికే పెదవీ వణికింది ఎందుకో
వణికే పెదవీ వెనకాల ఏమిటొ
కలిసే మనసులా,విరిసే వయసులా
కలిసే మనసులా,విరిసే వయసులా

నీలి నీలి ఊసులూ లేత గాలి బాసలూ
ఏమేమో అడిగినా
మౌన మేల నోయి ఈ మరపు రాని రేయి

చరణం : హిమమే కురిసే చందమామ కౌగిటా
సుమమే విరిసే వెన్నెలమ్మ వాకిటా
ఇవి ఏడడుగులా వలపూ మడుగులా
ఇవి ఏడడుగులా వలపూ మడుగులా

కన్నె ఈడు ఉలుకులూ కంటి పాప కబురులూ
ఎంతెంతో తెలిసినా

మౌన మేల నోయి ఈ మరపు రాని రేయి
ఇంత మౌనమేల నోయి ఈ మరపు రాని రేయి
ఎదలో వెన్నెలా వెలిగే కన్నులా
ఎదలో వెన్నెలా వెలిగే కన్నులా
తారాడే హాయిలో
ఇంత మౌనమేల నోయి ఈ మరపు రాని రేయి

Friday, April 11, 2008

సప్తపది

గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన
గానం : S.P.బాలసుబ్రమణ్యం,S.జానకి
పల్లవి : గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన
గోధూళి ఎర్రన ఎందువలనా

చరణం : తెల్లావు కడుపులో కర్రావులుండవా...
కర్రావు కదుపునా ఎర్రావు పుట్టదా...
గోపయ్య ఆడున్నా గోపెమ్మ ఈడున్నా
గోధూళి కుంకుమై గోపెమ్మకంటదా
ఆ పొద్దు పొడిచేనా...
ఈ పొద్దు గడిచేనా...ఆ..ఆ..
ఎందువలనా అంటే అందువలనా...
అందువలనా అంటే దైవ ఘటనా..

గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన
గోధూళి ఎర్రన ఎందువలనా

చరణం : పిల్లన గోవికి నిలువెల్ల గాయాలు...పాపం...
అల్లన మోవికి తాకితే గేయాలు..ఆ..ఆ..ఆ..
పిల్లన గోవికి నిలువెల్ల గాయాలు
అల్లన మోవికి తాకితే గేయాలు
ఆ మురళి మూగైనా ఆ పెదవి మోడైనా
ఆ గుందె గొంతులో ఈ పాట నిండదా
ఈ తడిని చూసేనా..ఆ.ఆ..
ఆకలిని చూసేనా..ఆ..ఆ
ఎందువలనా అంటే అందువలనా...
అందువలనా అంటే దైవ ఘటనా..

గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన
గోధూళి ఎర్రన ఎందువలనా

Thursday, March 27, 2008

పదహారేళ్ళ వయసు

సంగీతం : చక్రవర్తి
సాహిత్యం : వేటూరి
గానం : S.జానకి

పల్లవి : సిరిమల్లె పువ్వా
సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా...చిన్నారి చిలకమ్మా
నా వాడు ఎవరే నా తోడు ఎవరే...ఎన్నాళ్ళకొస్తాడే
సిరిమల్లె పువ్వా...

చరణం : తెల్లారబోతుంటీ నా కల్లోకి వస్తాడే
కళ్ళరా చూదామంటే నా కళ్ళు మూస్తాడే
ఆ అందగాడు నా ఈడు జోడు ఏడే
ఈ సందె కాడ నా చందమామ రాడే
చుక్కల్లారా దిక్కులుదాటి వాడెన్నాళ్ళకొస్తాడో

సిరిమల్లె పువ్వా...
సిరిమల్లె పువ్వా... సిరిమల్లె పువ్వా...చిన్నారి చిలకమ్మ
నా వాడు ఎవరే నా తోడు ఎవరే..ఎన్నాళ్ళకొస్తాడే

చరణం : కొండల్లో కోనల్లో కూ యన్న ఓ కోయిలా
ఈ పూల వానల్లో ఝుమ్మన్న ఓ తుమ్మెదా
వయసంతా వలపై మనసే మైమరపై ఊగేనే
పగలంతా దిగులు రేయంతా వగలు రేగేనే
చుక్కల్లారా దిక్కులుదాటి వాడెన్నాళ్ళకొస్తాడో...

సిరిమల్లె పువ్వా...
సిరిమల్లె పువ్వా... సిరిమల్లె పువ్వా...చిన్నారి చిలకమ్మ
నా వాడు ఎవరే నా తోడు ఎవరే..ఎన్నాళ్ళకొస్తాడే

Tuesday, January 22, 2008

శ్రీవారికి ప్రేమలేఖ

మనసా తుళ్ళి పడకే...
గానం : ఎస్.జానకి
సంగీతం : రమేష్ నాయుడు
రచన : వేటూరి


పల్లవి : మనసా తుళ్ళి పడకే అతిగా ఆశ పడకే
అతనికి నీవూ నచ్చావొ లేదో
ఆ శుభ ఘడియా వచ్చేనొ రాదో
తొందర పడితే అలుసే మనసా తెలుసా...

మనసా తుళ్ళి పడకేఅతిగా ఆశ పడకే

చరణం : ఏమంత అందాలు కలవనీ...
వస్తాడు నిన్ను వలచీ
ఏమంత సిరి వుంది నీకనీ.. మురిసేను నిన్ను తలచీ
చదువా పదవా ఏముంది నీకు
తళుకూ కులుకూ ఏదమ్మ నీకు
శృతి మించకే నీవు మనసా...


మనసా తుళ్ళి పడకేఅతిగా ఆశ పడకే
అతనికి నీవూ నచ్చావొ లేదో
ఆ శుభ ఘడియా వచ్చేనొ రాదో
తొందర పడితే అలుసే మనసా తెలుసా
మనసా తుళ్ళి పడకేఅతిగా ఆశ పడకే


చరణం : ఏనోము నోచావు నీవనీ....
దొరికేను ఆ ప్రేమ ఫలమూ
ఏ దేవుడిస్తాడు నీకనీ.. అరుదైన అంత వరమూ
మనసా వినవే మహ అందగాడు
తనుగా జతగా మనకంది రాడు
కలలాపవే కన్నె మనసా


మనసా తుళ్ళి పడకేఅతిగా ఆశ పడకే
అతనికి నీవూ నచ్చావొ లేదో
ఆ శుభ ఘడియా వచ్చేనొ రాదో
తొందర పడితే అలుసే మనసా తెలుసా
మనసా తుళ్ళి పడకేఅతిగా ఆశ పడకే........

శ్రీవారికి ప్రేమలేఖ

తొలిసారి మిమ్మల్ని...
గానం : ఎస్.జానకి
సంగీతం : రమేష్ నాయుడు
రచన : వేటూరి

శ్రీమన్ మహారాజ మార్తాండ తేజా
త్రియానంద భోజామీ శ్రీచరణాంభోజములకు
ప్రేమతో నమస్కరించి.. మిము వరించి....
మీ గురించిఎన్నో కలలు గన్న కన్నె బంగారు భయముతో.....
భక్తితో.. అనురక్తితోసాయంగల విన్నపములూ....
సంధ్యారాగం చంద్రహారతి పడుతున్న వేళ

మసక చీకటి మధ్యమావతి పాడుతున్న వేళ
ఓ శుభ ముహూర్తాన....
తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు
కదిలాయి మదిలోన ఎన్నెన్నో కధలూ.....ఎన్నెన్నో కధలూ
జో అచ్యుతానంద జో జో ముకుందా
లాలి పరమానంద రామ గోవిందా జో జో....
నిదుర పోని కనుపాపలకు జోల పాడలేక
ఈల వేసి చంపుతున్న ఈడునాపలేక
ఇన్నాళ్ళకు రాస్తున్నా ......ప్రేమ లేఖ

తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు
కదిలాయి మదిలోన ఎన్నెన్నో కధలూ.. ఎన్నెన్నో కధలూ


ఏ తల్లి కుమారులో తెలియదు గాని
ఎంతటి సుకుమారులో తెలుసు నాకూ
ఎంతటి మగధీరులో తెలియలేదు గాని
నా మనసును దోచిన చోరులు మీరూ
వలచి వచ్చిన వనితను చులకన చేయక
తప్పులుంటె మన్నించి ఒప్పులుగా భావించీ
చప్పున బదులివ్వండీ.. చప్పున బదులివ్వండి

తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు
కదిలాయి మదిలోన ఎన్నెన్నో కధలూ.. ఎన్నెన్నో కధలూ
తలలోన తురుముకున్న తుంటరి మల్లే
తలపులలో ఎన్నెన్నో మంటలు రేపే....
ఆ అబ్బా...సూర్యుడి చుట్టూ తిరిగే భూమికి మల్లే
నా ఊర్పుల నిట్టూర్పుకు జాబిలి వాడే..
ఆ ఆ..మీ జతనే కోరుకుని లతలాగా అల్లుకునే
నాకు మీరు మనసిస్తే ఇచ్చినట్టు మాటిస్తే
ఇప్పుడే బదులివ్వండీ.. ఇప్పుడే బదులివ్వండి

తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు
కదిలాయి మదిలోన ఎన్నెన్నో కధలూ.. ఎన్నెన్నో కధలూ

Thursday, December 27, 2007

నిరీక్షణ

ఆకాశం ఏనాటిదో...
సంగీతం : ఇళయరాజా
గానం : యస్.జానకి

పల్లవి : ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది
ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది
ఆవేశం ఏనాడు కలిగెనో ఆనాడే తెలిసిందది
ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది (ఆకాశం ఏనాటిదో) అనురాగం ఆనాటిదీ
చరణం : ఏ పువ్వూ ఏ తేటిదన్నది ఏనాడో రాసున్నదీ
ఏ ముద్దూ ఏ మోవిదన్నది ఏ పొద్దో రాసున్నదీ
బంధాలై పెనవేయు వయసుకు అందాలే దాసోహమనగా
మందారం విరబూయు పెదవులు మధువులనే చవిచూడమనగా
పరువాలే..ప్రణయాలై.. స్వప్నాలే...స్వర్గాలై...
ఎన్నెన్నో శృంగార లీలలు కన్నుల్లో రంగేళి అలవెను

ఆవేశం ఏనాడు కలిగెనో ఆనాడే తెలిసిందదిఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది
చరణం : ఏ మేఘం ఏ వాన చినుకై చిగురాకై మొలకెత్తెనో
ఏ రాగం ఏ గుండెలోతున ఏ గీతం పలికించెనో
హృదయాలే తెరతీసి తనువుల కలబోసీ మరపించమనగ
కౌగిలిలో చెరవేచు మదనుని కరిగించీ గెలిపించమనగ
మోహాలే.. దాహాలై....సరసాలే.. సరదాలై
కలాన్నే నిలవేసి కలలకు ఇవ్వాలీ వెలలేని విలువలు

ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది
ఆవేశం ఏనాడు కలిగెనో ఆనాడే తెలిసిందది

Tuesday, December 18, 2007

సప్తపది

సప్తపది

గానం : జానకి

సంగీతం:కె.వి.మహదేవన్



రేపల్లియ ఎద ఝల్లున పొంగిన రవళి

నవరస మురళి ఆ నందన మురళిఇదేనా ఇదేనా ఆ మురళి

మొహనమురళిఇదేనా ఆ మురళిరేపల్లియ



కాళింది మడుగున కాళియుని పడగల

ఆబాల గోపాల మాబాల గోపాలుని - 2

అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నులజూడ - 2

తాండవమాడిన సరళి గుండెల మ్రోగిన మురళిఇదేనా.... ఇదేనా ఆ మురళి (రేపల్లియ)

అనగల రాగమై తొలుత వీనులలరించిఅనలేని రాగమై మరల వినిపించి మరులే కురిపించి

జీవన రాగమై బృందావన గీతమయి -2

కన్నుల కన్నుల కలువల వెన్నెల దోచిన మురళిఇదేనా

ఇదేనా.... ఆ మురళి



వేణుగానలోలుని మురిపించిన రవళి నటనల సరళి ఆ నందనమురళి

ఇదేనా ఆ మురలి మువ్వల మురళి ఇదేనా ఆ మురలి

మధురానగరిలో యమునా లహరిలోఆ రాధ ఆరాధనా గీతి పలికించి - 2

సంగీత నాట్యాల సంగమ సుఖ వేణువై..ఆ

రాసలీలకే ఊపిరిపోసిన అందెల రవళిఇదేనా..ఇదేనా ఆ మురళి

(రేపల్లియ)

సితార

సితార
గానం : ఎస్.జానకి
సంగీతం:ఇళయరాజా

పల్లవి : వెన్నెల్లో గోదారి అందం నది కన్నుల్లో కన్నీటి దీపం -2(వెన్నెల్లో గోదారి)
అది నిరుపేద నా గుండెలో
చలి నిట్టూర్పు సుడిగుండమై
నాలో సాగే మౌనగీతం (వెన్నెల్లో గోదారి )

చరణం : జీవిత వాహిని అలలై ... జీవిత వాహిని అలలై
ఊహకు ఊపిరి వలలై బంధనమై జీవితమే నిన్నటి చీకటి గదిలో..ఎడబాటే..
ఒక పాటై పూలదీవిలో సుమవీణ మోగునా(వెన్నెల్లో గోదారి)

నిన్నటి శర పంజరాలు దాటిన స్వరపంజరాన నిలచి..
కన్నీరే పొంగి పొంగి తెరల చాటు నాచూపులు చూడలేని మంచు బొమ్మనై..
యవ్వనాలు అదిమి అదిమి పువ్వులన్ని చిదిమి చిదిమి
వెన్నెలంత ఏటిపాలు చేసుకుంటినే..
నాకు లేదు మమకారం.. మనసు మీద అధికారం .. - 2
ఆశలు మాసిన వేసవిలో... ఆవేదనలో రేగిన ఆలాపన సాగే ..
మదిలో కలలే నదిలో వెల్లువలై పొంగారే మనసు వయసు కరిగే
మధించిన సరాగమే కలతను రేపిన వలపుల వడిలో ..తిరిగే.. సుడులై ..
ఎగసే ముగిసే కదనేనా .. ఎగసే ముగిసే కదనేనా..