Monday, February 7, 2011

బాణం

నాలో నేనేనా ఏదో అన్నానా

సంగీతం : మణి శర్మ
గానం : హేమచంద్ర ,సైంధవి

నాలో నేనేనా ఏదో అన్నానా నాతో నేలేని మైమరపునా
ఏమో అన్నానేమో, నువ్వు విన్నావేమో
విన్న మాటేదో నిన్నడగనా
అలా సాగిపోతున్న నాలోన ,ఇదేంటిలా కొత్త ఆలోచన
మనసే నాది మాటే నీది....ఇదేం మాయో

నాలో నేనేనా ఏదో అన్నానా నాతో నేలేని మైమరపునా
ఏమో అన్నానేమో ,నువ్వు విన్నావేమో
చిన్న మాటేదో నిన్నడగనా

అవును కాదు తడబాటునీ అంతో ఇంతో గడిదాటనీ
విడి విడి పోనీ పరదాని పలుకై రానీ ప్రాణాన్నీ
ఎదంతా పదాల్లోన్న పలికేనా నా మౌనమే ప్రేమ ఆలాపన
మనసే నాది మాటే నీది,ఇదేం మాయో

నాలో నేనేనా ఏదో అన్నానా నాతో నేలేని మైమరపునా
ఏమో అన్నానేమో, నువ్వు విన్నావేమో
చిన్న మాటేదో నిన్నడగనా

దైవం వరమై దొరికిందనీ నాలో సగమై కలిసిందనీ
మెలకువ కానీ హృదయాన్ని చిగురై పోనీ శిశిరాన్ని
నీతో చెలిమి చెస్తున్న నిమిషాలు నూరేళ్ళుగా ఎదిగిపోయాయి ఇలా
మనమే సాక్షం మాటే మంత్రం.....ప్రేమే బంధం

నాలో నేనేనా ఏదో అన్నానా నాతో నేలేని మైమరపునా
ఏమో అన్నానేమో, నువ్వు విన్నావేమో
చిన్న మాటేదో నిన్నడగనా .....

No comments: