ఏదో ... వప్పుకోనంది నా ప్రాణం
సంగీతం: మణి శర్మ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: సైంధవి
ఏదో ... వప్పుకోనంది నా ప్రాణం..
అది ఏదో .. చెప్పనంటోంది నా మౌనం..
ఉబికి వస్తుంటే సంతోషం , అదిమిపెడుతోందే ఉక్రోషం
తన వెనుక నేనూ, నా వెనుక తానూ
ఎంతవరకీ గాలి పయనం అడగదే ఉరికే ఈ వేగం ....
ఎదో ఎదో ఏదో .. వప్పుకోనంది నా ప్రాణం
అది ఏదో .. చెప్పనంటోంది నా మౌనం
ముల్లులా బుగ్గను చిదిమిందా,
మెల్లగా సిగ్గును కదిపిందా ,
వానలా మనసును తడిపిందా ,
వీణలా తనువును తడిమిందా ,వీణలా తనువును తడిమిందా
చిలిపి కబురు ఏం విందో ... వయసుకేమి తెలిసిందో
చిలిపి కబురు ఏం విందో .. .వయసుకేమి తెలిసిందో
ఆదమరుపో ,ఆటవిడుపో , కొద్దిగా నిలబడి చూద్దాం.......ఓ క్షణం ..
అంటే .. కుదరదంటోంది నా ప్రాణం
కాదంటే .. ఎదురు తిరిగింది నా హృదయం ....
************************************************
ఏదో .. వప్పుకోనంది నా ప్రాణం
అది ఏదో .. చెప్పలేనంది ఏ వైనం
కలతపడుతుందే లోలోనా , కసురుంటుందే నా పైనా
తన గుబులు నేనూ , నా దిగులు తానూ
కొంచెమైనా పంచుకుంటే తీరిపోతుందేమో భారం ...
ఎదో ఎదో ఏదో .. వప్పుకోనంది నా ప్రాణం
అది ఏదో .. చెప్పలేనంది ఏ వైనం
పచ్చగా ఉన్నా పూదోటా .. నచ్చడం లేదే ఈ పూటా
మెచ్చుకుంటున్నా ఊరంతా .. గిచ్చినట్టుందే నన్నంతా (2)
ఉండలేను నెమ్మదిగా , ఎందుకంటే తెలియదుగా
ఉండలేను నెమ్మదిగా , ఎందుకంటే తెలియదుగా
తప్పటడుగో .. తప్పు అనుకో,తప్పదే తప్పుకు పోదాం ..తక్షణం ..
అంటూ .. అడ్డుపడుతుంది ఆరాటం
పదమంటూ .. నెట్టుకెడుతోంది నను సైతం....
No comments:
Post a Comment