Thursday, April 16, 2015

ఓయ్...

సంగితం : యువన్ శంకర్ రాజా
రచన : వనమాలి
గానం : యువన్ శంకర్ రాజా


నన్నొదిలి నీడ వెళ్ళిపొతోందా...... కన్నొదిలీ చూపు వెళ్ళిపోతోందా
వేకువనే సందె వాలి పోతోందే చీకటిలో ఉదయముండిపోయిందే
నా ఎదనే తొలిచిన గురతుగా నిను తెస్తుందా
నీ జతలో గడిపిన బ్రతుకిక బలి అవుతుందా
నువ్వుంటే నేనుంటా ప్రేమా.......పోవొద్దే పోవొద్దే ప్రేమా
నన్నొదిలీ నీడ వెళ్ళిపొతోందా.......కన్నొదిలీ చూపు వెళ్ళిపోతోందా..


ఇన్ని నాళ్ళు నీ వెంటే సాగుతున్న నా పాదం..వెంట పడిన అడుగేదంటోందే ఓ ఓ ఓ
నిన్నదాక నీ రూపం నింపుకున్న కనుపాపే నువ్వు లేక నను నిలదీస్తోందే
కోరుకున్న జీవితమే చేరువైన ఈ క్షణమే......జాలి లేని విధిరాతే శాపమైనదే
మరుజన్మే ఉన్నదంటే బ్రహ్మనైనా అడిగేదొకటే.. కనమంటా మమ్ము తన ఆటలిక సాగని చోటే
నువ్వుంటే నేనుంటా ప్రేమా......పోవొద్దే పోవొద్దే ప్రేమా

నువ్వుంటే నేనుంటా ప్రేమా......పోవొద్దే పోవొద్దే ప్రేమా

Mr.ఎర్ర బాబు

గానం : కె కె
సంగీతం : కోటి
రచన : వెన్నెలకంటి


ఎందుకో ఏమో తొలిసారీ,కలిసింది స్నేహం ,తెలిసింది దాహం ....
అందుకేనేమో ప్రతిసారీ,తొణికింది ప్రాణం,పలికింది గానం...
నిద్దర్లో నీరూపమే నిలిచె నా కళ్ళలో,పొద్దంతా నీధ్యానమే ప్రియా ప్రియా ప్రియా
ఇన్నాళ్ళూ ఈ అల్లరీ లేదులే ముందరా,ఈనాడే సరికొత్తగా ఫలించె నీలయా..

ఎందుకో ఏమో తొలిసారీ,కలిసింది స్నేహం ,తెలిసింది దాహం ....

నిదురైనా రానే రాదు,కుదురైనా లేనే లేదు,ఇది ఏమి ఆరాటమో...
ఇది చెలిగీతమో,చెలి సంగీతమో,తొలి మురిపాల జలపాతమో...

కలవక కలిసిన కవ్వింత,తెలపక తెలిపిన గిలిగింత..
చిలిపిగ వయసున చిగురులు తొడిగెను ప్రేమా ...

నిద్దర్లో నీరూపమే నిలిచె నా కళ్ళలో,పొద్దంతా నీధ్యానమే ప్రియా ప్రియా ప్రియా
ఇన్నాళ్ళూ ఈ అల్లరీ లేదులే ముందరా,ఈనాడే సరికొత్తగా ఫలించె నీలయా..

నాపేరే అడుగుతు ఉంటే,నీ పేరే చెబుతూ ఉన్నా...మతిబోయె నాకెందుకో
ఇది ఆరాటమో,ఎద మోమాటమో,నను ఉడికించు ఉబలాటమో...

తెలిసెను తెలిసెను ఇది ప్రేమా,కలసిన మనసుల కధ ప్రేమా...
ఇదివరకెరుగని హౄదయపు సరిగమ ప్రేమా ...

నిద్దర్లో నీరూపమే నిలిచె నా కళ్ళలో,పొద్దంతా నీధ్యానమే ప్రియా ప్రియా ప్రియా
ఇన్నాళ్ళూ ఈ అల్లరీ లేదులే ముందరా,ఈనాడే సరికొత్తగా ఫలించె నీలయా..

ఆరాధన

అరె ఏమైందీ….

గానం :బాలు, జానకి
సంగీతం : ఇళయ రాజా


పల్లవి :
అరె ఏమైందీ….ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరిందీ
అది ఏమైందీతన మనిషిని వెదుకుచు ఇక్కడొచ్చి వాలిందీ
కలగాని కలయేదొ కళ్ళెదుటే నిలిచిందీ
అది నీలొ మమతను నిద్దురలేపింది
అరె ఏమైందీ…..ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరిందీ
అది ఏమైందీ….

చరణం :
నింగివంగి నేలతోటీ నేస్తమేదో కోరిందీ
నేల పొంగి నింగికోసం పూలదోసిలిచ్చింది
పూలు నేను చూ..డలేదూ పూజలేవి చే..యలేదు
నేలపైన కాళ్ళులేవు నింగి వైపు చూపులేదు
కన్నెపిల్ల కళ్ళలోకి ఎన్నడైన చూశావో
కానరాని గుండెలోకి కన్నమేసి వచ్చావో
అది దోచావో…..లలలలా..లలల...లలలల

చరణం :
బీడూలోన వాన చినుకు పిచ్చిమొలక వేసింది
పాడలేని గొంతులోన పాటా ఏదొ పలికింది
గుండె ఒక్కటున్న చాలు గొంతు తానె పాడగలదు
మాటలన్ని దాచుకుంటే పాట నీవు వ్రాయగలవు
రాతరాని వాడి రాత దేవుడేమి వ్రాసాడో
చేతనైతె మార్చి చూడూ వీడు మారిపోతాడు
మనిషౌతాడు
అరె ఏమైందీ….ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరిందీ
అది ఏమైందీతన మనిషిని వెదుకుచు ఇక్కడొచ్చి వాలిందీ

Thursday, July 3, 2014

ష్...గప్ చుప్

తెలుగందాలే ...

నాకు నచ్చిన వేటూరి గారి పాటల్లో ఇదీ ఒకటి.
అచ్చమైన తెలుగు పాటకు ఇప్పటికీ ఎప్పటికీ చిరునామా వేటూరి పాటే...

రచన : వేటూరి
గానం : బాలుచిత్ర
సంగీతం : రాజ్,కోటి

పల్లవి : 
తెలుగందాలే నన్ను తొంగి తొంగి చూసెనమ్మ తొలకరిగా
మకరందాలే మది పొంగి పొంగి పోయెనమ్మ తుంటరిగా
అమ్మడి సిగ్గులే గుమ్మడి పువ్వులై
పిల్లడి పల్లవే పచ్చని వెల్లువై
సాగపా దాపపా దాససా రీసదా
సాగపా దాపపా దాససా రీసదా
కాటుకాకళ్ళలో కన్నె వాకిళ్ళలో

చరణం :
తిక్కనలో తీయదనం లిపి చక్కని నీ కన్నెతనం
పోతనలో రామరసంవడబోసెను నీ ప్రేమరసం
ప్రాయానికే వేదంనవపద్మావతీపాదం
రాగానికే అందం రసగీతగోవిందం
వంశధర ఒడిలో హర్షవల్లికా
సూర్యకాంత వీణారాగదీపిక

సాగపా దాపపా దాససా రీసదా
సాగపా దాపపా దాససా రీసదా
కాటుకాకళ్ళలో కన్నె వాకిళ్ళలో
తెలుగందాలే నన్ను తొంగి తొంగి చూసెనమ్మ తొలకరిగా
మకరందాలే మది పొంగి పొంగి పోయెనమ్మ తుంటరిగా


చరణం :
క్షేత్రయలో జాణతనంవరదయ్యెనులే వలపుతనం
అందని నీ ఆడతనంఅమరావతిలో శిల్పధనం
ఏడుగ చీలిందిలే నది గౌతమి గోదావరి
ఏకం కావాలిలే ఏడుజన్మలబంధాలివి
కృష్ణవేణి జడలో శైలమల్లిక
శివుని ఆలయాన భ్రమరదీపిక

సాగపా దాపపా దాససా రీసదా
సాగపా దాపపా దాససా రీసదా
కాటుకాకళ్ళలో కన్నె వాకిళ్ళలో
తెలుగందాలే నన్ను తొంగి తొంగి చూసెనమ్మ తొలకరిగా
మకరందాలే మది పొంగి పొంగి పోయెనమ్మ తుంటరిగా





Wednesday, April 27, 2011

ఒకరికి ఒకరు





False వాయిస్ తో పాడినా కీరవాణి గారి వాయిస్ చాలా బాగా సూట్ అయింది ఈ పాట కు.

గానం & సంగీతం : కీరవాణి

వెళ్ళిపోతె ఎలా మనసా ఎటో అలా,ఇనా ఎందుకె ఇలా తడబాటు అంతలా
తెగ హుషారుగా ఎగిరిపోకే,తగని ఊహ వెంట
సరైన దారి తెలియందే,ఈ ఉరుకులెందుకంట
వెళ్ళిపోతే ఎలా వెళ్ళిపోతే ఎలా

ఆమె వలలో చిక్కుకున్న సమయం
ప్రేమ లయలో దూకుతోందా హృదయం
నేను ఇపుడెక్కడున్నానంటే,నాక్కూడ అంతు చిక్కకుంటే
గమ్మత్తుగానే ఉన్నదంటే,నాకేదో మత్తు కమ్మినట్టే
రమ్మంది కాని నన్ను చేరి మెరుపు సైగ చేసి
చెప్పింది నింగి చెలి దారి చినుకు వంతెనేసి

వెళ్ళనంటే ఎలా మనసా అటే అలా
వెళ్ళనంటే ఎలా ఎలా హే హే....

తాను కూడ రాకపొతే నాతో,నేను కూడా ఆగిపొనా తనతొ
నా ప్రాణం ఉంది తన వెంటే,నా ఊపిరుంది తననంటే
కళ్ళార చూసానంటు వుంటే,ఎల్లా నమ్మేదీ స్వప్నమంటే
వెనక్కి వెళ్ళి వెతకాలి తిరిగి ఆ క్షణాన్ని
మరొక్కసారి చూడాలి కనులు ఆ నిజాన్ని

వెళ్ళనంటే ఎలా మనసా అటే అలా
వెళ్ళనంటే ఎలా ఎలా హే హే....

Friday, April 15, 2011

సిద్ధు From సికాకుళం

Short Duration Song అయినా Instrument Using చాలా Perfect గా ఉంటుంది...

సంగీతం: K.M.రాధాకృష్ణన్
రచన: పెద్దాడ మూర్తి
గానం: గాయత్రి

తెల్లారి పోనీకూ ఈ రేయినీ,చేజారి పోనీకూ ఈ హాయినీ
మనసు కనక,మనవి వినక,చెలికి మరి దూరాన ఉంటే ఎలా ....
తెల్లారి పోనీకూ ఈ రేయినీ,చేజారి పోనీకూ ఈ హాయినీ

ఆ నింగి జాబిలమ్మ తోడుగానె ఉందిగా
చుక్కే నీదంటు ,పక్కే రమ్మంటు,చూస్తావేంటలా

తెల్లారి పోనీకూ ఈ రేయినీ,చేజారి పోనీకూ ఈ హాయినీ

ఏ మంత లేనిదాన్ని కానిదాన్ని కాదుగా
ఏలా ఛీ పో లు ,పైపై కోపాలు ,నాపై నీకిలా

తెల్లారి పోనీకూ ఈ రేయినీ,చేజారి పోనీకూ ఈ హాయినీ
మనసు కనక,మనవి వినక,చెలికి మరి దూరాన ఉంటే ఎలా ....
తెల్లారి పోనీకూ ఈ రేయినీ,చేజారి పోనీకూ ఈ హాయినీ

Wednesday, April 6, 2011

అస్త్రం

ప్రేమ కన్న ఏముంది ప్రియం, ప్రియా ప్రేమించు క్షణం...

రచన : వేటూరి
సంగీతం :S.A.రాజ్ కుమార్
గానం : రాజేష్

ప్రేమ కన్న ఏముంది ప్రియం ప్రియా ప్రేమించు క్షణం
ప్రేమకున్న ప్రాణాలు మనం ప్రియా కానివ్వు సగం
ఎదే పెట్టే సొదే ఓ ఆపదై వేధించగా
అదే పొంగే సుధై ఏ దేవతో దీవించగా
This is my love... This is my love...
ఇదో కథలే,ఇదో జతలే...
ప్రేమ కన్న ఏముంది ప్రియం ప్రియా ప్రేమించు క్షణం
ప్రేమకున్న ప్రాణాలు మనం ప్రియా కానివ్వు సగం

కలవరమొక వరమనుకో కలలను కంటూ
ప్రతి నిమిషము నీదనుకో జతపడి ఉంటూ
నింగి నేలకి స్నేహం ఎప్పుడైనది,
అప్పుడే కదా ప్రేమా చప్పుడైనది
వలపే సోకని నాడు, ఎడారే గుండె చూడు
ముళ్ళని చూడకు, నేడు గులాబి పూలకు
This is my love...This is my love
ఇదే కథలే... ఇలా మొదలే...

ప్రేమ కన్న ఏముంది ప్రియం ప్రియా ప్రేమించు క్షణం
ప్రేమకున్న ప్రాణాలు మనం ప్రియా కానివ్వు సగం

నిదురెరగని తనువులతో నిలువని పరుగు
మధువుల తడి పెదవులతో పిలువని పిలుపు
మండుటెండలా తాకే పండు వెన్నెల
కొండ వాగులా మారే ఎండమావిలా
కనులే మూయను నేను, జపిస్తూ ప్రేమ రూపం
కవితే రాయను నేను, లిఖిస్తా నీ స్వరూపం
This is my love...This is my love...
ప్రతి ఎదలో ఇదో కథలే
ప్రేమ కన్న ఏముంది ప్రియం ప్రియా ప్రేమించు క్షణం
ప్రేమకున్న ప్రాణాలు మనం ప్రియా కానివ్వు సగం
ఎదే పెట్టే సొదే ఓ ఆపదై వేధించగా
అదే పొంగే సుధై ఏ దేవతో దీవించగా
This is my love... This is my love...
ఇదో కథలే,ఇదో జతలే...

Saturday, March 19, 2011

భద్ర


ఓ మనసా ఓ మనసా చెబితే వినవా నువ్వు

సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్
గానం : రవి వర్మ
రచన : సిరివెన్నెల సీతారామశాస్త్రి,

ఓ మనసా ఓ మనసా చెబితే వినవా నువ్వు
నీ మమతే మాయ కదా నిజమే కనవా నువ్వు
చెలియా గుండె తాకలేక పలకనందే నా మౌనం
చెలిమి వెంట సాగలేక శిల అయిందే నా ప్రాణం
గతమే మరిచి బ్రతకాలే మనసా
ఓ మనసా ఓ మనసా చెబితే వినవా నువ్వు
నీ మమతే మాయ కదా నిజమే కనవా నువ్వు

ఎగసి పడే అల కోసం దిగి వస్తుందా ఆకాశం
తపనపడి ఏం లాభం అందని జాబిలి జత కోసం
కలిసి ఉన్న కొంతకాలం వెనక జన్మ వరమనుకో
కలిసి రాని ప్రేమ తీరం తీరిపోయిన రుణమనుకో
మిగిలే స్మృతులే వరమనుకో మనసా మనసా
ఓ మనసా ఓ మనసా చెబితే వినవా నువ్వు
నీ మమతే మాయ కదా నిజమే కనవా నువ్వు

తన ఒడిలో పొదువుకుని భద్రంగా నడిపే నౌక
తననొదిలి వెళ్ళకని ఏ బంధాన్ని కోరదుగా
కడలిలోనే ఆగుతుందా కదలనంటు ఈ పయనం
వెలుగువైపు చూడనందా నిదరలేచే నా నయనం
కరిగే కలలే తరిమే మనసా మనసా
ఓ మనసా ఓ మనసా చెబితే వినవా నువ్వు
నీ మమతే మాయ కదా నిజమే కనవా నువ్వు

Thursday, March 17, 2011

శశిరేఖా పరిణయం

ఏదో వప్పుకోనంది నా ప్రాణం

సంగీతం: విద్యాసాగర్,మణి శర్మ
రచన : సిరివెన్నెల
గానం: సైంధవి

ఏదో ….వప్పుకోనంది నా ప్రాణం
అది ఏదో .... చెప్పనంటోంది నా మౌనం

ఉబికి వస్తుంటే సంతోషం, అదిమిపెడుతోందే ఉక్రోషం
తన వెనుక నేనూ, నా వెనుక తానూ
ఎంతవరకీ గాలి పయనం అడగదే ఉరికే ఈ వేగం

ఎదో ఎదో ఏదో వప్పుకోనంది నా ప్రాణం
అది ఏదో చెప్పనంటోంది నా మౌనం

ముల్లులా బుగ్గను చిదిమిందా ,మెల్లగా సిగ్గును కదిపిందా
వానలా మనసును తడిపిందా ,వీణలా తనువును తడిమిందా -2

