Monday, February 7, 2011

విలేజ్ లో వినాయకుడు

చినుకై వరదై సెలయేటి తరగై...
సంగీత సాహిత్యాల పర్ ఫెక్ట్ జోడీ ...

గానం : హరి హరన్,శ్వేతా మోహన్
సంగీతం :మణికాంత్ కద్రి
రచన :వనమాలి

చినుకై వరదై సెలయేటి తరగై...
ఉరికే మదిని కడలల్లె కరిగించి కలిపేసుకున్నావు..
వరమై వలపై అనుకోని మలుపై...
కలలే చూపే కనుపాప తెర మీద తొలి వేకువైనావు...

తీసే ప్రతి శ్వాస,నీ తలపవుతున్నది...
రేగే ప్రతి ఆశ, నువు కావాలన్నది...

నా నీడ నను వీడి నిను చేరుకున్నది...
నా నీడ నను వీడి నిను చేరుకున్నది...

చినుకై వరదై సెలయేటి తరగై...
తడి లేని నీరున్నదేమో,సడి లేని ఎద ఉన్నదేమో..
నువు లేక నేనున్న క్షణమున్నదా...

నాలోని ఏనాటి చెలిమో
నిను చేరి మనిషైనదేమో
ఈ వేళ నిను వదిలి రానన్నదా
ఏ రూపమూ లేని ఆకాశమే నీవు
నా నీలి వర్ణాలు నిను వీడి పోలేవు
ఏ బంధమూ లేని ఆనందమే నీవు
తోడు వచ్చి నాకిపుడు.. తొలి బంధువైనావు...
ఆకాశమే నీతో అడుగేయమన్నది..
ఆకాశమే నీతో అడుగేయమన్నది..

చినుకై వరదై సెలయేటి తరగై..
మన వలపు కథ విన్నదేమో..
ఆ కలల కబురందెనేమో..
ప్రతి ఋతువు మధుమాసమవుతున్నదీ...

పసితనపు లోగిళ్ళలోకి
నీ మనసు నను లాగెనేమో
నా వేలు నిను వీడనంటున్నదీ
ఆరారు కాలాలు.. హరివిల్లు విరియనీ
ఆ నింగి తారల్లె.. మన ప్రేమ నిలవనీ
ఈ మనసు కొలువైన.. తొలి చోటే నీదనీ
నా కలలు నిజమవ్వగా..ఆ విధినైనా గెలవనీ.
లోకాలు కనలేని తొలి జంట మనదనీ..
లోకాలు కనలేని తొలి జంట మనదనీ..

చినుకై వరదై సెలయేటి తరగై..
వరమై వలపై అనుకోని మలుపై..

No comments: