చిలిపిగ చూస్తావలా...
సంగీతం: హారిస్ జయరాజ్
సాహిత్యం: వనమాలి
గానం: కార్తీక్
చిలిపిగ చూస్తావలా,పెనవేస్తావిలా ,నిన్నే ఆపేదెలా ...
చివరకి నువ్వే అలా ,వేస్తావే వలా,నీతో వేగేదెలా ...
ఓ ప్రేమా ...కన్నుల్లో వాలే రోజు ఎంతో బాగుందనీ కలా..
కొన్నాళ్ళే ...అందంగా ఊరిస్తోందీ ఆపై చేదెక్కుతోందిలా..
కడదాకా ప్రేమించే దారేదో పోల్చేదెలా.

నిన్నే ఇలా ,చేరగా ,మాటే మార్చీ మాయే చెయ్యాలా
నన్నే ఇకా ,నన్నుగా,ప్రేమంచనీ ప్రేమేలా
ఊపిరే ఆగేదాకా,ఏదో ఒక తోడుండాలా
నన్నింతగా , ఊరించేస్తూ అల్లేస్తుందే నీ సంకెలా
కొంచెం మధురము,కొంచెం విరహము ,ఇంతలో నువ్వు నరకం
కొంచెం స్వర్గము,కొంచెం శాంతము ,గొంతులో చాలు గరళం
కొంచెం పరువము ,కొంచెం ప్రణయము,గుండెనే కోయు గాయం
కొంచెం మౌనము,కొంచెం గానము ,ఎందుకీ ఇంద్రజాలం
ఇన్నాళ్ళుగా ,సాగినా ప్రేమనుంచి వేరై పోతున్నా
మళ్ళీ మరో , గుండెతో స్నేహం కోరీ వెళుతున్నా
ప్రేమనే ,దాహం తీర్చేసాయం కోసం వేచానిలా
ఒక్కోక్షణం , ఆ సంతోషం , నాతో పాటు సాగేదెలా ఎలా
చిలిపిగ చూస్తావలా,పెనవేస్తావిలా ,నిన్నే ఆపేదెలా ...
చివరకి నువ్వే అలా ,వేస్తావే వలా,నీతో వేగేదెలా ...
ఓ ప్రేమా ...కన్నుల్లో వాలే రోజు ఎంతో బాగుందనీ కలా..
కొన్నాళ్ళే ...అందంగా ఊరిస్తోందీ ఆపై చేదెక్కుతోందిలా..
కడదాకా ప్రేమించే దారేదో పోల్చేదెలా.
కొంచెం మధురము,కొంచెం విరహము ,ఇంతలో నువ్వు నరకం
కొంచెం స్వర్గము,కొంచెం శాంతము ,గొంతులో చాలు గరళం
కొంచెం పరువము ,కొంచెం ప్రణయము,గుండెనే కోయు గాయం
కొంచెం మౌనము,కొంచెం గానము ,ఎందుకీ ఇంద్రజాలం
No comments:
Post a Comment