Monday, December 31, 2007

గోదావరి

మనసా వాచా....
గానం : చిత్ర, ఉన్నిక్రిష్ణన్
సంగీతం :K.M.రాధాక్రిష్ణన్

పల్లవి : మనసా వాచా నిన్నే వలచా..నిన్నే ప్రేమించా
నిన్నే తలచా..నన్నే మరిచా..నీకై జీవించా
ఆ..... ఆమాట దాచా..కాలాలు వేచా..నడిచా నే నీ నీడలా (మనసా వాచా)


చరణం : చిన్న తప్పు అని చిత్తగించమని అన్నా వినదు
అప్పుడెప్పుడో నిన్ను చూసి నీ వశమై మనసూ
కన్నీరైనా గౌతమి కన్నా....తెల్లారైనా పున్నమి కన్నా....
మూగైపోయా నేనిలా...(మనసా వాచా నిన్నే వలచా....)

చరణం : నిన్న నాదిగా..నేడు కాదుగా..అనిపిస్తున్నా
కన్ను చీకటై..కలలు వెన్నెలై..కాటేస్తున్నా
గతమేదైనా స్వాగతమననానీ జతలోనే బ్రతుకనుకోనా
రాముని కోసం సీతలా.....

మనసా వాచా నిన్నే వలచా..నిన్నే ప్రేమించా
నిన్నే తలచా..నన్నే మరిచా..నీకై జీవించా.....
ఆ.... ఆమాట దాచా.....కాలాలు వేచా....
నడిచా నే నీ నీడలా (మనసా వాచా)

నువ్వే నువ్వే

కాలేజ్ రాగింగ్లో రోజుకొక సీనియర్ దగ్గరైనా ఈ పాట పాడేదాన్ని....సో, నిద్రలో లేపి పాడమన్నా పాడేస్తాను.నా ఫేవరెట్ సింగర్ చిత్ర గారు,కాబట్టి ఇది కూడా నాబ్లాగులో చేరిపోయింది...


ఏ చోట ఉన్నా..నీ వెంట లేనా
గానం: చిత్ర
సంగీతం :కోటి

పల్లవి : ఏ చోట ఉన్నా..నీ వెంట లేనా
సముద్రమంతా నా కన్నుల్లో కన్నీటి అలలవుతుంటే
ఎడారి అంతా నా గుండెల్లో నిట్టూర్పు సెగలవుతుంటే
రేపు లేని చూపు నేనై శ్వాశ లేని ఆశ నేనై మిగలనా
నువ్వే నువ్వే కావాలంటుంది పదే పదే నా ప్రాణం
నిన్నే నిన్నే వెంటాడుతు ఉంది ప్రతీ క్షణం నా మౌనం (ఏ చోట ఉన్నా)

చరణం : నేల వైపు చూసే నేరం చేసావనీ
నీలి మబ్బు నిందిస్తుందా వాన చినుకునీ
గాలి వెంట వెళ్ళే మారం మానుకోమనీ
తల్లి తీగ బంధిస్తుందా మల్లె పువ్వునీ
ఏ మంత పాపం ప్రేమా ప్రేమించటం
ఇకనైనా చాలించమ్మా వేధించటం
చెలిమై కురిసే సిరివెన్నెలవా..క్షణమై కరిగే కలవా......

నువ్వే నువ్వే కావాలంటుంది పదే పదే నా ప్రాణం
నిన్నే నిన్నే వెంటాడుతు ఉంది ప్రతీ క్షణం నా మౌనం
రేపు లేని చూపు నేనై శ్వాశ లేనీ ఆశ నేనై మిగలనా

చరణం : వేలు పట్టి నడిపిస్తుంటే చంటి పాపలా
నా అడుగులు అడిగే తీరం చేరేదెలా
వేరెవరో చూపిస్తుంటే నా ప్రతి కలా
కంటి పాప కోరే స్వప్నం చూసేదెలా
నాక్కూడా చోటే లేని నా మనసులో
నిన్నుంచగలనా ప్రేమా ఈ జన్మలో
వెతికే మజిలీ దొరికే వరకూ నడిపే వెలుగై రావా......,
నువ్వే నువ్వే కావాలంటుంది పదే పదే నా ప్రాణం
నిన్నే నిన్నే వెంటాడుతు ఉంది ప్రతీ క్షణం నా మౌనం
ఏ చోట ఉన్నా...... నీ వెంట లేనా
సముద్రమంతా నా కన్నుల్లో కన్నీటి అలలవుతుంటే
ఎడారి అంతా నా గుండెల్లో నిట్టూర్పు సెగలవుతుంటే