చిలిపి కబురు ఏం విందో, వయసుకేమి తెలిసిందో-2
ఆదమరుపో , ఆటవిడుపో , కొద్దిగా నిలబడి చూద్దాం….ఓ క్షణం

అంటే …. కుదరదంటోంది నా ప్రాణం
కాదంటే …. ఎదురు తిరిగింది నా హృదయం
---------------------------------------------------------------

సంగీతం: విద్యాసాగర్,మణి శర్మ
రచన :అనంత శ్రీరాం
గానం: సైంధవి

ఏదో …. వప్పుకోనంది నా ప్రాణం
అది ఏదో ... చెప్పలేనంది ఏ వైనం
కలతపడుతుందే లోలోనా ,కసురుంటుందే నా పైనా
తన గుబులు నేనూ ,నా దిగులు తానూ
కొంచెమైనా పంచుకుంటే తీరిపోతుందేమో భారం

ఎదో ఎదో ఏదో వప్పుకోనంది నా ప్రాణం
అది ఏదో చెప్పలేనంది ఏ వైనం

పచ్చగా ఉన్నా పూదోటా , నచ్చడం లేదే ఈ పూటా
మెచ్చుకుంటున్నా ఊరంతా, గిచ్చినట్టుందే నన్నంతా -2

ఉండలేను నెమ్మదిగా ,ఎందుకంటే తెలియదుగా
ఉండలేను నెమ్మదిగా ,ఎందుకంటే తెలియదుగా
తప్పటడుగో ,తప్పు అనుకో
తప్పదే తప్పుకు పోదాం ….తక్షణం

అంటూ అడ్డుపడుతుంది ఆరాటం
పదమంటూ నెట్టుకెడుతోంది నను సైతం

Wednesday, March 16, 2011

కిక్

Sounds catchy...

సంగీతం :తమన్
రచన: సిరివెన్నెల
గానం : చిత్ర
ధీం తన నాహిరే ధీం ధీం తన నాహిరే - 4

అటు చూడొద్దన్నానా, మాటాడొద్దన్నానా
ఒద్దొద్దు అంటే విన్నావంటే మనసా
ఏం పర్వాలేదనుకున్నావేమో బహుశా

ఈ తలనొప్పేదైనా, నీ తప్పేం లేదన్నా
అయ్యయ్యో అంటారేమో గాని మనసా
పడవలసిందేగా నువిలా నానా హింస

ధీం తన నాహిరే ధీం ధీం తన నాహిరే-2
ప్రేమని కదిలించావే తోచి తొచని తొలి వయసా
ఎందుకు బదులిచ్చావే తెలిసి తెలియని పసి మనసా

అటు చూడొద్దన్నానా, మాటాడొద్దన్నానా
ఒద్దొద్దు అంటే విన్నావంటే మనసా
ఏం పర్వాలేదనుకున్నావేమో బహుశా

మునుపేనాడు,ఏ కుర్రాడు ,పడలేదంటే నీ వెనకాల
వందలు వేలు ,ఉండుంటారు, మతి చెడలేదే ఇలా వాళ్ళందరి వల్ల
ఎందుకివాళే ఇంత మంటెక్కిందో చెబుతావా
ఏం జరిగుంటుందంటే అడిగిన వాళ్ళని తిడతావా

అందరిలాగా వాణ్ణీ విధుల్లో వదిలేసావా
గుండెల గుమ్మం దాటి వస్తుంటే చూస్తున్నావా

అటు చూడొద్దు అన్నానా, మాటాడొద్దు అన్నానా
ఒద్దొద్దు అంటే విన్నావంటే మనసా
ఏం పర్వాలేదనుకున్నావేమో బహుశా

ఏ దారైనా,ఏ వేళైనా,ఎదురవుతుంటే నేరం తనదే
ఇంట్లో ఉన్నా ,నిదురోతున్నా, కనిపిస్తుంటే ఆ చిత్రం నీలో ఉందే
ఎవ్వరినని ఏం లాభం ఎందుకు ఎద లయ తప్పిందే
ఎక్కడ ఉందో లోపం నీతో వయసేం చెప్పిందే
అలకో ఉలుకో పాపం ఒప్పుకునేందుకు ఇబ్బందే
తనకే నాకే కోపం కన్నెగ పుట్టిన నా మీదే

ధీం తన నాహిరే ధీం ధీం తన నాహిరే-4