Thursday, December 27, 2007

నిరీక్షణ

ఆకాశం ఏనాటిదో...
సంగీతం : ఇళయరాజా
గానం : యస్.జానకి

పల్లవి : ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది
ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది
ఆవేశం ఏనాడు కలిగెనో ఆనాడే తెలిసిందది
ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది (ఆకాశం ఏనాటిదో) అనురాగం ఆనాటిదీ
చరణం : ఏ పువ్వూ ఏ తేటిదన్నది ఏనాడో రాసున్నదీ
ఏ ముద్దూ ఏ మోవిదన్నది ఏ పొద్దో రాసున్నదీ
బంధాలై పెనవేయు వయసుకు అందాలే దాసోహమనగా
మందారం విరబూయు పెదవులు మధువులనే చవిచూడమనగా
పరువాలే..ప్రణయాలై.. స్వప్నాలే...స్వర్గాలై...
ఎన్నెన్నో శృంగార లీలలు కన్నుల్లో రంగేళి అలవెను

ఆవేశం ఏనాడు కలిగెనో ఆనాడే తెలిసిందదిఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది
చరణం : ఏ మేఘం ఏ వాన చినుకై చిగురాకై మొలకెత్తెనో
ఏ రాగం ఏ గుండెలోతున ఏ గీతం పలికించెనో
హృదయాలే తెరతీసి తనువుల కలబోసీ మరపించమనగ
కౌగిలిలో చెరవేచు మదనుని కరిగించీ గెలిపించమనగ
మోహాలే.. దాహాలై....సరసాలే.. సరదాలై
కలాన్నే నిలవేసి కలలకు ఇవ్వాలీ వెలలేని విలువలు

ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది
ఆవేశం ఏనాడు కలిగెనో ఆనాడే తెలిసిందది

మాతృదేవోభవ

వేణువై వచ్చాను...
గానం :చిత్ర
సంగీతం : కీరవాణి
రచన : సి.నా.రె

పల్లవి : వేణువై వచ్చాను భువనానికి గాలినైపోతాను గగనానికి
వేణువై వచ్చాను భువనానికి గాలినైపోతాను గగనానికి
మమతలన్నీ మౌనగానం వాంఛలన్నీ వాయులీనం
వేణువై వచ్చాను భువనానికి గాలినైపోతాను గగనానికి

చరణం : ఏడుకొండలకైనా అండ తానొక్కడే
ఏడు జన్మల తీపి ఈ బంధమే -2
నీ కంటిలో నలక లో వెలుగు నేననక
నేను నేననుకుంటే ఎద చీకటి హరీ హరీ.....హరీ
రాయినై ఉన్నాను ఏనాటికీ రామ పాదము రాక ఏనాటికీ..

వేణువై వచ్చాను భువనానికి గాలినైపోతాను గగనానికి

చరణం :నీరు కన్నీరాయే ఊపిరే బరువాయె
నీరు నిప్పుగ మారె నా గుండెలో
ఆ నింగిలో కలిసి నా శూన్యబంధాలు
పుట్టిల్లు చేరెను మట్టి ప్రణాలు హరీ హరీ హరీ
రెప్పనై ఉన్నాను నీ కంటికి పాపనై వస్తాను నీ ఇంటికి...
వేణువై వచ్చాను భువనానికి గాలినైపోతాను గగనానికి
వేణువై వచ్చాను భువనానికి గాలినైపోతాను గగనానికి

తోట రాముడు

ఓ బంగరు రంగుల చిలకా...
గానం : ఎస్.పి.బాలసుబ్రమణ్యం, పి.సుశీల
రచన : వేటూరి
సంగీతం : చక్రవర్తి

పల్లవి : ఓ బంగరు రంగుల చిలకా పలకవే
ఓ అల్లరి చూపుల రాజా ఏమనీనా మీద ప్రేమే ఉందనీ..నా పైన అలకే లేదనీ
ఓ అల్లరి చూపుల రాజా పలకవా
ఓ బంగరు రంగుల చిలకా ఏమనీ ....నా మీద ప్రేమే ఉందనీ..నా పైన అలకే లేదనీ

చరణం : పంజరాన్ని దాటుకునీ..
బంధనాలు తెంచుకునీ..నీ కోసం వచ్చా ఆశతో
మేడలోని చిలకమ్మా..మిద్దెలోని బుల్లెమ్మా..
నిరుపేదను వలచావెందుకే
నీ చేరువలో.. నీ చేతులలో.. పులకించేటందుకే ..
(ఓ బంగరు రంగుల చిలకా పలకవే)

చరణం : సన్నజాజి తీగుంది..తీగ మీద పువ్వుంది..
పువ్వులోని నవ్వే నాదిలే
కొంటె తుమ్మెదొచ్చింది..జుంటి తేనె కోరింది..
అందించే భాగ్యం నాదిలే
ఈ కొండల్లో..ఈ కోనల్లో..మనకెదురే లేదులే

ఓ అల్లరి చూపుల రాజా పలకవా
ఓ బంగరు రంగుల చిలకా ఏమనీ
నా మీద ప్రేమే ఉందనీ..నా పైన అలకే లేదనీ

స్వయంవరం

వందేమాతం శ్రీనివాస్ సంగీతంలో వచ్చిన పాటల్లో నాకు ఇది ది బెస్ట్ అనిపించిన పాట...చాల చాలా ఇష్టమైన పాట
మరల తెలుపనా...
గానం : చిత్ర
సంగీతం : వందేమాతరం శ్రీనివాస్.

మప మప ని రిమ రిమ స ఆ ఆ ఆ...

పల్లవి : మరల తెలుపనా ప్రియా మరల తెలుపనా
ఎదలోయల దాచుకున్న మధురోహల పరిమళాన్ని
కనుపాపలో నింపుకున్నా చిరునవ్వుల పరిచయాన్ని - మరల తెలుపనా

చరణం : విరబూసిన వెన్నెలలో తెర తీసిన బిడియాలని-2
అణువణువు అల్లుకున్న అంతులేని విరహాలని -2
నిదురపోని కన్నులలో పవళించు ఆశలని
చెప్ప లేక చేతకాక మనసుపడే తడబాటుని - మరల తెలుపనా

చరణం : నిన్న లేని భావమేదొ కనులు తెరిచి కలయచూచి - 2
మాటరాని మౌనమేదో పెదవి మీద ఒదిగిపోయి
ఒక క్షణమే ఆవేదన మరు క్షణమే ఆరాధన
తెలిరరాక తెలుపలేక మనసు పడే మధుర బాధ..
మరల తెలుపనా ప్రియా మరల తెలుపనా....

సీతాకోకచిలుక

మాటే మంత్రమూ....
గానం: ఎస్.పి.బాలసుబ్రమణ్యం, ఎస్.పి.శైలజ
సంగీతం: ఇళయరాజా
రచన: వేటూరి

ఓం శతమానం భవతి శతాయుః పురుష
శతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి దిష్ఠతీ !

పల్లవి : మాటే మంత్రమూమనసే బంధమూ
ఈ మమతే ఈ సమతే మంగళ వాద్యమూ
ఇది కళ్యాణం కమనీయం జీవితం... - మాటే మంత్రమూ
చరణం : నీవే నాలో స్పందించినా
ఈ ప్రియ లయలో శృతి కలిసే ప్రాణమిదే
నేనే నీవుగా..పూవూ తావిగా
సంయోగాల సంగీతాలు విరిసే వేళలో - మాటే మంత్రమూ

చరణం : నేనే నీవై ప్రేమించినా
ఈ అనురాగం పలికించే పల్లవివే
ఎదనా కోవెలా.. ఎదుటే దేవతా
వలపై వచ్చి వరమే ఇచ్చి కలిసే వేళలో

మాటే మంత్రమూ..మనసే బంధమూ
ఈ మమతే ఈ సమతే మంగళ వాద్యమూ
ఇది కళ్యాణం కమనీయం జీవితం !

అంతఃపురం

నాకు చాలా ఇష్టమైన పాట.............
వెన్నెల్లో నడిచే మబ్బుల్లాగ.....

గానం :చిత్ర
సంగీతం :ఇళయరాజా


కళ్యాణం కానుంది కన్నె జానకి కీ
వైభోగం రానుంది రామచంద్రునికి
దేవతలే దిగి రావాలి జరిగే వేడుకకీ
రావమ్మా సీతమ్మా సిగ్గు దొంతరలో
రావయ్యా రామయ్యా పెళ్ళి శోభలలో


పల్లవి : వెన్నెల్లో నడిచే మబ్బుల్లాగ
వర్షంలో తడిసే సంద్రంలాగా
ఊరేగే పువ్వుల్లో చెలరేగే నవ్వుల్లో
అంతా సౌందర్యమే అన్నీ నీ కోసమే - వెన్నెల్లో


చరణం : నాలో ఎన్ని ఆశలో అలల్లా పొంగుతున్నవి
నీతో ఎన్ని చెప్పినా మరెన్నో మిగులుతున్నవి
కళ్ళల్లోనే వాలి నీలాకాశం అంతా ఎలా ఒదిగిందో

ఆ గగనాన్నే ఏలే పున్నమిరాజు ఎదలో ఎలా వాలాడో
నక్షత్రాలన్నీ ఇలా కలలై వచ్చాయో ,చూస్తూనే నిజమై అవి ఎదుటే నిలిచాయో
అణువణువు అమృతంలో తడిసింది అధ్భుతంగా


చరణం : ఇట్టే కరుగుతున్నది మహా ప్రియమైన ఈ క్షణం
వెనుకకు తిరగనన్నది ఎలా కాలాన్ని ఆపడం
కదిలామంతే నేడు తీయని స్మృతిలా చేరి ఎటో పోతుంది
కావాలంటే చూడు ఈ ఆనందం మనతో తనూ వస్తుంది
ఈ హాయి అంతా మహా భద్రంగా దాచి, పాపాయి చేసి,
నా ప్రాణాలే పోసి, నూరేళ్ళ కానుకల్లే నీ చేతి కీయలేనా

ఆకాశం అంతఃపురమయ్యింది నాకోసం అందిన వరమయ్యింది
రావమ్మ మహరాణి ఏలమ్మా కాలాన్ని
అందీ ఈ లోకమే అంతా సౌందర్యమే....

ఆకాశం అంతఃపురమయ్యింది నాకోసం అందిన వరమయ్యింది....

Monday, December 24, 2007

పొడగంటిమయ్య మిమ్ము

పొడగంటిమయ్య మిమ్ము పురుషోత్తమా మమ్ము
పొడగంటిమయ్య మిమ్ము పురుషోత్తమా మమ్ము
నెడయకవయ్య కోనేటి రాయడా

కోరిమమ్ము నేలినట్టి కులదైవమా,
చాలనేరిచి పెద్దలిచ్చిన నిధానమా
గారవించి దప్పిదీర్చు కాలమేఘమా,
మాకుచేరువజిత్తములోని శ్రీనివాసుడా

భావింప గైవసమైన పారిజాతమా,
మమ్ముచేవదేర గాచినట్టి చింతామణీ
కావించి కోరికలిచ్చే కామధేనువా,
మమ్ముతావై రక్షించేటి ధరణీధరా

చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా,
రోగాలడచి రక్షించే దివ్యౌషధమా
బడిబాయక తిరిగే ప్రాణబంధుడా,
మమ్ముగడియించినట్టి శ్రీ వేంకటనాథుడా

కొండలలో నెలకొన్న....


కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు

కొండలంత వరములు గుప్పెడు వాడు....


కుమ్మర దాసుడైన కురువరతినంబి

యిమ్మన్న వరములెల్ల నిచ్చిన వాడు

దొమ్ములు సేసిన యట్టి తొండ మాం చక్కుర వర్తి

రమ్మన్న చోటికి వచ్చి నమ్మిన వాడు..


అచ్చపు వేడుకతోడ ననంతాళు వారికి

ముచ్చిలి వెట్టికి మన్ను మోచిన వాడు

మచ్చిక దొలక దిరుమలనంబి తోడుత

నిచ్చనిచ్చ మాటలాడి నొచ్చిన వాడు..


కంచిలోనుండ తిరుకచ్చినంబి మీద

కరుణించి తనయెడకు రప్పించిన వాడు

ఎంచి యెక్కుడైన వేంకటేశుడు మనలకు

మంచివాడై కరుణ బాలించినవాడు